మీడియా వాచ్ : ఈనాడులో ఉద్యోగాలు సేఫ్.. జీతాలు కట్..!

దశాబ్దాలుగా ఎదురు లేకుండా ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న ఈనాడు ఎప్పుడూ ఎదుర్కోనంత ఆర్థిక పరమైన గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. కోవిడ్ దెబ్బకు ఆర్థిక వనరులన్నీ తగ్గిపోగా.. నెలవారీ లోటు కోట్లలోనే ఉంటోంది. అదే సమయంలో… ఉద్యోగుల అవసరాలు కూడా తగ్గిపోయాయి. టాబ్లాయిడ్లు.. స్పెషల్ పేజీలను తగ్గించేయడంతో.. చాలా వరకూ ఎడిటోరియల్‌ స్టాఫ్ అవసరం లేకుండా పోయింది. ఆంధ్రజ్యోతిలాంటి సంస్థలు.. నిర్మోహమాటంగావారిని పక్కన పెట్టేయగా.. ఈనాడుకు మాత్రం.. అలా మనసు రాలేదు. వారందరి ఉద్యోగాలు కాపాడాలనుకుంది. అలా అని జీతాలివ్వలేని పరిస్థితి. అందుకే.. సగం రోజులు మాత్రమే పని చేయించుకని.. ముఫ్పై నుంచి 35 శాతం వరకూ కోత పెట్టాలని నిర్ణయించుకుంది.

దీని కోసం భిన్నమైన మార్గాన్ని ఎంచుకుంది. రోజుమార్చి రోజు వర్కింగ్ డే పెట్టి… సగం జీతం ఇస్తారు. మిగిలిన సగం.. బేసిక్‌లో సగం మొత్తం లెక్క వేసి ఇస్తారు. ఇలా మొత్తంగా.. ఓ ఉద్యోగికి 35 శాతం వరకూ జీతాలు కట్ అయ్యే అవకాశం ఉంది. అయితే. .పని దినాలు మాత్రం సగానికి సగం తగ్గిపోతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవర్నీ రోడ్డున పడేయకుండా.. సంస్థ ఆర్థిక పరిస్థితుల్ని కాపాడుకోవడానికి ఇంత కంటే మార్గం లేదని.. ఈనాడు యాజమాన్యం గుర్తించినట్లుగా తెలుస్తోంది.ఇప్పటికే ఈనాడులో జీతాలు ఆలస్యమవుతున్నాయి. చరిత్రలో ఇంత వరకూ.. ఎప్పుడూ కూడా… ఆలస్యం కాలేదు. నెలాఖరు రోజున ఇచ్చేవారు నెలాఖరు రోజు బ్యాంక్ హాలీడే అయితే.. అంతకు ముందు రోజే ఇచ్చేవారు.

కానీ కరోనా దెబ్బకు రెండు నెలలుగా పదో తేదీ తర్వాతనే జీతాలిస్తున్నారు. అది సర్దుబాటు చేయడానికి యాజమాన్యం నానా తంటాలు పడుతోంది. ఇప్పటికే ఆంధ్రజ్యోతి కూడా జీతాలు తగ్గించింది. అధికార పార్టీ దన్ను ఉన్న సాక్షి లో మాత్రమే పూర్తి జీతాలిస్తున్నారు. నమస్తే తెలంగాణలోనూ జీతాలు కట్ చేసి.. సీఎం కేసీఆర్ జోక్యంతో తిరిగి ఇచ్చారని అంటున్నారు. కానీ జీతాల కోతపై మళ్లీ ఆలోచన చేస్తున్నారంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ దళిత రైతు ఆత్మహత్య ప్రభుత్వ హత్యే..!

నెల్లూరు జిల్లాలో ఓ దళిత రైతు.. తన భూమిని బలవంతంగా లాక్కుంటున్నారన్న ఆవేదనతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఇలాంటి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల జరుగుతున్నాయి. అయితే.....

‘ల‌వ్ స్టోరీ’ ప్లానింగు ఇదీ….

సాధార‌ణంగా శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలు తీసే తీరు పాసింజ‌ర్ రైలుని త‌ల‌పిస్తుంటాయి. ఆగి... ఆగి.. కొంచెం.. కొంచెం.. త‌న మూడ్ ని బ‌ట్టి, షూటింగ్ చేస్తుంటాడు శేఖ‌ర్ క‌మ్ముల‌. దానికి త‌గ్గ‌ట్టుగా లాక్...

ఆర్‌.ఎఫ్‌.సీలో సెటిలైపోతున్న రౌడీ

పూరి జ‌గ‌న్నాథ్ - విజ‌య్ దేవ‌ర‌కొండ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. విజ‌య్ న‌టిస్తున్న తొలి పాన్ ఇండియా ప్రాజెక్టు ఇది. క‌థ ప్ర‌కారం సినిమా మొత్తం ముంబైలోనే...

‘ఓ పిట్ట క‌థ’ లాభాల వెనుక పెద్ద క‌థ‌

లాక్ డౌన్‌కి ముందు, థియేట‌ర్లు మూసివేయ‌డానికి ఓ వారం ముందు విడుద‌లైన సినిమా 'పిట్ట‌క‌థ‌'. మంచి ప‌బ్లిసిటీతో విడుద‌లైన ఈ చిన్న సినిమా.. బాక్సాఫీసు ద‌గ్గ‌ర ఏ ర‌క‌మైన ప్ర‌భావాన్నీ చూపించ‌లేక‌పోయింది. క‌రోనా...

HOT NEWS

[X] Close
[X] Close