జగన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి 11 నిమిషాలు ఉండి వెళ్లిపోతున్న సమయంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను పలకరించి.. పిలుచుకుని తన పక్కన నడిపించుకుని మాట్లాడుకుంటూ తీసుకెళ్లారు. ఓ సారి వచ్చి కలవమని చెప్పారు కూడా. జగన్ అలా పిలవడంతో దువ్వాడ కూడా వెళ్లి జగన్ ను కలుస్తానని ప్రకటించారు. పార్టీ తరపున మాట్లాడాలని జగన్ ఈ సందర్భంగా ఎమ్మెల్సీని కోరినట్లుగా చెబుతున్నారు.
దువ్వాడను గతంలో వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు. ఎందుకు సస్పెండ్ చేశారో కారణాలు చెప్పలేదు. ఆయన వివాహేతర బంధం పెట్టుకుని .. భార్య పిల్లల్ని వదిలేసి ఇతర మహిళతో కలిసి ఉంటున్నారు. రీల్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నారు. ఇదంతా పార్టీ ఇమేజ్ కు భంగం అని సస్పెండ్ చేశారన్న ప్రచారం జరిగింది. కానీ అసలు నిజం మాత్రం.. ధర్మాన సోదరులతో పొసగకపోవడం వల్ల సస్పెండ్ చేశారు. వారు పట్టుబట్టారని జగన్ ఆయనను తరిమేశారు.
కానీ ఇప్పుడు ఆ ధర్మాన సోదరులను బెదిరించడానికో ఏమో కానీ.. మళ్లీ దువ్వాడను పిలిచి మాట్లాడారు. తనను వచ్చి కలవమని చెప్పారు అంటే.. సస్పెన్షన్ ఎత్తివేసి పార్టీలో గుర్తింపు ఇస్తామని సిగ్నల్ ఇవ్వడమే. అంటే ధర్మాన సోదరులను జగన్ వద్దనుకుంటున్నారని అనుకోవచ్చు. తనను పిలిచి మరీ పార్టీలో యాక్టివ్ కావాలని అడుగుతున్నందున దువ్వాడ .. వారిని వదులుకోవాలని షరతులు పెట్టబోతున్నారు. జగన్ తో మాటల తర్వాత మీడియాతో ఆయన అదే అర్థంలో వ్యాఖ్యలు చేశారు. ధర్మాన సోదరుల వల్ల వైసీపీ నాశనం అవుతోందంటున్నారు.
మొత్తానికి దువ్వాడ అవసరం జగన్కు ఉందని అనుకుంటే.. ధర్మానలను వదులుకోవాలి. లేదంటే దువ్వాడ స్వతంత్రంగా పోటీ చేసి.. వైసీపీకి నష్టం చేస్తారు
