ఇంగ్లిష్ మీడియంతో మత మార్పిళ్లు సాధ్యమా..?

తెలుగు మీడియంను ఎత్తేయాలన్న ఏపీ సర్కార్ నిర్ణయం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఓ భారీ సంస్కరణ చేసే ముందు కనీస కసరత్తు చేయకపోవడం వినాశనానికి దారి తీస్తుందని.. మేధావులు ఆందోళన చెందుతూండగా.. మాతృభాష అంతర్థానం అయిపోతుందని.. అది తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు అంతమని.. పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇంగ్లిష్ ప్రోత్సాహం వెనుక మత ఎజెండా ఉందని బీజేపీ అంటోంది. తెలుగు మీడియం లేకుండా చేయడాన్ని దాదాపుగా అందరూ వ్యతిరేకిస్తున్నారు. ఇలా.. తెలుగును చంపేసి.. ఇంగ్లిష్‌ను మాత్రమే హైలెట్ చేయాలనుకోవడం వెనుక.. మత పరమైన కుట్ర ఉందన్న అభిప్రాయం.. ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయాలను గత ఐదు నెలలుగా చూస్తున్నవారికి అనిపిస్తోంది. బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ ఇదే విషయాన్ని బహిరంగంగానే చెప్పారు. ఇలాంటి ప్రయత్నాలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు.

సాధారణంగా తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు భాషతోనే ముడిపడి ఉంటాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్‌ మాత్రమే కాదు దక్షిణాది రాష్ట్రాల్లో.. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం.. తమదైన ప్రత్యేక భాష, సంస్కృతి, సంప్రదాయాలు ఉంటాయి. అందుకే… భాషను కాపాడుకోవడానికి అందరూ.. తలా ఓ చేయి వేస్తారు. కానీ పీక పిసకాలనే ఆలోచన మాత్రం ఇంత వరకూ చేయలేదు. కానీ.. ఏపీలో మాత్రం.. రాజకీయ ప్రయోజనాల కోసమే… సంస్కృతి, సంప్రదాయాలపై దాడులు చేస్తున్నారన్న అభిప్రాయం పెరుగుతోంది. పూర్తి స్థాయిలో ఇంగ్లిష్ బోధన వల్ల.. పాశ్చాత్య సంస్కృతిని చిన్నారుల మనసుల్లో చొప్పించడం ద్వారా.. మత మార్పిళ్లకు ప్రోత్సహించే అవకాశం ఉందన్నది కొంత మందివాదన.

అయితే.. దీన్ని చాలా మంది తోసి పుచ్చుతున్నారు. మరి ఇప్పుడు ఇంగ్లిష్ మీడియం చదువుతున్న వారందరూ.. మతం మారిపోయారా.. అని వాదన ప్రారంభిస్తున్నారు. అలా ఇంగ్లిష్ మీడియంలో చదవడం వల్లనే.. మతం మారకపోవచ్చు కానీ..అదే ఉద్దేశంతో తెస్తున్న సంస్కరణలు మాత్రం ఆ దిశగానే రేపటి పౌరుల్ని.. మార్చే అవకాశం ఉంది. అందుకే అందరిలోనూ.. ఆందోళన పెరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్ కు ఏమైంది..?

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ప్రసంగం అనగానే తెలంగాణ ప్రజలంతా చెవులు రిక్కించి వినేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఇదంతా గతం. అధికారం కోల్పోయాక ఆయన ప్రసంగంలో మునుపటి వాగ్ధాటి కనిపించడం లేదనే అభిప్రాయాలు...

బొత్స తండ్రి సమానుడా ? : షర్మిల

వైఎస్ జగన్ బొత్సను తన తండ్రి సమానుడు అని అనడం.. ఆయన విచిత్రమైన హావభావాలతో కంట తడిపెట్టుకున్నట్లుగా నటించడం, తర్వాత కాళ్లకు దండం పెట్టే ప్రయత్నం చేయడం విజయనగరం సిద్ధం సభలో కనిపించిన...

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close