ఎడిటర్స్ కామెంట్ : దిగంబర రాజకీయాలు !

” చెప్పిన ఇంపార్టెంట్ విషయాన్ని వదిలేసి పనికి మాలిన డౌట్లు అడిగేవారినే గూట్లే అంటారురా గూట్లే ” అని అంటాడు జల్సా సినిమాలో సునీల్‌తో ధర్మవరపు సుబ్రహ్మణ్యం. అలా ఎందుకు అంటాడంటే.. ప్రాణం మీదకు తెచ్చుకుని ఆస్పత్రిలో చూపించుకోవడానికి వచ్చి అసలు విషయం వదిలేసి వేరే విషయాన్ని వేరే అంశంపై విసిగించడంతో అలా అంటాడని ఆ డైలాగ్‌లోనే అర్థమైపోతుంది. సునీల్ లాంటి వారు మన చుట్టుపక్కల చాలా మంది కనిపిస్తూ ఉంటారు. వారికి ప్రాధాన్యతలు తెలియవు. ఏది అవసరమో.. ఏది అనవసరమో తెలియవు. అలా గాలికి వెళ్తూంటారు. జీవితాన్ని అప్రాథాన్య పద్దతిలో నడిపేస్తూ ఉంటారు. ఇలాంటి వారిలో మనుషులే కాదు ప్రభుత్వాలు కూడా ఉంటాయి. అయితే వ్యక్తులు అలా చేయడం వల్ల వారి కుటుంబమే నష్టపోతుంది. కానీ ఓ ప్రభుత్వం అలా పద్దతి లేకుండా ప్రవర్తిస్తే మాత్రం… ఆ ప్రభుత్వం పాలన కింద ఉన్న ఓటు వేసినా.. ఓటు వేయని ప్రజలందరూ భరించాలి. బంగారు భవిష్యత్ ఉన్న ఆ రాష్ట్రం లేదా దేశం భవిష్యత్ ఏమైపోతుందో భయపడాలి. అలాంటి పరిస్థితులు ఇప్పుడు మనకు పలు చోట్ల కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడిదాకో ఎందుకు ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఉన్న సమస్య ఏమిటి ? ఎవరైనా ఊహించుకోండి. గోదావరి వరదలు రెండో సారి ముంచుకొస్తున్నాయి.. నిర్వాసితులకను మళ్లీ గట్టుకు చేర్చడమా? అప్పులు లేకుండా ఎలా రాష్ట్రాన్ని నడిపించాలని ఆలోచించడమా? డెడ్ లైన్లు పెట్టి పెట్టీ అసలు చెప్పడం మానేసిన రోడ్లను బాగు చేయడమా ?. సంక్షేమ పథకాలు అందం లేదు మహా ప్రభో అని వేల సంఖ్యలో ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న వారి సమస్యలను పరిష్కరించడమా ? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఉన్నాయి. నిజానికి ఈ సమస్యలేమీ పెద్దవి కావు. అసలైన సమస్య వేరే ఉంది. ఆ సమస్య మీదనే అటు అధికార పార్టీ.. ఇటు ప్రతిపక్ష పార్టీ కుస్తీలు పడుతున్నాయి. ప్రజల్ని అవమానిస్తున్నాయి. అవసరమైన విషయాలను వదిలేసి అనవసర విషయాలపై లేనిపోని శక్తియుక్తులను కేంద్రీకరిస్తున్నాయి. అదే గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వివాదం.

మాధవ్ చేసింది నేరం కాదు.. నైతికంగా తప్పు మాత్రమే !

