కోహ్లీది ఆర్మీ కమాండర్ శైలి. క్రమశిక్షణ, ఫిట్నెస్ యాక్టివిటీస్‌కి చాలా ప్రాధాన్యతనిస్తాడు. అలాగే గేంలో కూడా పూర్తి ఆధిపత్యాన్ని ఆశిస్తాడు. అందుకే తనలో ఉన్న లోపాలను ఎప్పటికప్పుడు సరిచేసుకున్నాడు. ప్రపంచంలోనే ది బెస్ట్ బ్యాట్స్‌మెన్ అనే గౌరవానికి చాలా దగ్గరగా ఉన్నాడు. కెప్టెన్‌గా కూడా ఇప్పటి వరకూ అదేస్థాయి విజయాలు సాధించాడు కోహ్లి. ఆస్ట్రేలియాలో ఓడిపోయినప్పటికీ ఆ ఓటమిలో కూడా కోహ్లి మార్క్ హీరోయిజం ఉంది. అందుకే కోహ్లి లోపాలను టెస్ట్ చేసే స్థాయి టెస్ట్ కోహ్లికి ఇంత వరకూ ఎదురుపడలేదు. కోహ్లి బ్యాటింగ్‌లో ఉన్న లోపాలను ఇంగ్లాండ్ గడ్డపై పరిపూర్ణంగా ఎత్తి చూపిన ఇంగ్లీష్ వారే ఇప్పుడు కోహ్లి నాయకత్వంలో ఉన్న లోపాలను కూడా హైలైట్ చేశారు.
అశ్విన్‌లాంటి బౌలర్ ప్రతి టెస్ట్‌లోనూ పదుల సంఖ్యలో వికెట్స్ తీస్తూ ఉంటే, చివరి వరుస బ్యాట్స్‌మెన్ కూడా పరుగుల వరద పారిస్తూ ఉంటే ఇండియన్ టీంకి ఇంట్లో ఉన్న బామ్మలు కూడా కెప్టెన్సీ చేసి పడేయగలరు. మరి అదే అశ్విన్ వికెట్స్ తీయడం విషయం పక్కన పెడితే….కనీసం ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ని ఇబ్బంది పెట్టటంలో కూడా ఫెయిల్ అయితే..? ప్రత్యర్థి టీంలో ఉన్న చివరి వరుస బ్యాట్స్‌మేన్ కూడా ఇండియన్ బౌలర్స్ అందరినీ ఉతికి ఆరేస్తుంటే…? టీంలో ఉన్న బౌలర్స్ అందరూ కూడా భాగస్వామ్యాలను విడగొట్టడంలో ఫెయిల్ అయితే…? అలాగే ప్రత్యర్థి టీంలో ఉన్న రూట్లాంటి బౌలరే కాని బౌలర్ కూడా బంతిని గింగిరాలు తిప్పేస్తూ ఉంటే..? బ్యాట్స్‌మెన్ అందరూ వరుసగా చేతులెత్తేస్తూ ఉంటే..? ప్రత్యర్థి టీం బౌలర్స్, ఫీల్డర్స్ అందరూ కూడా టెన్షన్ పెడుతూ ఉంటే..అప్పటికే ఆరు వికెట్లు కోల్పోయిన పరిస్థుతుల్లో ప్రతి ఒక్క బాల్ని జాగ్రత్తగా ఫేస్ చేయడంతో పాటు…బాల్కి బాల్కి మధ్య ఎలా టైం వేస్ట్ చేయాలా? ప్రత్యర్థి టీంకి ఎక్కువ ఓవర్లు వేసే అవకాశం లేకుండా టైం అయిపోయేలా ఎలా చేయాలా? అని ఆలోచించాల్సిన పరిస్థితులు వస్తే….? అప్పుడు ఇండియన్ కెప్టెన్….అది కూడా కోహ్లి లాంటి కెప్టెన్ హావభావాలు ఎలా ఉంటాయో తెలియాలంటే ఇండియా-ఇంగ్లాండ్‌ల మధ్య జరిగిన మొదటి టెస్ట్ చూసి తీరాల్సిందే. ఫీల్డర్స్ క్యాచ్‌లు వదిలేశారు. బౌలర్లు చేతులెత్తేశారు. ఐదు రోజుల ఆట మొత్తం కూడా టెస్ట్‌ని కాపాడుకోవాల్సిన పరిస్థితుల్లోనే ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు.
