ఆఖరిలో అందలం..కొత్త రాజకీయం

నాలుగేళ్లు ఎలాగైనా పాలించేయండి. జనాలకు రూపాయి విదల్చకండి. ఎవరికి అందినది వారు తినేయండి. కానీ ఆఖరు ఏడాది, ఆఖరు మూడు నెలల్లో జనాలను డబ్బులతో కొట్టేయండి. ఓట్లు రాలకపోతే అప్పుడు అడగండి.

ఇదే కొత్త రాజకీయం . కొంత మంది జనం కష్టపడి చెమటోడ్చి కట్టిన పన్నుల నుంచి, ఓట్లు రాలుస్తారనుకునే జనాలకు అప్పనంగా డబ్బులు ధారపోయడం. అది కెసిఆర్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, మోడీ కావచ్చు. అందరిదీ ఇదే దారి. పది ఎకరాలు వున్నవాడికి, పాతిక ఎకరాలు వున్నవారికి రైతు బంధు అవసరమా? వ్యాపార దక్షత మహిళలకు పెంచాలని రుణాలు తక్కువ వడ్డీకి ఇస్తూ, అవకాశం కల్పిస్తూ మళ్లీ పదివేలు అప్పనంగా అప్పగించడం అవసరమా? దీనివల్ల వారికి వ్యాపారాన్ని సవాల్ గా నిర్వహించాలని అనిపిస్తుందా?

దేశంలో కొత్త రకం రాజకీయాలు పురుడు పోసుకుంటున్నాయి. కేసిఆర్ ప్రభుత్వం ఎన్నికల వేళ వరాలు ప్రకటంచి, రైతు బంధు అంటూ జనాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు పంపిణీ చేయడంతో విజయం సునాయాసమైందని మిగిలిన రాజకీయ పక్షాలు గ్రహించాయి. కేసిఆర్ అడుగుజాడే విజయానికి బాట అని గ్రహించిన చంద్రబాబు వరుసపెట్టి వరాలు ప్రకటించడం ప్రారంభించారు. మహిళా సంఘాల ఖాతాల్లోకి నేరుగా పదివేలు పంపిణీ అన్నది ప్రకటించారు. ఇప్పడు మోడీ వంతు వచ్చింది. ఆయన ప్రకటించాల్సిన వరాలు అన్నీ ప్రకటించేసారు.

ఫించన్లు పెంచడం వరకు ఓకె. ఊరికనే డబ్బులు జల్లేయడం మహా దారుణం అనే అనుకోవాలి. అది మోడీ అయినా, కేసిఆర్ అయినా, చంద్రబాబు అయినా. జనాలకు బాధ్యత పెంచాలి. ప్రభుత్వాలు ప్రజా ధనానికి జవాబుదారీ అంటారుకదా? ఇప్పుడు ఇలా పారబోసేయడం అంటే జవాబుదారీ తనం అని ఎలా అనుకోవాలి?

నాలుగేళ్లుగా ఇన్ కమ్ టాక్స్ పరిథి పెంచాలని అంటే అస్సలు పట్టించుకోకుండా ఒకేసారి డబుల్ చేయడం అంటే ఏమనుకోవాలి? ముక్కుపిండి జీఎస్టీ అని వసూలు చేస్తూ, ఇప్పుడు ఎకరాకి ఇంత అని ఇచ్చేయడం అంటే ఏమనాలి? కనీసం ఇక్కడ అయిదు ఎకరాలు అని సీలింగ్ అయినా పెట్టారు. కొంత సంతోషం. తెలంగాణలో అదీ లేదు. 

ఆంధ్రలో తల్లి – తండ్రి వెయ్యి రూపాయల ఫింఛను తీసుకుంటుంటే అమెరికాలో కొడుకు కోట్లు సంపాదిస్తున్న కుటుంబాలు ఎన్నిలేవు? ఇలా ఫింఛన్లు పల్లెల్లో రాసేయడం ఇచ్చేయడం ఎంత దారుణం.

ఒక్కసారి ఆంధ్ర పల్లెలకు వెళ్లి చూడండి. పాతిక లక్షల విలువైన భారీ ఇళ్ల నిర్మాణం. దానికి ప్రభుత్వం అప్పనంగా లక్షన్నర సబ్సిడీ. ఏమయినా అర్థం వుందా? ఇల్లు కట్టుకోలేని వాడికి లక్షన్నర ఇస్తే, మరో లక్ష వేసి కట్టుకున్నాడు అంటే అర్థం వుంది. పాతిక లక్షలు పెట్టి ఇల్లు కట్టేవాడికి ఇవ్వడం ఏమిటి? అంత ఇల్లు వున్నవాడికి ఇంతా తెల్లకార్డు ఏమిటి? 

ఇవన్నీ ఓటు రాజకీయాలు. పల్లెలో గ్రామసభ, లోకల్ రాజకీయనాయకులదే హవా. వారు రాసినవే జాబితాలు. అవే ప్రభుత్వ పథకాలకు ఆధారాలు. కోట్లకు కోట్లు ప్రజాధనం ఓట్లు టార్గెట్ గా ఇలా వృధా కావాల్సిందే.

నిన్నటి వరకు రాష్ట్రాలకే ఈ జాఢ్యం వుండేది. ఇప్పుడు మెల్లగా కేంద్రానికి పాకుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మలయాళం కథతో తరుణ్ భాస్కర్ ?

తరుణ్ భాస్కర్ కి నటనపై ఆసక్తి ఎక్కువే. తను తీసిన 'కీడాకోలా' నటుడిగా ఆయన్ని మరో మెట్టుఎక్కించింది. ప్రస్తుతం దర్శకుడిగా కథలు రాసుకోవడంతో పాటు నటుడిగా కూడా కొన్ని ప్రాజెక్ట్స్ సైన్ ...

బీఆర్ఎస్ఎల్పీ విలీనం లేనట్లే – రేవంత్ ఆకర్ష్ ఫెయిల్ !

బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని చేస్తున్న ప్రచారం అంతా డొల్గా తేలుతోంది. ముందుకు వచ్చిన ఒక్కో ఎమ్మెల్యేకు కండువా కప్పుతున్నారు...

రోజా దాచిన మద్యం డంప్ పట్టించిన సొంత పార్టీ నేతలు

ఏపీలో మద్యం దుకాణాలను గుప్పిట్లో పెట్టుకుని వైసీపీ నేతలు చాలా మందుగానే అన్ని నియోజకవర్గాలకు మద్యాన్ని సరఫరా చేసి పెట్టుకున్నారు. అది అధికారిక మధ్యమా.. పన్ను కట్టని మద్యమా అన్నదానిపై ఇంకా క్లారిటీ...
video

‘మ‌న‌మే’ టీజ‌ర్‌: క్యారెక్ట‌ర్ల మ‌ధ్య క్లాషు!

https://www.youtube.com/watch?v=_4Ff1zVtKkw శర్వానంద్ - శ్రీ‌రామ్ ఆదిత్య కాంబినేష‌న్‌లో 'మ‌న‌మే' రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. కృతి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ రూపొందిస్తోంది. శ్రీ‌రామ్ ఆదిత్య త‌న‌యుడు ఈ చిత్రంలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close