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ది ఓ వివాదాస్పద క్యారెక్టర్. ఆయన కుటుంబంతో ఎలా ఉంటారో తెలియదు కానీ పోలీస్‌గా పబ్లిక్‌తో ఆయన వ్యవహరించిన తీరు కానీ ఎంపీ అయిన తర్వాత చట్టసభ సభ్యుడిగా పారిశ్రామికవేత్తలతో వ్యవహరించిన తీరు కానీ జుగుప్సాకరంగా ఉంటుంది. ఇలాంటి వారినా ఎంపీని చేసుకుంది అని ఆయన మొదటి సారి పార్లమెంట్‌లో మాట్లాడినప్పుడే ఎంపీలందరూ ఆంధ్ర ప్రజల మొహాల మీద నవ్వారు. అప్పుడు ప్రారంభమైంది ఆయన విశ్వరూపం. ఎప్పటికప్పుడు ఏపీ పరువు తీస్తూనే ఉన్నారు. పార్లమెంట్ ప్రాంగణంలో రెబల్‌గా మారిన సొంత పార్టీ ఎంపీని బండ బూతులు తిట్టారు. చంపుతానని బెదిరించారు. అప్పటికీ ఆ ఎంపీకీ ఆయనకు వ్యక్తిగత శత్రుత్వం ఏదో ఉన్నట్లుగా. ఆయన వ్యవహారశైలి పార్లమెంట్ మొత్తం ఓ బ్రాండ్‌గా మారిపోియంది. దీనికి తోడు ఆయన ” ఆన్‌లైన్‌ శృంగారం” చేసిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోను చూసి అందరూ మొహం తిప్పుకున్నారు. ఈ ఎంపీ ఇంత బరి తెగించారా అనుకున్నారు. ఆయన చేసిన పనికి ఆ వీడియో సోషల్ మీడియాలోకి రావడమే పెద్ద శిక్ష. అంతకు మించి ఆయనపై రాజకీయంగా చేయాల్సింది కూడా ఏమీ ఉండదు. పరువు ఏమైనా ఉంటే ఆ వీడియోతోనే పోయి ఉంటుంది. అందరూ చేసేదే కదా …నేను కూడా చేసుకున్నా తప్పేమిటని వాదించి ఉన్నట్లయితే కొంత పరువు అయినా దక్కేది. ఆయన ఎవరితో అయితే ఆన్‌లైన్‌ శృంగారంలో పాల్గొన్నారో అవతలి వారికి ఇష్టాపూర్వకంగానే జరిగి ఉంటుంది. లేకపోతే ఆ మహిళ ఫిర్యాదు చేసేది. అలాంటి ఫిర్యాదులేమీ లేవు. కానీ ఆ మహిళ.. వీడియోను లీక్ చేసిందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దానికి వారి మధ్య ఉన్న డీలింగ్స్ ఏమైనా మిస్ ఫైర్ అయ్యాయో లేదో తెలియదు. కానీ ఆ మహిళ మాత్రం అధికారికంగా బయటకు రాలేదు కాబట్టి… గోరంట్ల మాధవ్.. చట్టంలోని ఏ సెక్షన్ల కింద కూడా నేరస్తుడు కాదు. కేవలం నైతిక ప్రవర్తన మాత్రం గర్హనీయం.

మహిళ ఫిర్యాదు చేసి ఉంటే సరే .. ఏమీ లేని దానికి ఏదో ఘోరం జరిగిపోయినట్లుగా ప్రతిపక్షం వ్యవహారం

ఈ వీడియో విషయంలో తెలుగుదేశం పార్టీ వ్యవహరించిన తీరు మరీ దారుణంగా ఉంది. ఆ వీడియో సోషల్ మీడియాలో ఉంది కాబట్టి.. అక్కడితో పరిమితం చేస్తే సరిపోయేది. కానీ దాన్ని టీవీలకు ఎక్కించారు. తర్వాత చర్చా కార్యక్రమాలు పెట్టించారు. రాజకీయంగా విమర్శలు చేశారు. నిజంగా మహిళ ఫిర్యాదు చేసి ఉంటే.. తెలుగుదేశం పార్టీ ఈ ఎంపీపై చర్యల కోసం పోరాటం చేసి ఉంటే అర్థం ఉండేది. కానీ ఇతర ఏ సమస్యలూ లేనట్లుగా.. ఎంపీ వీడియో ఇష్యూ అదే పనిగా హైలెట్ చేస్తూ.. రాజకీయం చేశారు. మాములుగా ఇది నైతిక ప్రవర్తన కిందకు వస్తుందని.. తాము నైతిక విలువలకు ప్రాధాన్యం ఇస్తామని.. వైసీపీ ప్రకటించాలనకుుంది. అందుకే సజ్జల కఠినాతి కఠినమైన చర్యలంటూ ప్రకటించారు. కానీ చివరిక ఎంపీని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేయడంతో అటు ఆయనా చులకనయ్యారు. ఇటు ప్రభుత్వమూ పలుచబడిపోయింది. అందరూ హవ్వ… అని అనుకోవాల్సిన పరిస్థితి.

