వివేకా హత్య కేసు .. ఇప్పుడు సీబీఐపైనే ఆరోపణలు !

వివేకా హత్య కేసులో కీలక మలుపులు తిరుగుతున్నాయి. దస్తగిరి కన్ఫెషన్ స్టేట్‌మెంట్ తర్వాత మెల్లగా అయినా విచారణ నిందితుల వద్దకు చేరుతున్న సమయంలో కొత్త కొత్త క్యారెక్టర్లకు బయటకు వస్తున్నాయి. నిన్నామొన్నటిదాకా అంతా ఇద్దరు, ముగ్గురు వైఎస్ వివేకా అల్లుడే చేయించాడని.. వివేకా స్త్రీ లోలుడని ప్రచారం చేయడానికి వెనుకాడని వ్యక్తులు తాజాగా సీబీఐ మీద గురిపెట్టారు. కల్లూరు గంగాధర్ రెడ్డి అనే యువకుడు కొత్తగా అనంతపురం ఎస్పీని కలిసి నేరుగా సీబీఐ అధికారుల మీద ఫిర్యాదు చేశారు.

వైఎస్ అవినాష్ రెడ్డికి.. ఆయన కుటుంబానికి వ్యతిరేకంగా సాక్ష్యాం చెప్పాలంటూ సీబీఐ అధికారులు బెదిరిస్తున్నారని ఆయన ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అంతే కాదు.. తనకు సీబీఐ అధికారులు రూ. పది కోట్లు ఆఫర్ చేశారని కూడా ఆరోపిస్తున్నారు. అంతే కాదు తానే చంపానని ఒప్పుకోవాలని కూడా ఒత్తిడి చేశారని అంటున్నారు. ఓ సమగ్రమైన లేఖను తీసుకుని ఆయన ఎస్పీని కలిశారు. తర్వాత ఓ వర్గం మీడియాకు ఇంటర్యూలు ఇచ్చారు. వివేకా హత్య కేసుతో తనకు సంబంధం లేదని.. గంగాధర్ రెడ్డి చెబుతున్నారు. తనకు ప్రాణహాని ఉందని.. తనకు రక్షణ కల్పించాలని ఆయన కోరారు.

కడప ఎస్పీని కాకుండా అనంతపురం ఎస్పీని కల్లూరు గగాంగధర్ రెడ్డి కలవడం.. అంతా ఓ ప్లాన్ ప్రకారం చెబుతున్నట్లుగా మీడియాకు చెబుతూండటం ఆసక్తి రేపుతోంది. సీబీఐ అధికారులపై ఆరోపణలు చేయడం ద్వారా వారిపై ఒత్తిడి తెచ్చే వ్యూహాన్ని కొంతమంది అమలు చేస్తున్నట్లుగా అనుమానిస్తున్నారు. ఈ కల్లూరు గంగాధర్ రెడ్డి ఎవరు.. ఏమిటి అన్నదానిపై వివరాలు బయటకు రావాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తెలంగాణ కంటే ఏపీకి రెట్టింపు పన్నుల వాటా రిలీజ్ చేసిన కేంద్రం !

ఏపీకి నిధుల విషయంలో అన్నీ కలసి వస్తున్నాయి. ధనిక రాష్ట్రం.. కేంద్రానికి పెద్ద ఎత్తున పన్నులు సంపాదించి పెట్టే తెలంగాణ కంటే.. రెట్టింపు పన్నుల వాటా నిధులు ఏపీకి వస్తున్నాయి. కేంద్రం తాజాగా...

మ‌ళ్లీ రంగంలోకి దిగుతున్న చిరు

క‌రోనా థ‌ర్డ్ వేవ్ ప్ర‌భావం తీవ్రంగా ఉండ‌డంతో అగ్ర క‌థానాయ‌కులంతా ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. షూటింగుల‌కు రామ‌ని చెప్పేశారు. చిరంజీవి కూడా త‌న చేతిలో సినిమాల‌న్నీ ప‌క్క‌న పెట్టేశారు. ఇప్పుడు మ‌ళ్లీ ఆయ‌న మేక‌ప్...

పెద్ద బ్యాన‌ర్ల చేతిలో ప‌డిన శ్రీ‌కాంత్ త‌న‌యుడు

ఈమ‌ధ్య పెద్ద బ్యాన‌ర్లు చిన్న సినిమాల‌పై దృష్టి నిలిపాయి. `జాతిర‌త్నాలు`తో చిన్న‌సినిమాల వ‌ల్ల ఉన్న లాభాలేమిటో అశ్వ‌నీద‌త్ లాంటి అగ్ర నిర్మాత‌కు బాగా అర్థ‌మైంది. అందుకే ఇప్పుడు మ‌రో చిన్న సినిమాకి...

ఉద్యోగుల్ని రెచ్చగొడుతున్న మంత్రులు, ప్రభుత్వం !

పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలని పాత జీతాలే ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ రోడ్డెక్కిన ఉద్యోగులను ప్రభుత్వం మరింతగా రెచ్చగొడుతోంది. జీతాల బిల్లులను వెంటనే ప్రాసెస్ చేయాలని ట్రెజరీలకు ఆదేశాలు ఇచ్చింది. ఉద్యోగులు రోడ్డెక్కినప్పటికీ.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close