చెవిరెడ్డి అడిగారు..! ఎల్వీ చెప్పారు..! సీఈవో పెడుతున్నారు..!

చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు పోలింగ్‌బూత్‌లలో… రీపోలింగ్ నిర్వహించాలన్న ఎన్నికల సంఘం నిర్ణయంపై… ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఏ కారణంతో… పోలింగ్ నిర్వహిస్తున్నారన్న విషయాన్ని మాత్రం బయటకు చెప్పడం లేదు కానీ.. అసలు ఎలా పోలింగ్‌కు అనుమతి ఇచ్చారన్న మిస్టరీ మాత్రం మెల్లగా వీడిపోతోంది. వైసీపీ నేతలు, ఈసీ, ఎల్వీ సుబ్రహ్మణ్యం సుదీర్ఘంగా చర్చించుకున్న తర్వాతనే… అసలు రీపోలింగ్‌ వ్యూహం ఖరారయిందని… అప్పటి నుంచి ఇప్పటి వరకూ జరిగిన పరిణామాలను బట్టి అర్థం చేసుకోవచ్చు.

రీపోలింగ్ పెట్టాలని ద్వివేదీకి ఎల్వీ లేఖ..!

ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీకి.. ఎన్నికల విధుల్లో జోక్యం చేసుకునే అధికారం లేదు. కానీ.. ఎల్వీ సుబ్రహ్మణ్యం.. అదే పనిగా ద్వివేదీ అధికారాల్లో తలదూర్చారు. చంద్రగిరి నియోజకవర్గంలో… చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి… చెబుతున్నట్లుగా.. ఏడు పోలింగ్ బూత్‌లలో.. రీపోలింగ్‌ నిర్వహించాలని… ఆయన కొద్ది రోజుల క్రితం నేరుగా ద్వివేదీకి లేఖ రాశారు. అంతకు రెండు రోజుల ముందు.. అంటే.. పోలింగ్ జరిగిన ఇరవై ఐదు రోజుల తర్వాత… అప్పుడే ఏదో తెలిసినట్లు… వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. ఏడు పోలింగ్ బూత్‌లలో.. అక్రమాలు జరిగాయని.. రీపోలింగ్ నిర్వహించాలని… సీఈవోకి వినతి పత్రం ఇచ్చారు. ఏమైనా జరిగి ఉంటే.. పోలింగ్ ముగిసిన తర్వాత ఫిర్యాదు చేయాలి.. కానీ ఇరవై ఐదు రోజుల తర్వాత ఫిర్యాదు చేయడం ఏమిటన్న చర్చ వచ్చింది. కానీ.. చెవిరెడ్డి ఫిర్యాదు చేయడం.. వెంటనే ఎల్వీ చర్యలు తీసకోవాలని లేఖ రాయడం.. ఆ వెంటనే… సీఈవో కూడా.. రీపోలింగ్‌కు సిఫార్సు చేస్తూ… సీఈసీకి లేఖ పంపడంతో.. ఓ ప్లాన్ ప్రకారం అంతా జరిగిపోయినట్లు తేటతెల్లమవుతోంది.

మిథున్ రెడ్డి రహస్య చర్చలు ఇందుకేనా..?

కొన్నాళ్ల క్రితం.. ఓ ఆదివారం పూట…చిత్తూరు జిల్లాకు చెందిన వైసీపీ నేత మిథున్ రెడ్డి… ఏపీ సీఈవో కార్యాలయానికి వచ్చారు. దాదాపుగా గంటా.. గంటన్నర సేపు రహస్యంగా చర్చలు జరిపారు. దేని గురించో చెప్పకుండా.. వెళ్లిపోయారు. ఆ చర్చల ఫలితాలు ఇప్పుడు బయటపడుతున్నాయని.. టీడీపీ నేతలు అంటున్నారు. ఎన్నికల సంఘం నియమించిన సీఎస్ అయిన ఎల్వీ సుబ్రహ్మణ్యం.. తాను బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి.. పనులు చక్కబెట్టే వ్యవహారాలే నడుపుతున్నారు. ఓ వైపు.. కిడ్నీ రాకెట్ లో దొరికిపోయిన సింహపురి ఆస్పత్రిని కాపాడేందుకు కొంత మంది అధికారుల్ని బలిపశువుల్ని కూడా చేసేందుకు వెనుకాడలేదు. ఇప్పటికే… ఎన్నికల నిర్వహణ విషయంలో పలుమార్లు వైసీపీకి అనుకూలంగా నిర్ణయాల కోసం.. సీఈవోకి లేఖలు రాశారు. వైసీపీ నేతలతో.. అత్యంత సన్నిహిత సంబంధాలు నడుపుతూ.. నిబంధనలకు విరుద్ధంగా.. ప్రజలకు అనుమానం కలిగినా.. సరే… వారికి అనుకూలమైన నిర్ణయాలు తీసుకునేందుకు వెనుకాడటం లేదు.

