‘పుష్ష‌’లో… స్టార్ల హంగామా

టాలీవుడ్ కి పాన్ ఇండియా మోజు ప‌ట్టుకుంది. అయితే.. పాన్ ఇండియా ప్రాజెక్టు అంత ఈజీ కాదు. బోలెడ‌న్ని హంగులుండాలి. అన్ని భాష‌ల‌కూ, అన్ని ప్రాంతాల‌కూ న‌చ్చే క‌థ‌లు ఎంచుకోవాలి. దానికి త‌గ్గ‌ట్టు స్టార్ల కూర్పు ఉండాలి. క‌న్న‌డం, త‌మిళం, మ‌ల‌యాళం, హిందీ.. ఇలా అన్ని భాష‌ల్లోంచీ న‌టీన‌టుల్ని ఎంచుకోవాలి. లేదంటే దానికి పాన్ ఇండియా షేపు రాదు. ‘పుష్ష‌’ కూడా పాన్ ఇండియా సినిమానే. ఈ చిత్రాన్ని దేశ వ్యాప్తంగా విడుద‌ల చేద్దామ‌నుకుంటున్నారు. అందుకే ఇప్పుడు వివిధ భాషా చిత్ర‌సీమ‌ల నుంచి స్టార్ల‌ని ఎంచుకునే ప‌నిలోప‌డింది సుకుమార్ టీమ్. క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ నుంచి ఒక్కో స్టార్‌ని ఈ సినిమా కోసం తీసుకొస్తార‌ని తెలుస్తోంది. ఆల్రెడీ త‌మిళం నుంచి విజ‌య్ సేతుప‌తి లైన్లో ఉన్నాడు. మిగిలిన మూడు భాష‌ల్లోంచి ఎవ‌రెవ‌రు వ‌స్తార‌న్న‌ది తెలియాల్సివుంది. ఈ సినిమాలో ఓ ప‌వ‌ర్‌ఫుల్ లేడీ పాత్ర ఉన్న‌ట్టు తెలుస్తోంది. ‘రంగ‌స్థ‌లం’లో రంగ‌మ్మ‌త్త‌లా ఈ పాత్ర గుర్తుండి పోతుంద‌ట‌. ఆ పాత్ర కోసం ఓ బాలీవుడ్ నటీమ‌ణి పేరు ప‌రిశీలిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఒకొక్క‌రి పేరూ రివీల్ చేసి.. సర్‌ప్రైజ్ చేయాల‌ని పుష్ష టీమ్ భావిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘ల‌వ్ స్టోరీ’ ప్లానింగు ఇదీ….

సాధార‌ణంగా శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలు తీసే తీరు పాసింజ‌ర్ రైలుని త‌ల‌పిస్తుంటాయి. ఆగి... ఆగి.. కొంచెం.. కొంచెం.. త‌న మూడ్ ని బ‌ట్టి, షూటింగ్ చేస్తుంటాడు శేఖ‌ర్ క‌మ్ముల‌. దానికి త‌గ్గ‌ట్టుగా లాక్...

ఆర్‌.ఎఫ్‌.సీలో సెటిలైపోతున్న రౌడీ

పూరి జ‌గ‌న్నాథ్ - విజ‌య్ దేవ‌ర‌కొండ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. విజ‌య్ న‌టిస్తున్న తొలి పాన్ ఇండియా ప్రాజెక్టు ఇది. క‌థ ప్ర‌కారం సినిమా మొత్తం ముంబైలోనే...

‘ఓ పిట్ట క‌థ’ లాభాల వెనుక పెద్ద క‌థ‌

లాక్ డౌన్‌కి ముందు, థియేట‌ర్లు మూసివేయ‌డానికి ఓ వారం ముందు విడుద‌లైన సినిమా 'పిట్ట‌క‌థ‌'. మంచి ప‌బ్లిసిటీతో విడుద‌లైన ఈ చిన్న సినిమా.. బాక్సాఫీసు ద‌గ్గ‌ర ఏ ర‌క‌మైన ప్ర‌భావాన్నీ చూపించ‌లేక‌పోయింది. క‌రోనా...

బీజేపీని అదే పనిగా రెచ్చగొడుతున్న విజయసాయిరెడ్డి..!

భారతీయ జనతా పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆ పార్టీ నేతల్ని పదే పదే రెచ్చగొడుతున్నారు. టీడీపీ నుంచి తమ పార్టీలోకి సామ, భేద, దాన, దండోపాయాల్ని...

HOT NEWS

[X] Close
[X] Close