#RRR అప్‌డేట్

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం #RRR. రామ్ చర‌ణ్‌, ఎన్టీఆర్ క‌థానాయ‌కులుగా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో షూటింగ్ జ‌రుగుతోంది. అల్లూరి సీతారామ‌రాజు గెట‌ప్‌లో ఉన్న రామ్ చ‌ర‌ణ్‌తో పాటు వంద‌లాది మంది జానియ‌ర్ ఆర్టిస్టులు ఈ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. అది కోర్టుకి సంబంధించిన స‌న్నివేశం. అల్లూరి సీతారామ‌రాజుని బ్రిటీషు న్యాయ‌స్థానం ప్ర‌శ్నించే సన్నివేశాల్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం హైద‌రాబాద్ శివార్ల‌లో ఓ పెద్ద సెట్ వేశారు. షూటింగ్‌లో 60 శాతం అక్క‌డే జ‌ర‌గ‌నుంది. మంగ‌ళ‌, బుధ వారాల్లో ఫిల్మ్‌సిటీలోనే స‌న్నివేశాల్ని తెర‌కెక్కిస్తారు. ఈ షెడ్యూల్‌లో ఎన్టీఆర్ లేడు. త్వ‌ర‌లోనే ఎన్టీఆర్ – చ‌ర‌ణ్‌ల‌పై కొన్ని కీల‌క‌మైన స‌న్నివేశాల్ని చిత్రీక‌రించ‌నున్నారు. #RRR విడుద‌ల తేదీ విష‌యంలో చాలా అనుమానాలున్నాయి. 2020లో రావాల్సిన సినిమా ఇది. అయితే… 2021 సంక్రాంతికి విడుద‌ల చేసే అవ‌కాశాలున్నాయ‌న్న టాక్ వినిపిస్తోంది. ఈ విష‌య‌మై చిత్ర‌బృందం అధికారికంగా స్పందించ‌లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close