టీడీపీ ఫిర్యాదులు ఎందుకు పట్టించుకోలేదు..!

నిజానికి.. చంద్రగిరి నియోజకవర్గంలో పరిస్థితి మొదటి నుంచి ఉద్రిక్తంగానే ఉంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి… ఎన్నికల ప్రకటన రాక ముందు నుంచి .. హడావుడి చేస్తూనే ఉన్నారు. తన నియోజకవర్గంలో.. టీడీపీ సానుభూతి పరుల ఓట్లు కనీసం పదిహేను వేలు తీసేయాలని.. ఆయన ఫామ్‌-7లు పెట్టించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పోలింగ్ తర్వాత టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని… వైసీపీ చేసిన అక్రమాలను సాక్ష్యాలతో సహా వివరించి.. కొన్ని బూత్‌లలో రీపోలింగ్ కు ఫిర్యాదు చేశారు. ఢిల్లీకి వెళ్లి కూడా ఫిర్యాదు చేశారు. కానీ ఎవరూ పట్టించుకోలేదు. ఇరవై ఐదు రోజుల తర్వాత చెవిరెడ్డి ఫిర్యాదు చేయడం… చర్యలు తీసుకోవాలని ఎల్వీ సుబ్రహ్మణ్యం లేఖ రాయడం… వెంటనే రీపోలింగ్ నిర్వహించాలని ఆదేశించడం జరిగిపోయాయి. ఇవన్నీ.. టీడీపీకి పట్టున్న గ్రామాలే కావడం.. అసలు కోణం..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టీడీపీ వర్చువల్ మహానాడు..!

సాంకేతికత ఉపయోగించుకోవడంలో.. టీడీపీ అధినేత చంద్రబాబు ముందు ఉంటారు. కరోనా కాలంలోనూ ఆయన ఈ సాంకేతిక ఆధారంగానే పనులు చక్క బెడుతున్నారు. జూమ్ యాప్‌ను గరిష్టంగా ఉపయోగించుకుంటున్నారు. మహానాడును కూడా డిజిటల్ మయం...

ఏడాది యాత్ర 8: సంపద సృష్టించలేక ఆస్తులు అమ్మి పాలన..!

"భూములమ్ముతున్నారు... ప్రభుత్వం ఏమైనా దివాలా తీసిందా..?" అని హైకోర్టు మొహం మీదనే ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. ఈ డౌట్ హైకోర్టుకు మాత్రమే కాదు.. సామాన్య ప్రజలకూ వస్తోంది. ఎందుకంటే.. ఇప్పటి వరకూ ఉన్న...

‘గైడ్‌లైన్స్’ రూపొందించుకున్న టాలీవుడ్

చిత్ర‌సీమ యావ‌త్తూ 'క్లాప్' కొట్టే ముహూర్తం కోసం ఎదురు చూస్తోంది. మ‌ళ్లీ సెట్లు క‌ళ‌క‌ళ‌లాడే రోజు కోసం క‌ల‌లు కంటోంది. జూన్‌లో చిత్రీక‌ర‌ణ‌లు మొద‌ల‌వుతాయి. అయితే.. కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చే గైడ్ లైన్స్‌కి...

త్రివిక్ర‌మ్‌కి రీమేకులు వ‌ర్క‌వుట్ అవుతాయా?

స్వ‌త‌హాగా ర‌చ‌యిత‌లైన ద‌ర్శ‌కులు రీమేక్‌ల‌ను అంత‌గా ప్రోత్స‌హించ‌రు. కార‌ణం.. వాళ్ల ద‌గ్గ‌రే బోలెడ‌న్ని క‌థ‌లుంటాయి. త్రివిక్ర‌మ్ ఇప్ప‌టి వ‌ర‌కూ రీమేక్ జోలికి వెళ్ల‌లేదు. హాలీవుడ్ క‌థ‌ల్ని, న‌వ‌ల‌ల్ని, పాత సినిమాల్నీ స్ఫూర్తిగా తీసుకుని...

HOT NEWS

[X] Close
[X] Close