అత్తారింటికి లీక్ బాగోతంతో ‘ఎరుపు’ సినిమా..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ట్రెండ్ సెట్ చేసిన సినిమా అత్తారింటికి దారేది.. 80 ఏళ్ల సిని చరిత్రలో ఎప్పుడు ఆ సినిమాకు ఎదురైన సమస్య ఏ సినిమాకు ఎదురు కాలేదు. సినిమా విడుదలకు ముందే సినిమా మొదటి భాగం లీక్ అవ్వడం అది ప్రేక్షకుల దగ్గరకు చేరిపోవడం అంతా జరిగిపోయింది. కేవలం కొందరి స్వార్ధం కోసం.. మరికొందరు సరదా కోసం ఆ సినిమాను లీక్ చేయడం జరిగింది.

ఇక సినిమా సక్సెస్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ ఆ లీక్ చేయించింది ఎవరు అనేది తమకు తెలిసిందని.. వారి బరతం పడతాం అన్నట్టుగా మాట్లాడాడు. అయితే ఇన్నాళ్లకు అత్తారింటికి లీక్ బాగోతం మీద సినిమా రావడంతో మరోసారి ఆ లీక్ వెనుక ఎవరెవరి అస్త్రాలున్నాయో అని అందరు ఆలోచించడం మొదలెట్టారు. వెంకట్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఓయ్ సినిమా దర్శకుడు ఆనంద్ రంగ, శేషు రెడ్డి నిర్మిస్తున్నారు.

ఎన్నో వందల కొద్ది సినిమాలకు పోస్టర్స్ డిజైన్ చేసిన అనిల్ అండ్ భానులు ఈ సినిమాకు సహ నిర్మాతలుగా వ్యవహరించడం జరుగుతుంది. రీసెంట్ గా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైన ఈ సినిమా టీజర్ కొద్దిగంటల క్రితం హీరో సిద్ధార్థ్ అండ్ వి.వి.ఎస్ లక్ష్మన్ ట్విట్టర్ లో విడుదల చేశారు. సినిమా టీజర్ అయితే సినిమా ఎలా లీక్ అయ్యింది అనే విషయాన్ని బహిర్గతం చేసేలానే చూపించారు మరి సినిమా వచ్చాక ఎలాంటి గొడవలకు దారితీస్తుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అనవసరమైన ట్వీట్లతో గందరగోళం సృష్టిస్తున్న నాగబాబు

మెగా బ్రదర్ నాగబాబు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్నారు. రాజకీయ ప్రత్యర్థులు కానీ, సినీ రంగంలో ప్రత్యర్థులు కానీ చిరంజీవి పైన లేదంటే పవన్ కళ్యాణ్ పై నోరు...

ఇదేం చోద్యం: క‌రోనాపై జూదం

క్రికెట్ మ్యాచ్ జ‌రుగుతుంటే బెట్టింగులు వేయ‌డం చూశాం. ఎల‌క్ష‌న్ల‌లోనూ.. బెట్టింగులు మొద‌ల‌య్యాయి. ఫ‌లానా సినిమా హిట్ట‌వుతుందా? అయితే ఎన్ని కోట్లు సాధిస్తుంది? అనే విష‌యంలోనూ బెట్టింగులు వేసుకుంటుంటారు. ఇప్పుడు కొత్త...

నవరత్నాల్లో కేంద్ర నిధులున్నాయని బీజేపీకి ఇప్పుడే గుర్తొచ్చిందా..?

భారతీయ జనతా పార్టీ నేతలు.. ఏడాది తర్వాత ఏపీ సర్కార్‌పై కాస్త విమర్శలు ప్రారంభించారు. ఇప్పుడు విమర్శలకు వారు ఎంచుకున్న అంశం.. ఏపీ సర్కార్ అమలు చేస్తున్న పథకాల్లో కేంద్ర...

డిప్యూటీ సీఎంకు ఏపీ కోవిడ్ వైద్యం నచ్చలేదా..?

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి ఆంజాద్ భాషా కుటుంబానికి కరోనా సోకింది. కొద్ది రోజుల నుంచి ఈ ప్రచారం జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి .. వైయస్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించేందుకు ఇడుపుల పాయ వెళ్లినప్పుడు...

HOT NEWS

[X] Close
[X] Close