టీడీపీదే తప్పని నిరూపించాలని ” అధికారం నెత్తికెక్కిన” పాలకుల తెగింపు !

పోనీ ఈ ఇష్యూ ఇంతటితో వదిలేశారా అంటే.. ప్రభుత్వం ఇక్కడే దిద్దుకోలేని తప్పు చేసింది. నిజానికి ఆ వీడియోను.. అలా నైతిక పరమైన అంశంగా వైఎస్ఆర్‌సీపీ వదిలేసి ఉంటే.. ఎపిసోడ్ అక్కడితో ముగిసిపోయేది. కానీ అది ఫేక్ వీడియో అని నిరూపించాలని ప్రభుత్వం పట్టుదలకు పోయింది. నిజానికి అది ఒరిజినల్ వీడియో కాదు. మాధవ్ వీడియోను వ్యూహాత్మకంగా బయట పెట్టాలనుకున్న వారు తాము బయటపడకుండా కొత్త టెక్నిక్ వినియోగించారు. వారి ఫోన్ లో ప్లే చేస్తూండగా.. ఇతరుల ఫోన్‌తో షూట్ చేసే అవకాశం కల్పించారు. దీని వల్ల ఓ వీడియోను..మరోసారి రికార్డు చేసినట్లయింది. అసలు వీడియో అది లేదు. అయితే ఈ వీడియో ఒరిజినల్ కాదని ఎవరూ అనుకోవడం లేదు. అందులో ఉన్నది వందకు వంద శాతం ఎంపీ గోరంట్ల మాధవేనని అందరూ నమ్ముతున్నారు. చివరికి సజ్జల కూడా నమ్ముతున్నారు. ఆ విషయం వైఎస్ఆర్‌సీపీ నేతలకూ తెలుసు. కానీ టీడీపీ హడావుడి చేస్తుందని ట్రాప్‌లో పడ్డారో లేకపోతే.. తమ ఎంపీని కాపాడుకోవాలని ఆతృత పడ్డారో కానీ.. అనవసరంగా ఆ వీడియోను ఫేక్ అనినిరూపించాలన్న ఓ తాపత్రయంలో తప్పటడుగులు వేయడం ప్రారంభించారు. ఇందు కోసం వ్యవస్థల్ని కూడా దుర్వినియోగం చేస్తున్నారు. ఆ వీడియో వెలుగులోకి వచ్చినప్పటి నుండి అందరూ… ఫోరెన్సిక్ రిపోర్టు గురించి చెప్పడం ప్రారంభించారు. చివరికి అనంతపురం ఎస్పీతో ప్రెస్ మీట్ పెట్టించి.. ఓ ఫోన్ లో ప్లే అవుతున్న వీడియోను మరో ఫోన్ ద్వారా షూట్ చేసినందున.. అది ఒరిజినల్ కాదని చెప్పుకొచ్చారు. ఫోరెన్సిక్ కు పంపలేదన్నారు. ఎస్పీ మాటలతో ప్రజల్లో … పోలీసు వ్యవస్థపై విశ్వాసం మరింత సన్నగిల్లే ప్రమాదం ఏర్పడింది. అయితే అక్కడితోనూ ప్రభుత్వం సర్దుకోలేదు. టీడీపీ ఓ ఆరోపణ చేయడం.. దానికి కౌంటర్ ఇచ్చేందుకు మరో వ్యవస్థను దుర్వినియోగం చేయడం కామన్‌గా మారిపోయింది.

