ప్రొ.నాగేశ్వర్ : ఆంధ్రమా.. కేంద్రమా.. అన్న రీతిలో యుద్ధం..!

ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి రాజకీయంగా తీవ్రమైన విమర్శలు, ప్రతి విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. కేంద్రం చేసిన అన్యాయంపై… టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మరోసారి పోరాటం ప్రారంభించారు. బీజేపీ నేతలు.. దీనికి కౌంటర్ ఇస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రానికి ఇవ్వని విధంగా లక్షల కోట్లు ఇచ్చామని.. పోలవరం కడుతున్నామని.. రాజధానిని నిర్మించామని… చెప్పుకొస్తున్నారు.

ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బ తీస్తున్న కేంద్రం..!

విభజన హామీల విషయంలో కేంద్రం నుంచి ఏపీకి.. హమీ ఇచ్చిన మేరకు.. సహాయం అందడం లేదన్నది నిజం. ఢిల్లీని మించిన రాజధాని కడతామని.. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబుతో కలిసి.. మోదీ ప్రకటించారు. కానీ..రూ. పదిహేను వందల కోట్లే ఇచ్చారు. పైగా.. అమరావతి నిర్మాణం జరగడం లేదని ఓ వైపు విమర్శలు చేస్తూనే మరో వైపు.. అమరావతిని తామే నిర్మించామని చెప్పుకుంటున్నారు. ఇక పోలవరం ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్ట్. బీజేపీ వాళ్లిచ్చినది కాదు. యూపీఏ హయంలో.. విభజన చట్టంలో పెట్టిన ప్రాజెక్ట్. చట్టం ఇచ్చిన ప్రాజెక్ట్. ప్రతి రాష్ట్రంలోనూ ఓ జాతీయ ప్రాజెక్ట్ ఉండాలనేది జాతీయ విధానం. దానితో పాటు చట్టంలో ఉంది కాబట్టే.. బీజేపీ ఇవ్వాల్సి వస్తోంది. అంతే కానీ.. ఏపీపై ప్రేమతో ఏమీ ఇవ్వడం లేదు. ఇక కార్ల కంపెనీలను తామే తెచ్చామని బీజేపీ నేతలు వాదిస్తున్నారు. ఆ కంపెనీ తెచ్చే ముందు.. ఓ ఆరు నెలల ముందు ఎందుకు చెప్పలేదు..? నిజంగా… ప్రధాని దాన్ని ఏపీకి సిఫార్సు చేసి ఉంటే… ముందు నుంచి చెప్పుకుని ఉండేవారు కదా..? ప్రయోగాత్మక ఉత్పత్తి ప్రారంభమయ్యే సమయంలో దాన్ని మోడీనే ఏపీకి తెచ్చారని చెప్పుకోవడం ఎందుకు..? నిజానికి కేంద్రం.. ఇలా రాష్ట్రాలకు తెచ్చాం అని చెప్పుకోవడం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం. అసలు కేంద్రం ఉనికి ఎలా ఉంది..? రాష్ట్రాల నుంచి వచ్చే పన్నులతోనే కేంద్రం నడుస్తోంది. అందుకే.. రాష్ట్రాలకు ఇచ్చామని చెప్పుకోవడం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం. విభజన హామీలను.. నెరవేర్చి.. మేమిచ్చాం అని చెప్పుకోవచ్చు కదా..!

ఏపీ పర్యటనలో మోడీ ప్రతి ప్రశ్నకూ సమాధానం చెప్పాలి.. !

