ఎడిటర్స్ కామెంట్స్ : ఆఖరి ఓటమే మిగిలింది !

ద పవర్ ఆఫ్ ది పీపుల్ మచ్ స్ట్రాంగర్ దెన్ ద పీపుల్ ఇన్ పవర్ ” ..

అధికారంలో ఉన్న వ్యక్తుల కన్నా ఆ అధికారం ఇచ్చిన ప్రజలకు ఇంకా ఎక్కువ పపర్ ఉంటుంది. ఈ మాటలను ఎవరో సుప్రసిద్ధ రాజకీయ వేత్తలు చెప్పాల్సిన పని లేదు. ప్రజలే ఎప్పటికప్పుడు నిరూపిస్తూ ఉన్నారు. దాన్ని అర్థం చేసుకోలేని రాజకీయ నేతలే.. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అనుభవిస్తూ తాము ప్రజల కన్నా ఎక్కువ పవర్ ఫుల్ అని భావిస్తూ ఉంటారు. వారికి ఎప్పటికప్పుడు అక్షింతలు పడుతున్నా… అధికార మత్తు పరిస్థితుల్ని అర్థం చేసుకోనీయదు. తమను తాము దేవుళ్లులాగా ఊహించుకుంటూ ఉంటారు. పదవి పోయే వరకూ ఆ మత్తు దిగదు. అంతా అయిన తర్వాత నిజమే సుమీ.. ” ద పవర్ ఆఫ్ ది పీపుల్ మచ్ స్ట్రాంగర్ దెన్ ద పీపుల్ ఇన్ పవర్ ” .. అనుకుంటారు. అయితే అప్పటికే చేతులు కాలిపోతాయి. ఆకులు పట్టుకునే పరిస్థితి ఉండదు. అలాంటివి మరోసారి ఏపీ రాజకీయాల్లో కనిపిస్తున్నాయి. దానికి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే సాక్ష్యం.

ప్రజలపై అదే అహంకారం !

పట్టభద్రుల ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అవి పార్టీ గుర్తుల మీద జరగలేదు.. ఆ ఫలితాలు మాకు వ్యతిరేకం కాదు.. హెచ్చరికా కాదు అని ఏపీ అధికార పార్టీ ముఖ్య సలహాదారుడు… ప్రకటించేశారు. బహుశా ఆయన అలా ప్రకటించకపోతే తమ పార్టీ నుంచి మొత్తం పోలోమని బయటకు పోతారని ఆయన భయం ఉండి ఉండవచ్చు. ఎందుకలా వెళ్తారంటే… అధికారం అందిందని వారు చేసిన అరాచకాలు ఆ రేంజ్‌లో ఉన్నాయి. ఆ పాపాలన్నీ వైసీపీలో ఉన్న తమపై పడతాయని పై స్థాయి నుంచి కింది స్థాయి నేత వరకూ కంగారు పడుతున్నారు. ప్రజా వ్యతిరేకత పెరిగిపోయిందని ఇక జగన్ పని అయిపోయిందని తెలిసిన మరుక్షణం ఆ పార్టీలో ఉండి .. టీడీపీ నేతలు ఎదుర్కొన్న వేధింపుల్లాంటివి తాము ఎందుకు ఎదుర్కోవాలని వారు అనుకుంటున్నారు. అందుకే పార్టీ క్యాడర్‌లో ధైర్యం జారిపోకుండా.. మాకు వ్యతిరేకతా లేదు హెచ్చరికా కాదు అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. తమ ఓటర్లు వేరే అని నమ్మకం కల్గించేందుకు తంటాలు పడ్డారు. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో ముఖ్య సలహాదారుడు చెప్పుకున్న తమ వర్గం ఓటర్లతో గెలిచిన తర్వాత… అసెంబ్లీలో సీఎం జగన్ వికృతానందం పొందారు. చంద్రబాబు మొహం చూడాలనుకుందని సెటైర్లు వేశారు. ఆయన వచ్చారు.. ఈయన చూశారు. పెద్దగా తేడా ఏం లేదు. కానీ మూడు పట్టభద్రుల ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అసలు చూడాల్సింది ఎవరి మొహమో వైసీపీ నేతలకూ స్పష్టత వచ్చింది. అందుకే వారు నవ్వు ఆపుకుంటూ సైలెంట్‌గా అసెంబ్లీలో జగన్ మోహం చూస్తూ ఉండిపోయారు. తేడా ఎక్కడ ఉందో నిఖార్సైన వైసీపీ నేతలు… అధికార అహంకారం తలకు ఎక్కించుకోని నేతలకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలోనూ ఓడిపోయారు. ఏడు స్థానాలు మావేనంటూ జబ్బలు చరుచుకున్నారు. కానీ సొంత పార్టీ ఎమ్మెల్యేలు నలుగురు షాకిచ్చారు. నిజానికి తమ ఓట్లు 23 తమకు 23 వస్తే చాలని టీడీపీ అనుకుంది కానీ లేకపోతే ఇంకా చాలా ఓట్లు మళ్లి ఉండేవేమో ?

