ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు ఈడీ పిలుపు – వెళ్తారా !?

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు పెంచింది. కవితకు నోటీసులు పంపింది. శుక్రవారం ఈడీ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. సౌత్ లాబీలో అందరూ అప్రూవర్లు అయ్యారు. నిందితులు అందరూ తాము స్కామ్ చేశామని ఒప్పుకుని అప్రూవర్ అయ్యారు. కవిత ఒక్కరే ఏకాకిగా మిగిలారు. కవిత బినామీగా ఈడీ ప్రకటించిన రామచంద్ర పిళ్లై కూడా అప్రూవర్ అయి మొత్తం ఈడీకి గుట్టు విప్పారు.

ఇటీవల మాగుంట శ్రీనివాసులరెడ్డి కూడా అప్రూవర్ అయ్యారు. మొత్తంగా సౌత్ లాబీ నుంచి ఒక్క కవిత మాత్రమే నిందితురాలిగా ఉండిపోయారు. ఈ క్రమంలో ఈడీ నోటీసులు వచ్చాయి. గతంలోనే అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరిగింది కానీ పెండింగ్‌లో పడిపోయింది. ఇప్పుడు సమయం వచ్చిందేమో కానీ ఈడీ మళ్లీ వేగంగా ముందుకు కదులుతుంది. అయితే ఈ కేసులో ఈడీ సీరియస్‌గా ఉందా లేదా.. ప్రత్యేకపార్లమెంట్ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ మద్దతు కోసం కొత్త గేమా అన్నది స్పష్టత రావాల్సి ఉంది.

శుక్రవారం కవిత ఈడీ ఎదుటకు హాజరైన తర్వాత జరిగే పరిణామాలను బట్టి ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ ఎందుకు ఉత్సాహం చూపిస్తుందన్నది స్పష్టమవుతుంది. నాలుగు రోజుల్లో ప్రత్యేక పార్లమెంట్ సమవేశాలు ఉన్నాయి. అప్పటికి కవితకు నోటీసుల విషయంలో స్పష్టత వస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

పదేళ్ల తర్వాత ఓయూపై స్పందించిన కేసీఆర్

తెలంగాణ ఉద్యమ సమయంలో నిత్యం ఓయూను పలవరించిన కేసీఆర్.. గద్దెనెక్కాక ఒక్కసారి కూడా ఓయూను సందర్శించలేదు. విద్యార్థులు రోడ్డెక్కి ప్రొఫెసర్లను నియమించాలని,స్కాలర్ షిప్స్ పెంచాలని, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్...

నోరు జారిన ర‌చ‌యిత‌.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

తోట‌ప‌ల్లి మ‌ధు... ఈ త‌రానికి పెద్ద‌గా ఈ ర‌చ‌యిత పేరు తెలియ‌క‌పోవొచ్చు కానీ, 90ల్లో వ‌చ్చిన కొన్ని సినిమాల‌కు ఆయ‌న మాట‌లు అందించారు. కొన్ని పెద్ద హిట్లు కొట్టారు. న‌టుడిగానూ త‌న‌దైన ముద్ర...

బడా బాయ్ కి కోపమొచ్చింది… ఛోటా బాయి కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close