ఇండియా, ఇంగ్లండ్‌లలో ఇంతకుముందు జరిగిన రెండు సిరీస్‌లను గెలుచుకుని ఉండడంతో ఫుల్ కాన్ఫిడెన్స్‌తో మన దగ్గరకు వచ్చింది ఇంగ్లీష్ టీం. మొదటి టెస్ట్‌లో ఆ జోరు కనిపించింది కూడా. కానీ కష్టాలు కూడా బాగానే తెలిసొచ్చాయి. ఇక రెండో టెస్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా? ఇంగ్లండ్ ఆటగాళ్ళ ఆత్మవిశ్వాసం కాస్తా ఆవిరైపోయిన టెస్ట్ కదా. జెంటిల్‌మేన్ గేం ఆడడానికి వచ్చిన వాళ్ళే అయితే ఇంకా బాగా ఎలా ఆడాలి? బెటర్ వ్యూహాలతో ఎలా బరిలోకి దిగాలి? అని ఆలోచించి ఉండేవాళ్ళు. కానీ ఇంగ్లండ్ కెప్టెన్ కుక్ మాత్రం గేంతో పాటు చీప్ గేమ్స్ కూడా మొదలెట్టాడు.
మొదటి టెస్ట్ చివరి రోజు కూడా ఇండియన్ కెప్టెన్ విరాట్ కోహ్లి 49 పరుగులతో క్రీజులో ఉన్నప్పుడు డ్రాకు ప్రపోజల్ పెట్టాడు కుక్. అప్పుడే కుక్ చర్యను కొంతమంది విమర్శించారు. ఇక వైజాగ్ టెస్ట్‌లో టీం ఇండియా గెలిచాక ఇంగ్లీష్ మీడియా కూడా గేమ్స్ స్టార్ట్ చేసింది. విరాట్ కోహ్లి బాల్ ట్యాంపరింగ్ చేశాడని వార్తలు రాసేసింది. ఆ వార్తలు నిజమే అయి ఉంటే, కోహ్లి ట్యాంపరింగ్ చేశాడని నమ్మి ఉంటే ఇంగ్లండ్ టీం వారు ఐసిసికి ఫిర్యాదు చేసి ఉండేవాళ్ళు. విరాట్ కోహ్లి కూడా అదే విషయం చెప్పాడు. కానీ ఇంగ్లీష్ కెప్టెన్ అలిస్టెర్ కుక్ మాత్రం కోహ్లి ట్యాంపరింగ్‌కి పాల్పడ్డాడా? లేదా? అనే ప్రశ్నకు స్పష్టంగా సమాధానం చెప్పకుండా పరోక్షంగా కోహ్లిపైన అనుమానాలు వచ్చేలా, ఇంగ్లీష్ మీడియాను సమర్థించేలా మాట్లాడాలని ట్రై చేశాడు. ఆటగాడి నోటిలోని గమ్ లేదా జెల్లీ బీన్స్‌ని రూల్స్‌కి దొరక్కుండా ఎలాంటి తెలివితేటలు వాడి బాల్కి రాయొచ్చు అన్న విషయం చెప్పుకొచ్చాడు. కోహ్లికి దురుద్ధేశ్యాన్ని ఆపాదించాలన్న దురాలోచన అయితే కుక్ మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇంతకు ముందు ఇండియన్ క్రికెటర్స్ కంటే కోహ్లికి టెంపర్ చాలా ఎక్కువ. రెచ్చగొట్టిన వాళ్ళకు చుక్కలు చూపించడానికి బయల్దేరే రకం. ఇలాంటి చీప్ గేమ్స్‌తో కోహ్లిని రెచ్చగొట్టడం కంటే కూడా ఇంగ్లండ్ టీం మెంబర్స్ అందరూ గేం ఆడడంపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే గెలుపు సంగతి ఎలా ఉన్నా ఓటమి మాత్రం గౌరవంగా ఉండే అవకాశం ఉంది. లేకపోతే మన విరాటుడు ఇంగ్లీష్ ఆటగాళ్ళను అడ్డంగా గిరాటేసేయడం ఖాయం.