ఏపీ టీచర్ ఎమ్మెల్సీ బరిలో జనసేన..! సీరియస్సేనా..?

ఎన్నికల్లో పోటీ చేయడానికి జనసేన పార్టీ చాలా ఆతృతగా ఉందని మరోసారి స్పష్టమయింది. ప్రత్యక్ష ఎన్నికల్లో తమ బలాన్ని నిరూపించుకోవాల్న లక్ష్యంతో ఉంది. పంచాయతీ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరిగాయి కాబట్టి సొంత ప్రకటనలే.. కానీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి. అలాగే… ఏపీలో రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. వీటిలో ఓ స్థానంలో జనసేన పోటీ చేయాలని నిర్ణయించింది. పవన్ కల్యాణ్ అభ్యర్థిని కూడా ఖరారు చేశారు. గుంటూరు, కృష్ణా జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గాదె వెంకటేశ్వరరావు అనే విద్యా రంగ ప్రముఖుడిని పవన్ కల్యాణ్ ఖరారు చేశారు.

ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అప్పగించడం ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని అలాంటి పనుల వల్ల ఉపాధ్యాయులు.. బోధనపై దృష్టి పెట్టలేకపోతున్నారని..ఆ పరిస్థితులు మారుస్తామని పవన్ కల్యాణ్ అంటున్నారు. నిజానికి టీచర్స్ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో పోటీ చేయడం సాహసమనే చెప్పాలి. ఎందుకంటే టీచర్ల ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో ప్రధానంగా ఉపాధ్యాయ సంఘాలు మాత్రమే పోటీ చేస్తూ ఉంటాయి. రాజకీయ పార్టీలు జోక్యం చేసుకోవు. ఒక వేళ ఏదైనా రాజకీయ పార్టీ పోటీ చేసినా వారికి పెద్దగా ప్రాధాన్యం ఉండదు. ఇప్పుడుకూడా అంతే ఏపీ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయ సంఘాల మధ్యనే పోటీ కనిపిస్తోంది.

అయితే మండలిలో పట్టు సాధించాలనుకుంటున్న సీఎం జగన్… ఈ రెండింటిలోనూ పోటీ చేయాలని అనుకున్నారు. అయితే పరిస్థితుల్ని వివరించిన పార్టీ నేతలు పోటీ చేయకపోవడమే మంచిదని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో జనసేన పార్టీ మాత్రం… దూకుడుగా ముందుకెళ్తోంది. తమ పార్టీ తరపున అభ్యర్థిని ఖరారు చేసింది. ఇదే దూకుడుతో పవన్ కల్యాణ్.. తిరుపతి అభ్యర్థిని కూడా ఖరారు చేయాలని జనసైనికులు కోరుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీ గ్రామాలు చాలా క్లీన్ గురూ..!

ఆంధ్రప్రదేశ్ పట్టణాలు ఈజ్ ఆఫ్ లివింగ్‌లో వెనుకబడినా... గ్రామాలు మాత్రం పరిశుభ్రతలో ముందడుగు వేస్తున్నాయి. కేంద్రం బహిరంగ మూత్ర విసర్జన లేని గ్రామాలను రూపొందించాలన్న లక్ష్యంతో స్వచ్ఛ భారత్ -2ను చేపట్టింది....

జగన్ తరహాలో పథకాల అమలుకు కేసీఆర్ కసరత్తు..!

తెలంగాణ సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేసి.. ప్రజల్లో మళ్లీ నాటి విశ్వాసాన్ని పొందాలని అనుకుంటున్నారు. ఈ ఏడాది పూర్తి స్థాయిలో సంక్షేమ బడ్జెట్ ప్రవేశ పెట్టి.,. ఓ క్యాలెండర్...

ఆర్కే పలుకు : విశాఖలో వైసీపీ ఓడితే ఏపీ అసెంబ్లీ రద్దు..!

ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ప్రకటించిన విశాఖలో గెలవకపోతే సీఎం జగన్ అసెంబ్లీని రద్దు చేయాలనే ఆలోచనలో ఉన్నారా...?. అవుననే అంటున్నారు ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ. వైసీపీ క్యాంప్‌లో ఆయనకు అత్యంత...

లార్డ్స్‌లో భారత్ కోసం ఎదురు చూస్తున్న టెస్ట్ వరల్డ్ కప్..!

ప్రపంచ టెస్ట్ చాంపియన్లుగా అవతరించడానికి భారత్‌కు గోల్డెన్ చాన్స్ వచ్చింది. లార్డ్స్ వేదికగా జూన్ 18 నుంచి ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్‌లో భారత్ న్యూజిలాండ్‌తో తలపడనుంది. అహ్మదాబాద్ లో జరిగిన నాలుగో...

HOT NEWS

[X] Close
[X] Close