మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్..!

చంద్రబాబు ప్రభుత్వంలో ఇంటలిజెన్స్ చీఫ్‌గా కీలక బాధ్యతలు నిర్వహించిన ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ సర్కార్ సస్పెండ్ చేసింది. ఆయనపై క్రమశిక్షణా చర్యల కింద.. చర్యలు తీసుకుంటూ.. సస్పెషన్ వేటు వేస్తున్నట్లుగా ప్రభుత్వం అర్థరాత్రి హడావుడిగా జీవో విడుదల చేసింది. విచారణ జరుగుతున్న సమయంలో అనుమతి లేకుండా విజయవాడ దాటి పోవద్దని ఆదేశాలు జారీ చేశారు. ఏబీ వెంకటేశ్వరరావుపై ప్రధానంగా ఐదు అభియోగాలను .. పేర్కొన్నారు. ఇందులో మొదటిది గ్రాస్ మిస్ కండక్ట్. క్రిటికల్ ఇంటలిజెన్స్ అండ్ సర్వైలెన్స్ కాంట్రాక్ట్‌ను ఓ ఇజ్రాయెల్ కంపెనీతో కుమ్మక్కయి.. అక్రమమంగా తన కుమారుడికి చెందిన కంపెనీకి ఇప్పించుకున్నారనేది మొదటి అభియోగం. ఇది నేరుగా విదేశీ రక్షణ తయారీ సంస్థతో నేరుగా సంబంధాలు పెట్టుకోవడమేనని.. ఇది సర్వీస్ ఎథికల్ కోడ్‌ను ఉల్లంఘించడమేనని ప్రభుత్వం చెబుతోంది.

రెండో అభియోగం .. ఏబీ వెంకటేశ్వరరావు చర్యల వల్ల దేశానికి , రాష్ట్రానికి ముప్పు ఏర్పడటం. ఇంటలిజెన్స్ చీఫ్‌గా ఏబీ వెంకటేశ్వరరావు.. కీలకమైన సమాచారాన్ని ఇజ్రాయెలీ కంపెనీలకు పంచుకున్నారని.. ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇంటలిజెన్స్ ప్రోటోకాల్స్ అండ్ ప్రొసీజర్స్ ఉద్దేశపూర్వకంగా వెల్లడించారని ప్రభుత్వం అభియోగం మోపింది. అలాగే ఎక్విప్ మెంట్‌ను కూడా సబ్ స్టాండర్డ్‌వి కొన్నారని .. స్టేట్ సీక్రెట్స్‌ను యాక్సెస్ చేశారని… దాని వల్ల లాభం పొందారని కూడా ప్రభుత్వం ఆరోపిస్తోంది. మూడో అభియోగం.. టెండర్లలో అక్రమాలకు పాల్పడటం, నాలుగో అభియోగం.., మొత్తం వ్యవహారంలో ఎన్నో ఇర్రెగ్యులారిటీస్‌ ఉండటం.. ఐదో అభియోగంగా.. సీనియర్ ఆఫీసర్లపై అమర్యాదగా ప్రవర్తించడాన్ని పేర్కొన్నారు. మొత్తానికి ఐదు అభియోగాలను మోపారు.. .సస్పెండ్ చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సినీ అవకాశం పేరిట “జబర్దస్త్” చీటింగ్

సినిమా ఇండస్ట్రీలో వేషాలు ఇప్పిస్తామంటూ చెప్పి యువతీ యువకులను మోసం చేయడం ఎప్పట్నుంచో జరుగుతున్నదే. యువతీయువకుల దగ్గరనుండి సినిమా అవకాశాలు పేరిట డబ్బులు గుంజడం, యువతుల పై లైంగిక వేధింపులకు పాల్పడడం వంటి...

వెబ్ సిరీస్‌గా ‘మైదానం’

క‌థ‌ల కొర‌త.. కొర‌త అంటుంటారు గానీ, వెద‌కాలే కానీ, మ‌న చుట్టూనే బోలెడ‌న్ని క‌థ‌లు. మ‌న సాహిత్యంలో ఎన్నో గొప్ప పాత్ర‌లు, న‌వ‌ల‌లు. వాటిని వాడుకోవడం తెలియాలంతే. ఓటీటీ వేదిక‌లు వ‌చ్చాక‌.. కంటెంట్,...

ఐశ్వ‌ర్య‌రాయ్‌కి క‌రోనా.. ఆరాధ్య‌కి కూడా

అమితాబ్ బ‌చ్చ‌న్‌, అభిషేక్ బ‌చ్చ‌న్ ల‌కు క‌రోనా సోక‌డం, ప్ర‌స్తుతం ముంబైలోని నానావ‌తీ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతుండ‌డం తెలిసిన విష‌యాలే. ఇప్పుడు ఐశ్వ‌ర్య‌రాయ్‌కి కూడా క‌రోనా సోకింది. కూతురు ఆరాధ్య‌కి కూడా క‌రోనా...

ఫ్లాష్ బ్యాక్‌: శోభ‌న్ బాబు క‌న్నీరు పెట్టిన వేళ‌!

ఏ విజ‌య‌మూ సుల‌భంగా రాదు. ఎన్నో ఆటు పోట్లు. అవ‌మానాల క‌ల‌యికే.. విజ‌యం. అలాంటి విజ‌యాలు మ‌రీ మ‌ధురంగా ఉంటాయి. ఏ స్టార్‌జీవితాన్ని తీసుకున్నా - ఎన్నో ఒడిదుడుకులు. 'నువ్వు న‌టుడిగా ప‌నికొస్తావా'...

HOT NEWS

[X] Close
[X] Close