అనంతపురం ఎస్పీ, సీఐడీ చీఫ్‌లను ఇరికించాల్సిన అవసరం ఏముంది?

తాము వీడియోను అమెరికాలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌లో టెస్టు చేయించామని అది అధెంటిక్ అని టీడీపీ ప్రకటిస్తే… తగుదునమ్మా అంటూ సీఐడీని రంగంలోకి దింపారు. ఆ నిపుణుడికి మెయిల్ పెట్టారు. అందులో ముందుగానే సీఐడీ చీఫ్ అది ఫేక్ రిపోర్టు అని చెప్పుకొచ్చారు. ఇంత నిజాయితీని బహిరంగంగా ప్రదర్శిస్తున్న పోలీసు అధికారి వ్యవహారశైలి ఏ వ్యవస్థకైనా శోభనిస్తుందా ? అసలు ఎవరు పిర్యాదు చేస్తే ఈ మెయిల్ పెట్టారు ? గోరంట్ల మాధవ్ ఫిర్యాదు చేశారా? సరే.. అది ఫేక్ రిపోర్ట్ అని సీఐడీ అధికారి ప్రకటించారు.. మరి అదే సమయంలో.. తమ పేరుతో ఫేక్ రిపోర్టు ఇచ్చారని వారివద్ద ఫిర్యాదు తీసుకోవచ్చు కదా.. నిజానికి తమ అసలు రిపోర్టు కూడా సీఐడీ పోలీసులకు పంపామని ఎక్లిప్స్ నిపుణుడు పంపిన మెయిల్‌లో ఉంది. కానీ ఈ రిపోర్ట్ ఏమిటో సీఐడీ అధికారి బయట పెట్టలేదు. అందులో ఫేక్ అని ఉంటే.. అసలు సమస్య తీరిపోయేది కదా ! అయితే అసలు ఫిర్యాదు లేని కేసు విషయంలో ఇలా మెయిల్స్ పెట్టడమే కాకుండా సునీల్ కుమార్ స్వయంగా మీడియా ముందుకు వచ్చి టీడీపీ నేతలపై కేసులు పెడతామని బెదిరించి వెళ్లారు. దీంతో మరోసారి ఇష్యూ వెలుగులోకి వచ్చింది. టీడీపీ నేతలు అందుకున్నారు. మళ్లీ రచ్చ ప్రారంభమయింది. ఎంపీ మాధవ్‌ను ప్రభుత్వం రక్షించడానికి ప్రయత్నిస్తోందని ఇందు కోసం అన్ని పనులు పక్కన పెట్టి వ్యవస్థల్ని సైతం దుర్వినియోగం చేస్తోందన్న అభిప్రాయం ప్రజల్లో బలపడింది.

రాజకీయ పరమైన అంశంలో వ్యవస్థల్ని దుర్వినియోగం చేస్తే ఎవరికి నష్టం ?

