క్రైమ్ : ఎన్ని సార్లు దొరికినా ఈ నాగరాజు మారడా..!?

జులాయి సినిమాలో బ్రహ్మానందం క్యారెక్టర్ బ్రహ్మం గుర్తుందా..?. దొంగతనాలను వృత్తిగా చేసుకుంటాడు కానీ ప్రతీ సారి దొరికిపోతూంటాడు. అన్ని సార్లు దొరికిపోతే ఎలా బతుకుతాడోనని జాలిపడి పోలీసు ఆఫీసరే తన ఇంట్లో పనికి పెట్టుకుంటాడు. అచ్చంగా ఇలాంటి క్యారెక్టరే ఒకటి పోలీసులకు రెగ్యూలర్‌గా తగులుతోంది. కానీ జాలిపడి పనిలో పెట్టుకునే ఆఫీసర్ ఇంకా ఎంట్రీ ఇవ్వకపోవడంతో ఆయన మోసగాడు అలా దొరికిపోతూనే ఉన్నాడు. అతనెవరో కాదు… నాగరాజు. రంజీ క్రికెటర్‌నని చెప్పుకుంటూ ఉంటాడు. రంజీ క్రికెటర్‌నని మోసాలు చేసే నాగరాజు అంటే చాలా మంది నోటబుల్.

గత నాలుగేళ్ల కాలంలో రంజీ క్రికెటర్ నాగరాజు చేసినమోసం అంటూ.. ప్రతీ నెలా ఏదో చోట కేసునమోదవుతూనే ఉంది. కొత్తగా ఆయన సీఎం కేటీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నారని.. ప్రకటనలకు డబ్బులు కావాలంటే కొంత మంది దగ్గర వసూళ్లు ప్రారంభించారు. అనుమానం వచ్చిన కొంత మంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు పట్టుకున్నారు. ఇదే మొదటి సారి కాదు. నాగరాజుపై విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్‌లలో పదుల సంఖ్యలో కేసులు ఉన్నాయి. గతంలో భారత క్రికెట్‌ జట్టు చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌తో పాటు పలువురు ప్రముఖుల పేర్లు వాడుకుని డబ్బులు దండుకున్నాడు.

ఏకంగా సీఎం జగన్‌ పీఏ నంటూ నమ్మించి ఢిల్లీలోని ఓ దవాఖాన నిర్వాహకుడికి ఫోన్‌ చేసి డబ్బులు డిమాండ్‌ చేసిన కేసు లో అరెస్టయ్యాడు. ధోని క్రికెట్‌ అకాడమీ ఏర్పాటు చేస్తున్నానంటూ నమ్మించి జైలు పాలయ్యాడు. క్రికెట్‌లో ప్రముఖుల వాయిస్‌ను ట్యాంపరింగ్‌ చేస్తూ మో సాలకు పాల్పడ్డాడు. అతనే హైదరాబాద్‌లోని రియల్‌ ఎస్టేట్‌ సంస్థను కూడా మంత్రి పీఏనని చెప్పుకొని మోసం చేసినట్లు పోలీసులకు ప్రాధమిక ఆధారాలు లభించాయి. ఇప్పటికి పదుల సార్లు ఇలా మోసం చేసిన కేసుల్లో అరెస్ట్ చేశారు. మోసం చేయబోయిన ప్రతీ సారి దొరికిపోయారా లేకపోతే… వందల మోసాల్లో కొన్నింటిని మాత్రమే కనిపెట్టగలిగారా అన్నది ఆసక్తికరం.

నాగరాజు సైడ్ బిజినెస్‌ల లెక్క చాలా పెద్దది. అన్ని సార్లు మోసం చేస్తే… సొమ్ములంతా ఏం చేస్తున్నారన్నది ఇప్పుడు పోలీసులు తెలుసుకోవాల్సిన ప్రశ్న. ఒక వేళ మోసం చేయడం చేత కాక దొరికిపోతున్నాడని తేలితే మాత్రం.. బ్రహ్మం క్యారెక్టర్ దిగిపోయినట్లే. అయితే ఇతనికి బ్లాక్ మెయిలింగ్ హాబీ కూడా ఉంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలో.. కోడెలపై ఎవరైనా ఫిర్యాదు చేయాలనుకుంటే చేయవచ్చంటూ విజయసాయిరెడ్డి ఫిర్యాదు ఇచ్చారు. దాంతో ఈ మోసగాడు కూడా.. కోడెలకు డబ్బులిచ్చానంటూ తెర ముందుకు వచ్చేశారు. రైల్వేలో ఉద్యోగం పేరుతో రూ.15 లక్షలు తీసుకుని.. నకిలీ నియామకపత్రం ఇచ్చాడని నాగరాజు కోడెల శివరాంపై ఫిర్యాదు కూడా చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీ గ్రామాలు చాలా క్లీన్ గురూ..!

ఆంధ్రప్రదేశ్ పట్టణాలు ఈజ్ ఆఫ్ లివింగ్‌లో వెనుకబడినా... గ్రామాలు మాత్రం పరిశుభ్రతలో ముందడుగు వేస్తున్నాయి. కేంద్రం బహిరంగ మూత్ర విసర్జన లేని గ్రామాలను రూపొందించాలన్న లక్ష్యంతో స్వచ్ఛ భారత్ -2ను చేపట్టింది....

జగన్ తరహాలో పథకాల అమలుకు కేసీఆర్ కసరత్తు..!

తెలంగాణ సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేసి.. ప్రజల్లో మళ్లీ నాటి విశ్వాసాన్ని పొందాలని అనుకుంటున్నారు. ఈ ఏడాది పూర్తి స్థాయిలో సంక్షేమ బడ్జెట్ ప్రవేశ పెట్టి.,. ఓ క్యాలెండర్...

ఆర్కే పలుకు : విశాఖలో వైసీపీ ఓడితే ఏపీ అసెంబ్లీ రద్దు..!

ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ప్రకటించిన విశాఖలో గెలవకపోతే సీఎం జగన్ అసెంబ్లీని రద్దు చేయాలనే ఆలోచనలో ఉన్నారా...?. అవుననే అంటున్నారు ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ. వైసీపీ క్యాంప్‌లో ఆయనకు అత్యంత...

లార్డ్స్‌లో భారత్ కోసం ఎదురు చూస్తున్న టెస్ట్ వరల్డ్ కప్..!

ప్రపంచ టెస్ట్ చాంపియన్లుగా అవతరించడానికి భారత్‌కు గోల్డెన్ చాన్స్ వచ్చింది. లార్డ్స్ వేదికగా జూన్ 18 నుంచి ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్‌లో భారత్ న్యూజిలాండ్‌తో తలపడనుంది. అహ్మదాబాద్ లో జరిగిన నాలుగో...

HOT NEWS

[X] Close
[X] Close