అమరావతి నుంచి అన్నింటా మోసపు పాలన !

అసలు వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు ఏం చెప్పారో .. వచ్చిన తర్వాత ఏం చేశారో ఒక్క సారి గుర్తు చేసుకుంటే.. అసలు ఒక్క ఓటు అయినా మాకెందుకు వేయాలని వైసీపీ నేతలు తమలో తామే ప్రశ్నించుకుంటారు. సామాన్య ప్రజల దగ్గర నుంచి ఉద్యోగుల వరకూ ప్రతి ఒక్కరినీ మోసం చేశారు. జీతాలు పెంచాల్సింది పోయి తగ్గించారని ఉద్యోగులు రోడ్డెక్కడం సరే.. వారి డబ్బులన్నీ కాజేశారని ప్రభుత్వంపై మండిపడటం తాజా పరిస్థితి. కరెంట్ చార్జీలు పూర్తిగా తగ్గించేస్తానని ప్రమాణస్వీకార వేదిక పై నుంచి చేసిన చాలెంజ్ కాస్తా ఇప్పుడు ఏడెనిమిది సార్లు విద్యుత్ చార్జీల పెంపునకు కారణం అయింది. పెట్రోల్, డీజిల్ దేశంలోనే అత్యధికంగా ఉన్నాయని గతంలో అసెంబ్లీలో హూంకరించారు… కానీ అప్పట్లో అలావు. తాను వచ్చాక చేసి చూపించారు. ఇసుక బంగారం అయిపోయింది. ఇసుక దందాల దెబ్బకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మద్యం అలవాటు ఉన్న పేదలను పీల్చి పిప్పి చేస్తూ ప్రభుత్వం పండగ చేసుకుంటోంది. అమరావతి శిథిలం అయిపోయింది. పోలవరం అగిపోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే.. అరంధతి సినిమాలో అదేదో వైరస్ రాక ముందు.. వచ్చిన తర్వాత అని చూపించినట్లుగా దృశ్యాలు కళ్ల ముందు కనబడతాయి. కానీ గతం గతమే.. ఇప్పుడు జరిగేదే వాస్తవం.

రాష్ట్ర ఆర్థిక మూలాల్ని నరికేసిన దుర్మార్గపు పాలన !

రాష్ట్ర ఆర్థిక మూలాల్ని వైసీపీ ప్రభుత్వ పెరికించి వేసింది. ఐదేళ్ల కిందట ఓ సగటు ఉద్యోగి జీతం పదివేలు ఉంటే… ఐదేళ్ల తర్వాత కనీసం పదిహేను వేలు ఉండాలి. అలా ఉంటే అది పెరుగుదల కాదు. కనీసం తగ్గకుండా కాపాడుకున్నట్లు. ఎందుకంటే ద్రవ్యోల్బణం పెరిగితే రూపాయి విలువ పడిపోతుంది. మరి టీడీపీ ప్రభుత్వం పడిపోయినప్పుడు ఏపీ ఆదాయం ఎంత…. ఇప్పుడు ఎంత ? . బడ్దెట్ లెక్కలు పక్కన పెట్టి వాస్తవిక ఆదాయాన్ని చూస్తే ఆదాయం పెరగకపోగా తగ్గిపోయిందని అర్థం అవుతుంది. పైగా టీడీపీ హయంలో మద్యంపై ఆదాయం ఆరు వేల కోట్లు ఉంటే.. ఇప్పుడు ఇరవై వేల కోట్ల వరకూ ఉంటుంది. అంటే ఫధ్నాలుగు వేల కోట్ల నికర ఆదాయం పెరగాల్సి ఉన్నా తగ్గిపోయింది.. అంటే… ఏపీ ఆర్థిక వనరుల మీద ఎంత దారుణమైన వేటు వేశారో అర్థం చేసుకోవచ్చు . ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందో తెలియకుండా ఇబ్బడి మబ్బడిగా అప్పులు చేయడమే కాదు… రాష్ట్రానికి ఆదాయం అందించే ఆర్థిక వనరుల్ని నిలువుగా నరికేశారు. అందులో మొదటిది అమరావతి. అమరావతిని ఆపేయడంతో రూ. పది లక్షల కోట్లు .. చంద్రబాబుకు నష్టం జరిగిందని అప్పట్లో విజయసాయిరెడ్డి వంటి వారు చంకలు గుద్దుకున్నారు. వాస్తవం ఏమిటంటే ఆ నష్టం జరిగింది చంద్రబాబుకు కాదు.. ప్రజలకు.. రాష్ట్రానికి. ఇప్పుడు అమరావతిలో భూముల్ని ఎకరానికి ఐదున్నర కోట్లకు అమ్ముతామని అంగట్లో పెట్టింది ప్రభుత్వం. అదీఅమరావతి అనే బ్రాండ్‌నేమ్‌తోనే . నిజంగా అమరావతిని అభివృద్ధి చేసి ఉంటే.. రాష్ట్రానికి ఎంత సంపద వచ్చేది. ఒక్క అమరావతి మాత్రమే కాదు.. రాష్ట్రంలో అభివృద్ది పనులు నిలిచిపోయాయి. రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయింది. రియల్ ఎస్టేట్ ఓ ఆర్థిక వాహకం. కానీ ప్రభుత్వ విధానాల వల్ల ఏపీలో రియల్ ఎస్టేట్ క్షీణించిపోయింది. ఫలితంగా హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు రెండింతలయ్యాయి. అమరావతిలో హౌసింగ్ ప్రాజెక్టులు కట్టాలనుకున్న వారంతా ఎక్కడివక్కడ ఆగిపోయారు. నిజానికి ఏపీలో ఎన్ని వ్యాపార కార్యకలాపాలు జరిగితే ప్రభుత్వానికి అంత ఆదాయం వస్తుంది. కానీ వాటినే నిట్ట నిలువుగా నరికేసేంది.

