ఎన్నిక‌ల వేడి త‌గ్గాకే.. సినిమాలా?

ఏపీ ఎన్నిక‌ల షెడ్యూల్ ఖ‌రారైంది. మే 13న ఎన్నికలంటూ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసేశారు. ఇక అంద‌రి దృష్టీ.. రాజ‌కీయాల‌పైనే. ఎక్క‌డ చూసినా వాటిపైనే చ‌ర్చ‌లు. సినిమాలు, స‌ర‌దాలూ కొన్ని రోజులు సైడ్ అయిపోక త‌ప్ప‌దు. అందుకే… ఈ సీజ‌న్‌లో రావాల్సిన సినిమాలు సైతం వాయిదా ప‌ర్వాన్ని వెదుక్కొంటున్నాయి. ముందుగా.. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి’ వంతు వ‌చ్చింది. ఈ సినిమా ఎప్పుడో రెడీ అయిపోయింది. కానీ.. ఎన్నిక‌ల షెడ్యూల్ ప్ర‌క‌టించ‌క‌పోవ‌డంతో రిలీజ్ డేట్ బ‌య‌ట‌పెట్ట‌లేదు. ఎప్పుడైతే ఏపీ ఎల‌క్ష‌న్ షెడ్యూల్ ఖ‌రారైందో, అప్పుడే ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి’ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసేసింది చిత్ర‌బృందం. మే 19న ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్న‌ట్టు ఓ ప్ర‌క‌ట‌న జారీ చేశారు.

మేలోనే ‘కల్కి’ విడుద‌ల చేస్తామ‌ని చిత్రబృందం చెప్పింది. ఇప్పుడు ఆ డేట్ కూడా మార్చ‌క త‌ప్ప‌దు. ఎల‌క్ష‌న్ కి స‌రిగ్గా 4 రోజుల ముందు అంటే మే 9న ‘క‌ల్కి’ రావాలి. ఇంత పెద్ద సినిమాని, ఇంత రిస్కీ టైమ్‌లో విడుద‌ల చేస్తార‌నుకోవ‌డం అవివేక‌మే. కాబ‌ట్టి.. ‘క‌ల్కి’ రిలీజ్ విష‌యంలోనూ ఒక‌ట్రెండు రోజుల్లో ఓ స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి. ఈమ‌ధ్య‌లో విడుద‌ల‌య్యే క్రేజీ సినిమా ‘ఫ్యామిలీ స్టార్‌’ ఒక్క‌టే. ఏప్రిల్ లోనే ఈ సినిమా వ‌చ్చేస్తుంది. అప్ప‌టికి ఎన్నిక‌ల‌కు ఇంకా ఓ నెల స‌మ‌యం ఉంటుంది. కాబ‌ట్టి.. విజ‌య్ సినిమాకు ఎలాంటి అడ్డూ లేక‌పోవొచ్చు. ఆ త‌ర‌వాత వచ్చే సినిమాలే.. రిలీజ్ డేట్లు మార్చుకోవాల్సి వుంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సీఐ అంజూ యాదవ్‌నూ సాగనంపారు !

తిరుపతిలో అత్యంత వివాదాస్పదమైన మహిళా సీఐ అంజూ యాదవ్ ను కూడా ఈసీ సాగనంపింది. పోలింగ్ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ విధుల్లో ఉండకూదని ఆర్థరాత్రే బదిలీ చేస్తూ ఈసీ ఉత్తర్వులు...

అల్లు అర్జున్ టూర్ : నంద్యాల ఎస్పీ, డీఎస్పీ, సీఐలపై ఈసీ చార్జ్‌షీట్

అల్లు అర్జున్ నంద్యాల పర్యటన పోలీసులపై కూడా కేసులు నమోదయ్యేలా చేసింది. అల్లు అర్జున్ నంద్యాల పర్యటనకు పోలీసులు అనుమతి తీసుకోలేదు. మామూలుగా అయితే పెద్దగా మ్యాటర్ కాదు....

వారణాశిలో మోడీ నామినేషన్‌కు చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడును వారణాశిలో తన నామినేషన్ కు రావాల్సిందిగా ప్రధాని మోడీ ఆహ్వానించారు. మంగళవారం ప్రధాని మోద ీనామినేషన్ వేయనున్నారు. వారణాశిలో ఎన్నికలు చివరి విడతలో జరగున్నాయి. పదమూడో తేదీన...

మిత్రుడు దంతులూరి కృష్ణ కూడా జగన్‌కు వ్యతిరేకమే !

జగన్మోహన్ రెడ్డికి అధికారం అందిన తర్వాత ఆ అధికారం నెత్తికెక్కడంతో దూరం చేసుకున్న వారిలో తల్లి, చెల్లి మాత్రమే కాదు స్నేహితులు కూడా ఉన్నారు. చిన్న తనం నుంచి అంటే 35...

HOT NEWS

css.php
[X] Close
[X] Close