నన్ను టార్గెట్ చేసుకోండి..వాళ్ళని కాదు: చిదంబరం

మాజీ కేంద్ర ఆర్ధిక మంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తి, అతని స్నేహితుల చెన్నైలోని సంస్థలపై ఎన్ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ మరియు ఆదాయపన్ను శాఖ అధికారులు కలిసి మంగళవారం దాడులు చేసి కొన్ని ముఖ్యమయిన పత్రాలను స్వాధీనం చేసుకొన్నారు. వారికి చెందిన సంస్థలు ఆదాయపన్ను ఎగవేసినట్లు అనుమానంతో ఆదాయపన్ను శాఖ అధికారులు తణికీలు నిర్వహించగా, ఫారిన్ ఎక్స్ చేంజ్ మేనేజిమెంట్ యాక్ట్ నిబంధనలు ఉల్లంఘించి హవాలా పద్దతిలో అక్రమంగా విదేశాలకు డబ్బు తరలించడం, రప్పించుకోవడం చేస్తున్నారనే అనుమానంతో ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు తణికీలు నిర్వహించినట్లు తెలిపారు. ఒక ప్రముఖ కంటి చికిత్స వైద్య సంస్థల గ్రూపులో కార్తి పెట్టుబడులు పెట్టినట్లు వారు అనుమానిస్తూ వాటిలో కూడా నేడు తణికీలు చేసారు.

దీనిపై కార్తి స్పందిస్తూ “ప్రభుత్వం నుండి ఇటువంటి వేధింపులు ఎదురవుతాయని మేము అనుకొంటూనే ఉన్నాము. అందుకు మేము మానసికంగా సిద్దంగా ఉన్నాము. మాపై ఎన్ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ మరియు ఆదాయపన్ను శాఖ అధికారులు ఈవిధంగా దాడులు చేయడం ఎందుకో మేము ఊహించగలము. అధికారులు అడిగిన ప్రతీ ప్రశ్నకి మావద్ద ఆధారాలతో సహా జవాబులున్నాయి. కనుక మేము భయపడవలసిన అవసరం లేదని అనుకొంటున్నాను,” అని అన్నారు.

పి.చిదంబరం కూడా దీనిపై స్పందిస్తూ “ఒకవేళ ప్రభుత్వం మమ్మల్ని ఈ విధంగా వేధించాలనుకొంటే వాటిని ఎదుర్కోవడానికి మేము సిద్దం. కానీ నా కొడుకు కార్తికి స్నేహితులయిన కారణంగా అందరినీ వేదిస్తామనడం సబబు కాదు. వారందరూ చట్టబద్దంగానే వ్యాపారాలు చేసుకొంటూ ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్నారు. నేను ఆర్దికమంత్రిగా చేస్తున్నపుడు ఎన్ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ లో పనిచేస్తున్న ఒక ఉన్నతాధికారి ఆర్ధిక, రెవెన్యూ డిపార్ట్ మెంటుకి సంబంధించి ఒక కేసులో ఇరుకొన్నారు. ఆ కేసులో నుంచి బయటపడేందుకు ఆయన నా సహాయం కోరారు. కానీ అంతకు ముందు ఆర్ధికమంత్రి ఇచ్చిన ఆదేశాలను నేను మార్చబోనని చెప్పాను. ఆయన దానిని మనసులో పెట్టుకొని ఇప్పుడు ప్రభుత్వం మారగానే మా కుటుంబ సభ్యుల, మా మిత్రుల కుటుంబాలకు చెందిన సంస్థలపై దాడులు చేయిస్తూ ప్రతీకారం తీర్చుకొంటున్నారని నాకు తెలుసు. కానీ వారు దాడులు చేస్తున్న సంస్థలన్నీ చట్టబద్దంగా వ్యాపారాలు చేస్తున్నావే. కనుక ప్రభుత్వం వారిని వేధించే బదులు మమ్మల్ని టార్గెట్ చేసుకొంటే దానిని ఎదుర్కోవడానికి మేము సిద్దంగా ఉన్నాము,” అని అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close