టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ నిన్నటి వరకూ తన ఎక్స్‌లో యూరప్‌లో ఇస్లామోఫోబియాను పెంచడానికి ట్వీట్లు పెట్టేవారు. అక్కడ ఆందోళనలకు మద్దతు పలుకుతూ ఉండేవారు. ఇప్పుడు ఆయన దృష్టి నెట్ ప్లిక్స్ మీదకు మారింది. నెట్ ఫ్లిక్స్ ను తాను బహిష్కరిస్తున్నానని అందరూ అదే చేయాలని పిలుపునిస్తున్నారు. ఎందుకంటే నెట్ ఫ్లిక్స్ కంటెంట్ సమాజానికి ముఖ్యంగా పిల్లలకు హానికరంగా మారిందట.
నెట్‌ఫ్లిక్స్‌లో కొన్ని పిల్లల షోలు అభ్యంతరకరంగా ఉన్నాయని ఎలాన్ మస్క్ వాదన. దబేబి సిట్టర్స్ క్లబ్, పారా నార్మల్ పార్క్ వంటి షోలలో పిల్లలకు ట్రాన్స్‌జెండర్ థీమ్‌లు, మిస్జెండరింగ్ను షేమ్ చేయడం వంటి కంటెంట్‌ను ప్రమోట్ చేస్తున్నాయని విమర్శిస్తున్నాడు. ఇవి పిల్లల ఆరోగ్యానికి హానికరమని చెప్పి క్యాన్సిల్ నెట్ ఫ్లిక్స్ ఫర్ ద హెల్త్ ఆఫ్ యువరు కిడ్స్ అని క్యాంపెయిన్ ప్రారంభించాడు. ఈ షోలు LGBTQ+ క్యారెక్టర్లు కలిగి ఉన్నాయి, వీటిని ప్రోగ్రెసివ్ ఆలోచనలుగా చూపిస్తున్నారని మస్క్ అంటున్నారు.
దీంతో పాటు నెట్‌ఫ్లిక్స్ లో వచ్చే ఇంక్లూజన్ అండ్ డైవర్సిటీ రిపోర్ట్ లో జాతి వివక్ష చూపిస్తున్నారని అంటున్నారు. అర్హతల ఆధారంగా హైరింగ్ చేయాలని, స్కిన్ కలర్ ఆధారంగా కాదని వాదిస్తున్నాడు. ట్రంప్ భావజాలం ఉన్న వారందర్నీ ఇలాంటి బాయ్ కాట్లు బాగానే ఆకర్షిస్తున్నాయి. ఎంత మంది నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ క్యాన్సిల్ చేసుకుంటారో కానీ.. మస్క్ కూడా రేపు అలాంటి పరిస్థితే రావొచ్చని అంటున్నారు. మస్క్ పిల్లల్లో ఒకరు ట్రాన్స్ జెండర్. ఆమెను మస్క్ దూరం పెట్టారు.