మహారాష్ట్రలో ఏర్పడింది ఈడీ ప్రభుత్వమేనని ఏక్నాథ్ షిండే, దేవేంద్రఫడ్నవీస్ నొక్కి చెబుతున్నారు. ఈడీ అంటే వీరిద్దరే అని వీరంటున్నారు..కానీ బయట మాత్రం ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ అని అనుకుంటారు. ఎందుకంటే ఈడీ దాడులతోనే చాలా మంది ఎమ్మెల్యేలు.. దారిలోకి వచ్చారని చెబుతారు. ఇప్పుడు ఈడీ టార్గెట్ జార్ఖండ్ మీద పడినట్లుగా కనిపిస్తోంది. ఏకంగా సీఎంఇంటిపైనా ఈడీ దాడులు చేసింది.
సోదాలు నిర్వహించింది. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌తో పాటు ఆయన సన్నిహితులు ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి. టెండర్ స్కాంపై ఆరోపణలు వచ్చాయని ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. గతంలో సోరెన్‌పై మైనింగ్ ఆరోపణలు ఉన్నాయి.ఆ కేసులోనూ ఈడీ నోటీసులు జారీ చేసింది. విచారణ జరుపుతూ ఉంటుంది. ప్రస్తుతం హేమంత్ సోరెన్ జేఎంఎం నేతగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి ఆయన జార్కండ్ లో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు.
యూపీఏలో ఆయన కీలక సభ్యుడు కూడా. ఈ కారణంగానే దాడులు జరుగుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో ముర్ముకే జేఎంఎఁ మమద్దతుప్రకటించింది. దీంతో ఆయనను కాస్త ట్యూన్ చేయవచ్చని అనుకున్నారేమో కానీ.. ఈడీని ప్రయోగించారన్న ఆరోపణలు వస్తున్నాయి. బీజేపీ ప్లాన్ సక్సెస్ అయితే జార్కండ్లోనూ త్వరలో బీజేపీ- జేఎంఎం ప్రభుత్వం ఏర్పడవచ్చన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. అయితే ఇలాంటివి చాలా సార్లు నియమయ్యాయి కాబట్టి.. సీరియస్సే అనుకోవచ్చని రాజకీయవర్గాలు చెబుతున్నాయి.