మేము తెచ్చాం.. మేము ఇచ్చాం అని చెప్పుకోవడానికన్నా.. ఇప్పుడు ఇవ్వాలని డిమాండ్లు ఉన్న ప్రత్యేకహోదా నుంచి స్టీల్ ఫ్యాక్టరీ వరకు… అనేక అంశాలను.. తీసుకొచ్చి.. ఇదిగో ఇచ్చామని చెప్పుకోవడానికి అవకాశం ఉన్నా…ఎందుకు చేయడం లేదు. ఏమీ చేయకపోయినా వారు ఏపీకి ఎందుకు వస్తున్నారంటే… అమిత్ షా, మోదీ ఇద్దరూ.. కిల్లర్ ఇన్‌స్టింక్ట్ తరహా రాజకీయాలు చేస్తారు. చివరి బంతి వరకూ ఆడతారు. అందుకే.. సీట్లు వచ్చినా.. రాకపోయినా.. డిపాజిట్లు వచ్చినా రాకపోయినా.. వారు ప్రచారానికి వస్తారు. వారిని అడ్డుకుంటామనడం తప్పు. ప్రజాస్వామ్యంలో అడ్డుకోవడాలు ఉండవు. కానీ… ఏపీకి వచ్చిన సందర్భంలో… విభజన హామీలు.. ఎంత మేర అమలు చేశారో.. పాయింట్ టు పాయింట్ సమాధానం చెప్పాలి. సూటిగా సమాధానం చెప్పలేదు. రైల్వేజోన్, దుగరాజపట్నం, స్టీల్ ప్లాంట్.. ఇలా హామీలన్నీ ఎందుకు చేయడం లేదు.. ఇవ్వడం లేదన్నది సూటిగా చెప్పాలి. అవి చెప్పకుండా.. ఇతర అంశాలన్నీ చెప్పుకుంటూ పోతే.. ఏం ప్రయోజనం ఉంటుంది. ఫిబ్రవరి 13వ తేదీన చంద్రబాబు ఢిల్లీలో దీక్ష చేయాలనుకున్నారు. అఖిలపక్షం తో కలిసి పోరాటం చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీల తమ తమ రాజకీయ విబేధాల వల్ల కలసి పోరాటం చేయడం లేదు కానీ.. వారి డిమాండ్ కూడా ఒక్కటే. కేంద్రం ఇదే తెలుసుకోవాలి. తెలంగాణ విషయంలో అన్ని పార్టీలు విబేధాలున్నా ఏకమయ్యాయి. కానీ ఏపీలో ప్రత్యేకహోదా కోసం ఏకం కావడం లేదు. అయితే.. విడిగా ఉన్న రాజకీయ ఏకీకృత అభిప్రాయం ఉంది.

సెంటిమెంట్ దెబ్బ తీస్తే మరో 20 ఏళ్ల పాటు కోలుకోవడం కష్టం..!

విభజన హామీల విషయంలో బీజేపీ ఇలా వ్యవహరించడం వల్లే.. మరోసారి ఏపీలో అంటరాని పార్టీగా మారిపోయింది. ఇతర రాష్ట్రాల్లో చిన్న పార్టీలైనా పొత్తులు పెట్టుకుంటున్నాయి కానీ.. ఏపీలో ఆ పార్టీ జోలికి కూడా ఎవరూ వెళ్లడం లేదు. వైసీపీ కూడా.. ఎన్నికల తర్వాతే పొత్తుల గురించి చెబుతామంటోంది. కచ్చితంగా.. బీజేపీ పట్ల.. ఏపీ రాజకీయాల్లో ఏకీకృతమైన రాజకీయ వ్యతిరేకత ఉంది. ప్రజల్లో సెంటిమెంట్ ఉంది. కేంద్రం అన్యాయం చేసిందనే… భావన అన్ని పార్టీల నేతలు, కార్యకర్తల్లో అభిప్రాయం ఉంది. 2014లో విభజన విషయంలో విలన్ నెంబర్ వన్ అయింది. ఇప్పుడు ఆ ప్లేస్‌లోకి బీజేపీ వచ్చింది. సెంటిమెంట్ బలపడితే.. బీజేపీ మరో పది.. ఇరవై ఏళ్ల వరకు బలపడే అవకాశం ఉండదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close