ఆ పాత కేసును క‌దిలించేలా చేసింది ఎర్ర‌బెల్లి..?

కేసుల రాజ‌కీయాలు తెలిసిందే! ఒక నాయ‌కుడిని లేదా కొంత‌మందిని కంట్రోల్ చెయ్యాలంటే ఒక్కోసారి ఒక్క కేసు చాలు. కొన్ని సందర్భాల్లో నాయ‌కుల్ని నియంత్రించ‌గ‌లిగే సులువైన మార్గం ఇదే! ఇదే త‌ర‌హాలో ఎప్ప‌టిదో ఒక పాత కేసు తెలంగాణ రాజ‌కీయాల్లో తెర మీదికి వ‌స్తోంది. వ‌రంగ‌ల్ డీసీసీ బ్యాంకు కుంభ‌కోణం మ‌రోసారి ఇప్పుడు వార్త‌ల్లోకి రాబోతోంది. ఎందుకంటే, గ‌తంలో ఈ బ్యాంకు కేంద్రంగా జ‌రిగిన అవినీతిపై స‌మ‌గ్ర ద‌ర్యాప్తు ఇప్పుడు జ‌రిపించాల‌నీ, దోషుల నిగ్గు తేల్చాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. విచార‌ణ‌ను సీఐడీకి ఇప్పుడు అప్ప‌గించింది. కేవ‌లం అవినీతి రంగు తేల్చేందుకే ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌య‌మా ఇది..? దీని వెన‌క ఏదైనా రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల ప్రేరేపిత ప్రోత్సాహం ఉందా అనే అనుమానాలు క‌లుగుతున్నాయి.

ఇదంతా ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలోని కొంత‌మంది కాంగ్రెస్ నేత‌లను ల‌క్ష్యంగా చేసుకుని అధికార పార్టీ ప్రారంభించిన ఆప‌రేష‌న్ గా కొన్ని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పంట రుణాల పేరుతో డీసీసీ బ్యాంకులో దాదాపు రూ. 8 కోట్ల అవినీతి జ‌రిగింద‌నే ఆరోప‌ణ‌లు రెండేళ్ల కింద‌ట తీవ్ర చ‌ర్చ‌నీయ‌మ‌య్యాయి. అప్ప‌ట్లో, ప్ర‌స్తుత కాంగ్రెస్ నేత జంగా రాఘ‌వ‌రెడ్డి ఛైర్మ‌న్ గా ఉండేవారు. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో తెరాస నేత ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర‌రావు మీద ఆయ‌న పాల‌కుర్తిలో పోటీ చేసి ఓడిపోయారు. అయితే, అప్ప‌ట్నుంచీ ఆయ‌న మ‌రింత యాక్టివ్ గా ఉంటున్నారు. మ‌రో ఐదేళ్లు టార్గెట్ గా పెట్టుకుని ఇప్ప‌ట్నుంచే గ‌ట్టి ప్ర‌య‌త్న‌మే చేస్తున్నారు. ప్ర‌స్తుత మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో జ‌న‌గామ జిల్లాలో రాఘ‌వ‌రెడ్డి కాంగ్రెస్ త‌ర‌ఫున కీల‌క పాత్రే పోషించారు. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో కాంగ్రెస్ నేత‌గా ఆయ‌న ఎదిగే అవ‌కాశం ఉంద‌నీ అంటున్నారు. అయితే, జంగాతోపాటు ఇత‌ర కాంగ్రెస్ నేత‌లకి చెక్ ప‌డాలంటే రెండేళ్లుగా పెండింగ్ లో ఉన్న డీసీసీ బ్యాంకు అవినీతి కేసులో క‌ద‌లిక తేవాల‌నే ప్ర‌య‌త్నం మంత్రి ఎర్ర‌బెల్లి చేశార‌నే గుస‌గుస‌లూ వినిపిస్తున్నాయి.

ఈ కేసు ద్వారా ఉమ్మ‌డి వ‌రంగల్ జిల్లాలోని ఈ మ‌ధ్య మ‌రింత యాక్టివ్ అయ్యేందుకు ప్ర‌య‌త్నిస్తున్న కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌లంద‌రికీ ఝ‌ల‌క్ ఇచ్చిన‌ట్టు అవుతుంద‌ని తెరాస వ‌ర్గాల్లో వినిపిస్తోంది. దీనికి త‌గ్గ‌ట్టుగా, ప్ర‌భుత్వ నిర్ణ‌యం వెలువ‌డ‌గానే… రెండేళ్లూ లేనిది, ఇప్పుడే ఎందుకు క‌ద‌లిక వ‌చ్చింద‌ని కాంగ్రెస్ నేత‌ల‌కు షాక్ తిన్న‌ట్టు స‌మాచారం. ఈ కేసు తెర‌మీదికి వ‌స్తే… జిల్లాలో కొంత‌మంది కాంగ్రెస్ నేత‌ల‌కు చెక్ ప‌డుతుంద‌నీ, వాళ్లు దూకుడుకి బ్రేక్ పడుతుందనేది వ్యూహంగా తెలుస్తోంది. ఈ ప్ర‌ణాళిక వెన‌క మంత్రి హ‌స్తం ఉంద‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close