అదే నరసింహన్ గవర్నర్ అయితే ఇలా జరిగేదా !?

రిపబ్లిక్ డే రోజున కేసీఆర్ రాజ్యాంగాన్ని అవమానించారని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఫైరయ్యారు. కారణం ఏమిటంటే రాజ్‌భవన్‌లో జరిగే రిపబ్లిక్ డే వేడుక.. జెండా పండుగకు కేసీఆర్ వెళ్లలేదు. కనీసం సీనియర్ మంత్రిని కూడా పంపలేదు. దీనిపై ఈటల మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగానే రాజ్ భవన్ కు సీఎం కేసీఆర్ వెళ్ళలేదని, ఇది గవర్నర్ ను అవమానించడమేనని అన్నారు.

గవర్నర్ ఎవరైనా ఉండొచ్చు గాక.. కనీసం గవర్నర్ కుర్చీకి గౌవరం ఇవ్వాలని ఈటల హితవు పలికారు. తమిళిశై గవర్నర్‌గ ాఉన్నారని రాజ్ భవన్ లో జరిగిన గణతంత్ర వేడుకల్లో పాల్గొనకుండా సంప్రదాయాలను కేసీఆర్ తుంగలో తొక్కారని తాను హాజరుకాకుంటే సీనియర్ మంత్రినైనా రాజ్ భవన్ కు పంపించి ఉండాల్సిందని ఈటల విమర్శించారు. రాజ్ భవన్‌కు, ప్రగతి భవన్‌కు గ్యాప్ పెరగడం ప్రజలకు క్షేమ‌ం కాదన్నారు.

బహుశా.. గవర్నర్‌గా నరసింహన్‌ ఉన్నప్పుడు కేసీఆర్ ఎప్పుడూ ఇలాంటి కార్యక్రమాలకు డుమ్మా కొట్టలేదు. పైగా ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు. ఆ ఉద్దేశంతోనే ఈటల ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా భావిస్తున్నారు. అయితే తమిళిసై తెలంగాణ ప్రభుత్వం విషయంలో ఏమంత వ్యతిరేకంగా లేరు. వ్యతిరేక ప్రకటనలు కూడా చేయలేదు. మరి కేసీఆర్ రాజ్ భవన్ రిపబ్లిక్ డే విషయంలో ఎందుకు లైట్ తీసుకున్నారో టీఆర్ఎస్ వర్గాలకూ అంతు చిక్కడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మా పార్టీ నేతలపై దాడులు చేసుకుంటామా ?: సజ్జల

అమలాపురం దాడుల వెనుక వైసీపీ నేతల కుట్ర ఉందన్న తీవ్ర ఆరోపణలు వస్తూండటంతో ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెరపైకి వచ్చారు. విపక్షాల విమర్శలు చూస్తుంటే... నవ్వొస్తుంది... అధికార పార్టీ నేతలప ఇళ్లపై...

మళ్లీ జగన్‌ను దారుణంగా అవమానించిన టీఆర్ఎస్ మంత్రి !

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దావోస్‌లో కేటీఆర్‌తో భేటీ అయి... తమ మధ్య మంచి ర్యాపో ఉందని నిరూపిస్తూంటే తెలంగాణలో మాత్రం టీఆర్ఎస్ నేతలు దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏపీ సీఎం జగన్...
video

”థ్యాంక్ యూ” టీజర్.. చైతు ప్రయాణం

https://www.youtube.com/watch?v=t5NPiPtZ8PY నాగచైతన్య- విక్రమ్ కుమార్ కలయికలో తెరకెక్కుతున్న చిత్రం థ్యాంక్ యూ. ఈ సినిమా టీజర్ బయటికి వచ్చింది. 'నా విజయానికి నేనొక్కడినే కారణం' అనే హీరో డైలాగ్ తో ఓపెన్ అయన టీజర్...

కోనసీమ చిచ్చుపై పవన్ ప్రశ్నలకు వైసీపీ దగ్గర జవాబుందా?

కోనసీమలో చిచ్చు పెట్టాడనికే వైసీపీ ప్రణాళికాబద్దంగా వ్యవహరించిందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఇలా గొడవలు జరగడం.. అలా తమపై విమర్శలపై వైసీపీ నేతలు విరుచుకుపడటంతో పవన్ కల్యాణ్ అసలు విషయాలను ప్రజల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close