వైసీపీలో అనుమాన ముసలం !

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరాజయం వైసీపీలో చిచ్చు పెట్టే అవకాశం కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ తమకు సాంకేతికంగా ఉన్న 23 ఓట్ల వరకే టార్గెట్ పెట్టుకోవడంతో ఆ మేరకు క్రాస్ ఓటింగ్ జరిగిందని లేకపోతే ఇంకా చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారన్న అభిప్రాయాన్ని టీడీపీ నేతలు పంపారు. ఇది మైండ్ గేమ్ కోసం చేసిన ప్రకటనో కాదో కానీ ఎన్నికల ఫలితాల తర్వాత మాత్రం ఆ పార్టీలో ఓ రకమైన అనుమాన పరిస్థితి నెలకొంది. ఏ ఒక్క ఎమ్మెల్యేనూ నమ్మలేనట్లుగా పరిస్థితి మారింది.

ముందుగా టీడీపీతో టచ్‌లో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతున్న పదహారు మంది ఎమ్మెల్యేలపై వైసీపీ హైకమాండ్ దృష్టి సారించిందంటున్నారు. నిజానికి ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలోనే ఇంటలిజెన్స్‌తో నిఘా పెట్టించినప్పుడే పలువురు ఎమ్మెల్యేలు అసంతృప్తికి గురయ్యారు. ఇప్పుడు తాము ఓటు వేసినా టీడీపీ నేతల్ని అన్న మాటల్ని పట్టుకుని తమను అవమానిస్తే.. పార్టీ నష్టమని ఆ ఎమ్మెల్యేలు అంటున్నారు. అయితే వైసీపీ అగ్రనేత రాజకీయం వేరుగా ఉంటుంది. తనకు నష్టం జరిగినా సరే… ఇతరుల్ని టార్గెట్ చేయాలనుకుంటారు. అది సొంత పార్టీ వారైనా ఆయన వదలరు. ఇప్పుడు అదే పరిస్థితి కనిపిస్తోందని ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు.

కారణం ఏదైనా టీడీపీ ట్రాప్‌లో పడి ఎమ్మెల్యేల్ని దూరం చేసుకుంటే మొదటికే మోసం వస్తుందని పలువురు సీనియర్ నేతలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత రాజకీయాల్లో ముఖ్యంగా వైసీపీలో అగ్రనేత ప్రయోజనాల కోసం ప్రతి ఒక్కర్నీ బలి చేస్తారని ఇలాంటి పార్టీలో ఉండాలంటే… వారికి ఎంతో నమ్మకం కలిగించాల్సి ఉంటుందన్నారు. అలా కాకుండా అందర్నీ అనుమానించి .. అవమానపరిస్తే….. మొదటికే మోసం వస్తుందని అంటున్నారు. మొత్తానికి వైసీపీలో అనుమాన ముసలం అయితే అంటుకుంది. దాన్ని పెంచుకుని పార్టీ మొత్తానికి అంటించుకుంటారో… సొంత నేతల్ని నమ్మి.. ఆర్పేసుకుంటారో జగన్ చేతుల్లోనే ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close