పేద ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తున్న ప్రభుత్వం !

ఒక్క అవకాశం ఇచ్చినందుకు ప్రజలందర్ని అప్పుల ఊబిలోకి నెట్టేసింది ఈ ప్రభుత్వం. దేశంలోని రైతుల్లో సగటున ఏపీ రైతుకు రెండున్నర లక్షల అప్పులు ఉన్నాయి. మరే రాష్ట్రంలోని రైతుకు అలా లేవు. ఇక మధ్య తరగతి కుటుంబాలపై అప్పు కూడా అంతే. దీనికి ప్రభుత్వ విధానాలు కారణం కాదని ఎలా చెప్పలగలం. మద్యం అలవాటు ఉన్న దిగువ మధ్యతరగతి, పేద కుటుంబాల్లో సగం ఆదాయాన్ని జగన్ లాగేసుకుంటున్నారు. ఓ రోజు కూలీ లేదా చిరు వ్యాపారి రోజంతా కష్టపడితే ఓ రూ .వెయ్యి సంపాదించుకోగలుగుతారు. ఆ వెయ్యిలో మద్యం అలవాటు ఉన్న వ్యక్తి.. రూ. ఐదువందలు ప్రభుత్వానికి సాయంత్రానికి టాక్స్ చెల్లిస్తాడు. వన్ టైం సెటిల్మెంట్ స్కీం. ఓటీఎస్ పేరుతో పేద ప్రజలను ఏపీ సర్కార్ అప్పుల పాలు చేసింది. రూ. పది, ఇరవై వేలు కడితే.. గతంలో ఇళ్ల లబ్దిదారులపై ఉన్న రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని ప్రకటించారు. ముఫ్పై ఏళ్ల కిందట తీసుకునన్న రుణాలను కూడా ముక్కు పిండి వసూలు చేశారు. నిజానికి వారంతా నిరుపేదలు.. రెక్కాడితే డొక్కాడనివారు. ప్రైవేటు సైన్యంలా పోషిస్తున్న వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు, పోలీసులు ఇలా ఓ గుంపును.. పేదల ఇళ్లపైకి పంపి.. బెదిరించి మరీ వసూలు చేశారు. ఇవ్వలేని వారికి అప్పులు ఇప్పించారు. వారంతా అప్పుల పాలయ్యారు. సెంటు ఇళ్ల స్థలాల పేరుతో లక్షల అప్పును పేదలపై రుద్దేశారు. ఎక్కడెక్కవన్నీ అప్పులు చేసి మరీ ఇల్లు కట్టుకునేలా చేస్తున్నారు. ఇలా స్థలాలు పొందిన లబ్దిదారుల్లో లక్షల మంది ఇప్పటికే లక్షల రూపాయల అప్పులు చేసి వడ్డీలు కట్టుకుంటున్నారు. . ఇప్పుడు ప్రజలకు ఇల్లు లేదు. ఎప్పుడు వస్తుందో తెలియదు. వారి నెత్తి మీద లక్షల అప్పు ఉంది. తన ప్రయాణం నిరుపేదలతో అని జగన్ చెబుతూంటారు. అందర్నీ తిండికి ఠికానా లేకుండా చేసి.. తాను రేషన్ బియ్యం ఇస్తానని కడుపు నింపుతానని చెబుతున్నట్లుగా పరిస్థితి మారింది.

