ఢిల్లీ లిక్కర్ కేసును మళ్లీ కదిలించిన ఈడీ..మరో అరెస్ట్ !

ఢిల్లీ లిక్కర్ స్కాంలో అంతా సైలెంట్ అయిపోయింది. కానీ హఠాత్తుగా ఈడీ రంగంలోకి దిగి.. దినేష్ అరోరా అప్రూవర్ ను అరెస్ట్ చేసింది. అంతే కాదు ఆయన నిజాలు చెప్పడం లేదని.. కస్టడీ పిటిషన్ వేసింది. దినేష్ అరోరా .. సౌత్ లాబీ నుంచి ముడుపులు తీసుకుని.. మనీష్ సిసోడియాకు ఇచ్చారనేది అభియోగం. దీన్ని ఆయన అంగీకరించి.. అప్రూవర్ గా మరి చాలా కాలం కిందటే బ యటకు వచ్చారు. సిసోడియా లోపలకు వెళ్లారు.ఇప్పుడు మళ్లీ ఈడీ ఆయన నిజాలు చెప్పడం లేదని అరెస్ట్ చేసింది.

ఇటీవల శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారారు. ఆయనేం చెప్పారో తెలియదు కానీ.. మొత్తం సీన్ మారిపోయిందన్న ప్రచారం జరిగింది. కానీ ఇన్ని రోజులు సైలంట్ గా ఉన్న ఈడీ మళ్లీ ఇప్పుడు రంగంలోకి దిగింది. దినేష్ అరోరా చెప్పాల్సిన నిజాలేమిటో తెలుసుకుని.. చర్యలు ప్రారంభిస్తందో లేకపోతే.. అసలు కేసులో అరెస్టయి జైల్లోఉన్న వారంతా ఇంకా ఎంత కాలం అని అని చెప్పి బెయిల్ అడుగుతారన్న ఉద్దేశంతో ఏమో కానీ.. మరొకరి అరెస్టుని చూపించింది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఒక్క కవిత తప్ప అందరూ అరెస్టయ్యారు. కవితను అరెస్ట్ చేయడమే తరువాయన్నట్లుగా హడావుడి చేశారు కానీ ఆగిపోయారు. ఆమెకు చెందిన పది ఫోన్లను తీసుకుని సైలెంట్ అయిపోయారు. దీంతో రెండు పార్టీల మధ్య ప్యాచప్ అయిపోయిందన్న ప్రచారం జరిగింది. ఇది తెలంగాణలో బీజేపీని డ్యామేజ్ చేసింది. ఇప్పుడు దినేష్ అరోరా అరెస్ట్ నుంచి కొత్తగా ఏమైనా ప్రారంభిస్తారా లేదా అన్నది.. ముందు ముందు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close