యువశక్తిని ఎంతగా ఉపయోగించుకుంటే.. అంతగా అభివృద్ధి చెందవచ్చు. కానీ వారిని ఉపయోగించుకునే విధానంలోనే ప్రభుత్వాలకు స్పష్టత ఉండాలి. గత ప్రభుత్వం యువతలో వాలంటీర్లను చూసింది. ఈ ప్రభుత్వం టీచర్లను.. ఉద్యోగులను..నిపుణులను చూస్తోంది. యువత నైపుణ్యాలకు తగ్గ ఉద్యోగాలు.. ఉద్యోగాలకు తగ్గ నైపుణ్యాలను పెంచేందుకు ప్రయత్నాలు చేస్తూనే పెద్ద ఎత్తున ఉపాధి ఆవకాశాలను కూడా కల్పిస్తున్నారు.
జోరుగా ఉద్యోగ నియామకాలు – ప్రభుత్వమే కాదు..ప్రైవేటులో కూడా !
ఏపీలో ఉద్యోగ నియామకాల సంఖ్య జోరుగా పెరిగింది. ఒకే ఒక్క నోటిఫికేషన్ తో పదిహేడు వేల టీచర్లను నియమిస్తున్నారు. వారికి నేడో రేపో నియామక పత్రాలు అందిస్తారు. ఇంకా పలు ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. ప్రైవేటు రంగంలో కూడా ఉద్యోగ నియామకాలు జోరుగా సాగుతున్నాయి. రాష్ట్రంలో వివిధ సంస్థలు తమ ప్రాజెక్టులు చేపడుతున్నాయి. అందు కోసం ఉద్యోగాలను ప్రకటిస్తున్నాయి. ఎంపికలు నిర్వహిస్తున్నాయి. అమరావతిలో ఇప్పుడు పదుల సంఖ్యలో జాతీయ స్థాయి కంపెనీలు సేవలు అందిస్తున్నాయి. అవన్నీ సిబ్బందిని నియమించుకున్నాయి. పరిశ్రమల్లోనూ నియామకాల జోరు పెరిగింది. స్కిల్ కు తగ్గట్లుగా ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.
యువతలో వాలంటీర్లను చూసిన గత ప్రభుత్వం
గత ప్రభుత్వం యువతను నిర్వీర్యం చేసింది. యువతలో వాలంటీర్లను చూసింది. ఐదు వేలు జీతం ఇచ్చి ఐదు సంవత్సరాల పాటు వారిని పార్టీ పనులకు… అడ్డగోలు వ్యవహారాలకు ఉపయోగించుకుంది. అలాగే సచివాలయ ఉద్యోగాల పేరుతో కొన్ని లక్షల మంది భవిష్యత్ ను రిస్క్ లో పెట్టింది. ప్రభుత్వ ఉద్యోగమే అయినా ఆ ఉద్యోగానికి విలువ లేకుండా చేసింది. ఫలితంగా వైసీపీ నిర్వాకం కారణంగా కొన్ని లక్షల మంది జీవితాల్లో అత్యంత విలువైన సమయం కోల్పోయారు. అలాంటి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తోంది.
స్కిల్స్ తగ్గ ఉద్యోగాలు.. ఉద్యోగాలకు తగ్గ స్కిల్స్
ప్రభుత్వం ఆకర్షిస్తున్న పెట్టుబడులతో వస్తున్న పరిశ్రమలకు అవసరమైన మ్యాన్ పవర్ కోసం స్కిల్స్ పెంచేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇలాగే నైపుణ్యాలు ఉన్న వారికి తగిన ఉద్యోగాలు చూపించేందుకు నారా లోకేష్ నేతృత్వంలో ఇప్పటికే ప్రత్యేక మిషన్ నడుస్తోంది. ఐదు సంవత్సరాల కాలంలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యంతో.. ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. దీన్ని యువత అందిపుచ్చుకుంటున్నారు.