అన్నింటికీ మించి దేవుళ్లు కంటే కంటే గొప్ప అన్న అహం !

దానికి తోడు అధికారంలో ఉన్నాం కాబట్టి తాము దేవుళ్లం అన్నట్లుగా రెచ్చిపోవడం కామన్. వ్యతిరేకించిన ప్రతి ఒక్కర్ని వేధించడమే పనిగా పెట్టుకున్నారు. ఎంత దారుణం అంటే సొంత పార్టీ కార్యకర్తల్ని, జడ్పీటీసీల్ని.. చివరికి ఎంపీల్ని కూడా వదిలి పెట్టలేదు. అలాంటిది విపక్ష నేతల్ని వదిలి పెడతారా ? ఇప్పుడు ప్రజల మీద పడుతున్నారు. ఎంత మంది ఆత్మహత్యలు చేసుకున్నారో లెక్కలేదు. 50 శాతం ఓట్లు ఎనభై శాతం సీట్లతో అధికారంలో వచ్చిన పార్టీకి నాలుగేళ్లలోనే తీవ్ర వ్యతిరేకత కనిపించింది. అదీ కూడా అన్ని రకాల తమకు మాత్రమే సాధ్యమైన పోల్ మేనేజ్ మెంట్‌ ను నమ్ముకుని కూడా. ముందుకెళ్లలేకపోయారు. తాము ఇచ్చామని చెప్పుకున్న వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు కూడా ప్రభుత్వానికి ఓటేయలేదనేని నిష్టూర సత్యం. ఇక అంతకు మించి వేదన పడుతున్న సామాన్యులు ఎలా ఓటు వేస్తారు ? ఇవన్నీ ప్రజల ఆగ్రహానికి కారణం అవుతున్నాయని గుర్తించకపోతే.. ఏం జరుగుతుందో ఇప్పటికే చరిత్రలో కథలు కథలుగా ఉన్నాయి. ఇప్పుడు తప్పు దిద్దుకుంటే పరువు దక్కవచ్చు.. ..కానీ పాలకుల మనస్థత్వం అలాంటిది కాదు నాకు దక్కకపోతే ఇంకెవరికీ దక్కకూడదన్న మనస్థత్వం. అందుకే మార్పు రాలేదు. కానీ ఇప్పటికే తేలిపోయింది… ఆఖరి ఓటమే మిగిలింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డేరింగ్ అండ్ డాషింగ్ కేజ్రీవాల్

అవినీతి వ్యతిరేక ఉద్యమం చేసి వచ్చి అవినీతి కేసులో అరెస్టు అయ్యాడన్న ప్రచారం చేస్తున్నారు. సామాన్యుడు కాదు లంచగొండి అని గట్టిగా ప్రజల మైండ్లలోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. తన సీఎం...

విజయవాడ వెస్ట్ రివ్యూ : సుజనా చౌదరి నమ్మకమేంటి ?

ఏపీలో పొత్తుల్లో భాగంగా బీజేపీకి వెళ్లిన నియోజకవర్గం విజయవాడ వెస్ట్. అక్కడ్నుంచి అభ్యర్థిగా సుజనా చౌదరిని ఖరారు చేయడంతో కూటమిలోని పార్టీలు కూడా ఒప్పుకోక తప్పలేదు. నిజానికి అక్కడ జనసేన...

టీడీపీ @ 42 : సర్వైవల్ సవాల్ !

సాఫీగా సాగిపోతే ఆ జీవితానికి అర్థం ఉండదు. సవాళ్లను ఎదుర్కొని అధిగమిస్తూ ముందుకు సాగితేనే లైఫ్ జర్నీ అద్బుతంగా ఉంటుంది. అలాంటి జర్నీ ఒక్క మనిషికే కాదు.. అన్నింటికీ వర్తిస్తుంది. ...

తీహార్ తెలంగాణ కాదు..!!

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి జ్యుడిషియల్ రిమాండ్ లో భాగంగా తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత.. జైలు అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు కల్పించాల్సిన సౌకర్యాలను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close