ఎంపీ మాధవ్‌ వీడియో నకిలీదని ఎవరూ అనుకోవడం లేదు. కానీ అది నేరం కాదు. నైతిక ప్రవర్తన కిందకు మాత్రమే వస్తుంది. ఇలాంటి విషయాన్ని రాజకీయ అంశం చేయడంలో టీడీపీ సక్సెస్ అయితే.. సొంత పార్టీని ఎంపీని సమర్థించడానికి వ్యవస్థల్ని సైతం దుర్వినియోగంచేస్తున్న వైసీపీ సర్కార్ ప్రజల్లో బ్యాడ్ అయిపోయింది. టీడీపీ ఏం చేస్తోంది.. తాము ఎందుకు ఆ ట్రాప్‌లో పడాల్సి వచ్చిందని కాస్త ఆలోచించి ఉన్నట్లయితే ఇప్పుడు ప్రభుత్వానికి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. స్వయంగా సీఐడీని రంగంలోకి దింపి.., మళ్లీ టీడీపీ నేతలపై మాధవ్ వీడియో విషయంపై తిట్ల పురాణం వినిపించడంతో మరోసారి హైలెట్ అయింది. నన్ను వదిలేయండి బాబోయ్ అని మధవ్ వేడుకుంటున్నా.. కొత్తగా సీఐడీ రిపోర్టు పేరుతో మరోసారి ఆయనను బజారుకు లాగారు. కేసుకు చాన్సే లేని న్యూడ్ వీడియో వివాదంమలో ఇప్పుడు కేసులు నమోదవుతున్నాయి. అయితే… ఇప్పుడు కేసులు నమైదైతే ఎవరు నష్టపోతారు? అధికారం ఉన్నంత కాలం తొక్కి పెట్టగలరు. కానీ సాంకితేక ఆధారాలను ఎవరూ నాశనం చేయలేరు. నిఖార్సుగా ఏదైనా ఏజెన్సీ విచారణ జరిపితే.. అటు అనంతపురం ఎస్పీతో పాటు ఇటు సీఐడీ చీఫ్ కూడా ఇరుక్కుపోవడం ఖాయం. వారు తమ ఆధారాలను మ్యానిప్యులేట్ చేసినట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. అసలు ఎందకూ కొరగాని అంశంలో ఐలా ఐపీఎస్‌లనూ బలి చేసుకునే పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాల్సి వచ్చింది…? మూర్ఖత్వంతో కూడిన మోనార్కిజం వల్ల వచ్చే సమస్యలే ఇవి. రాజకీయాల్లో ప్రశాంతంగా ఆలోచించడం.. ఎదుటి వారి ఆవేశానికి తమ ఆవేశం సమాధానం కాకపోవడం … ఎప్పటికైనా ముఖ్య లక్షణాలు. కానీ ఇక్కడ జరుగుతోంది వేరు.. అధికారంలో ఉన్నాం కాబట్టి.. తాము తప్పు చేసినా.. పగ ప్రతీకారాలు.. శిక్షలు..కేసులు వేరేవారిపై పడాలన్నట్లుగా బరి తెగించడమే రాజకీయ విలువల దిగంబరానికి నిదర్శనం. ఈ వివాదంలోకి కులాలను తెచ్చారు. కుల విద్వేషం చూపించారు. చివరికి పరువును రోడ్డున పడేసుకున్నారు.

ఏపీ అధికార ప్రతిపక్షాలు రెండింటిదీ “గూట్లే” వ్యవహారమే !

ఆ వీడియో అబద్దమని ఆంధ్రప్రదేశ్‌లో కానీ.. ఆ వీడియో చూసిన సామాన్యుల్లో కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా అబద్దమని అనుకోరు. ఎందుకంటే మార్ఫింగ్.. ఎడిటింగ్‌కు తేడా ఈ డిజిటల్ ప్రపంచంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో తమ ఎంపీని వెనకేసుకు రావాలంటే.. మౌనంగా ఉంటే సరిపోయేదికానీ.. తప్పు చేసిన ఎంపీకి బదులుగా.. ప్రతిపక్ష పార్టీనే తప్పు చేసిందని నిరూపించేందుకు తప్పటడుగులు వేయడమే అసలు విషాదం. పాలన మానేసి.. కీలకమైన విషయానలను పక్కన పెట్టి.. తమ ఎంపీ తప్పు చేయలేదని నిరూపించడానికిఅధికార పార్టీ ప్రయత్నిస్తూంటే.. అంతకు మించిన అంశం లేదన్నట్లుగా తెలుగుదేశం పార్టీ రెచ్చిపోయింది. ఏపీ అధికార , ప్రతిపక్ష పార్టీలు రెండింటినీ ముందుగా చెప్పినట్లుగా. ధర్మవరం సుబ్రాహ్మణ్యం డైలాగ్‌తో సత్కరించాల్సిందేనేమో !

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close