చైతన్య : ఇంగ్లిష్ ఈజ్ జస్ట్ ఎ లాంగ్వేజ్… నాట్ నాలెడ్జ్..!

ఇప్పుడంతా ఇంగ్లిష్ హాట్ టాపిక్. ఇంగ్లిష్ మీడియం కావాలని కొంత మంది .. వద్దని కొంత మంది వాదిస్తున్నారు. వచ్చే వేసవి సెలవులు అయిపోయిన తర్వాత ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్క ఇంగ్లిష్ మీడియం మాత్రమే ఉంటుంది. తెలుగు మీడియం ఉండదు. ఐదు తరగతి వరకూ తెలుగు మీడియం చదవినా.. ఆరో తరగతి ఇంగ్లిష్ మీడియంకు వెళ్లిపోవాలి. ఇక ఒకటో తరగతిలో చేరేవారు.. ఇంట్లో.. అప్పటి వరకూ తల్లిదండ్రులు నేర్పిన.. అ.. ఆలు కాకుండా.. ఏబీసీడీలతో ప్రారంభించాలి. అక్కడే పరిస్థితి తిరగబడతోంది.

ఇంగ్లిష్ వస్తే మేధావులైపోతారా..?

ఇంగ్లిష్ అనేది ఓ భాష మాత్రమే. అది ప్రత్యేకంగా… విషయ పరిజ్ఞానాన్ని, తెలివి తేటల్ని కానీ తెచ్చి పెట్టదు. కానీ ఇంగ్లిష్ వస్తే.. అవకాశాలు ఎక్కువగా వస్తాయి. ఇంగ్లిష్ మీడియంలో చదివితే మాత్రమే రావు. ప్రభుత్వ బడుల్లో…మాతృభాషలో చదువుకున్నవారే ఇప్పుడు… ప్రపంచ స్థాయిలో అనేక రంగాల్లో లీడర్లుగా ఉన్నారు. వారికేమీ మాతృభాషలో చదువుకోవడం అడ్డంకి కాలేదు. పైగా మాతృభాషలో చదువు ప్రారంభించడం వల్ల … చదువుకు పునాది బలంగా పడుతుంది. ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న వారు వెనుకబడిపోవడానికి ప్రధాన కారణం ఇంగ్లిష్ కాదు. ఆయా స్కూళ్లలో విద్యాప్రమాణాలు నాసిరకంగా ఉండటమే కారణం. ఆ విషయం ఎవరైనా చెబుతారు.

ప్రభుత్వ స్కూళ్లలో విద్యా ప్రమాణాలే అసలు విలన్..!

ఇంగ్లిష్ ఓ సబ్జెక్ట్ గా.. అన్ని తరగతుల్లోనూ ఉంది. అలాంటప్పుడు… విద్యార్థులకు ఇంగ్లిష్ విషయంలో.. ఎందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విద్యాప్రమాణాలు పెంచితే.. తెలుగు మీడియాలో చదివినా.. ఇంగ్లిష్‌పై పట్టు సాధించవచ్చు. విద్యానిపుణులు అదే చెబుతున్నారు. ప్రభుత్వంలో ఉన్న వారికీ అది తెలియక కాదు.. కానీ ఓ ప్రత్యేకమైన ఎజెండా ప్రకారమే.. తెలుగు మీడియంను రద్దు చేస్తున్నారన్న అనుమానాలు అక్కడే వస్తున్నాయి. తెలుగు మీడియం లేకుండా చేయడాన్ని దాదాపుగా అందరూ వ్యతిరేకిస్తున్నారు. అదే కర్ణాటకలో అయినా… తమిళనాడులో అయినా.. మలయాళంలో ఆయా భాషల మీడియంను తొలగిస్తామని అక్కడి ప్రభుత్వాలు ప్రకటన చేస్తే.. ఏం జరుగుతుందో ఊహించలేం. అలాంటి ఆలోచనలు కూడా అక్కడి ప్రభుత్వాలు చేయవు. దక్షిణాది రాష్ట్రాల్లో భాషల్లోనే సంస్కృతి, సంప్రదాయాలు ఇమిడి ఉంటాయి. ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా వారు .. తమ మాతృభాషను… మర్చిపోరు. తమ ఎదుగుదలకు ఇంగ్లిష్ అవసరమని నేర్చుకుంటారు కానీ… తెలుగును మర్చిపోయేలా…చేయాలనుకోరు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే ప్రత్యేకం. తెలుగు మీడియంను ఉంచాలని డిమాండ్ చేయడం.. రాజకీయ దురుద్దేశంగా పాలకులకు కనిపిస్తోంది.

ఇంగ్లిష్ జోలికెళ్లని దేశాలు ఎలా అభివృద్ధి చెందాయి..?

ఇంగ్లిష్ గ్లోబల్ లాంగ్వేజ్. నిజమే…కానీ.. ప్రపంచం లో అన్ని దేశాలు ఇంగ్లిష్‌ను ఇదే విధంగా ప్రోత్సహిస్తున్నాయా అంటే.. యూరప్‌లో చిన్న చిన్న దేశాలు కూడా.. ఒక్క ముక్క ఇంగ్లిష్‌ను నేర్చుకోవు. యూరప్‌లోనే.. వేర్వేరు దేశాలకు వేర్వేరు భాషలు ఉంటాయి. నేర్చుకుంటే ఇంగ్లిష్‌ను అదనంగా నేర్చకుంటారు తప్ప…ఇంగ్లిష్‌తో పోలికలు ఉన్నాయని.. మాతృభాషను వదిలేసి.. ఇంగ్లిష్ వెంట పడరు. అసలు అలాంటి ఆలోచన కూడా చేయలేదు. కానీ అక్కడ అభివృద్ధికి కానీ.. మానవాభివృద్ధికి కానీ.. వచ్చిన లోటేం లేదు. అంటే.. అక్కడకు..ఇక్కడకు ఆలోచనల్లోనే తేడా.. ” The truth is that English is a language, a means of communication. It is not a measure of intelligence or character..” అంతిమంగా ఇదే నిజం..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close