ఇక చివరి రోజు చివరి సెషన్ అయితే లైఫ్ అండ్ డెత్ సిచ్యుయేషనే. ప్రతి ఓవర్లో ఏదో ఒక బాల్కి అవుట్ అయ్యేలాంటి పరిస్థితిని కోహ్లిలాంటి వరల్డ్ క్లాస్ బ్యాట్స్‌మెన్ కూడా ఫేస్ చేశాడు. అయితే అలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా కోహ్లి ధైర్యంగా నిలబడ్డాడు. సహచర ఆటగాళ్ళకు బాల్ని ఎలా డిఫెన్స్ చేయాలో నేర్పిస్తూ, సూచనలు ఇస్తూ మొత్తానికి టెస్ట్‌ని డ్రా చేసుకుని హమ్మయ్య….అని ఊపిరి పీల్చుకున్నాడు. అయితే ఈ టెస్ట్ పుణ్యమాని కోహ్లి నాయకత్వ లోపాలు మాత్రం బయటపడ్డాయి. మొదట్లో ప్లేయర్‌గా కూడా చాలా ఆవేశంగా ఉండే కోహ్లి ఇప్పుడు చాలా మారాడు. అయితే కెప్టెన్‌గా మాత్రం విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు కూల్‌గా ఆలోచించడం, ఇంకా మెరుగైన వ్యూహాలతో ఎధురుదాడి చేయడం లాంటి విషయంలో కోహ్లి లోపాలు స్పష్టంగా కనిపించాయి. బ్యాటింగ్ టైంలో మాత్రం తన టాలెంట్ మొత్తం చూపించాడు కోహ్లి. ముఖ్యంగా రవీంద్ర జడేజాకు సూచనలిస్తూ…సమన్వయం చేసుకుంటూ టెస్ట్ డ్రా అయ్యేలా చేయడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు. అయితే బౌలర్లకు సూచనలిస్తూ…ఫీల్డింగ్‌ని సెట్ చేసే విషయంలో మాత్రం కోహ్లి సాదా సీదాగా కనిపించాడు. ఆ విభాగంలో కోహ్లికి అమూల్యమైన సూచనలిచ్చే టాప్ స్పిన్నర్ అశ్విన్…తన బౌలింగ్ విషయంలోనే పూర్తిగా ఫెయిల్ అవడంతో కోహ్లికి గైడెన్స్ ఇచ్చే పరిస్థితుల్లో లేకుండా పోయాడు. వేరే ఏ బౌలర్‌కి కూడా బౌలింగ్ యూనిట్‌కి సారధ్యం వహించేంత సీన్ లేకపోయింది. అందరూ కూడా మూకుమ్మడిగా ఫెయిల్ అయ్యారు. విదేశాల్లో జరిగే టెస్ట్‌లలో మనవాళ్ళకు ఇలాంటి విపత్కర పరిస్థితులు తరచుగా ఎధురవుతూ ఉంటాయి. అందుకే ఈ విషయంలో కూడా కోహ్లి…. కాస్త త్వరగా టాప్ రేంజ్ నాయకత్వ లక్షణాలను నేర్చుకుంటే టీం ఇండియా నంబర్ ఒన్ ర్యాంక్ కాస్త ఎక్కువ కాలం మనతోనే ఉంటుంది. కమాన్ కోహ్లి భాయ్……వేకప్.