పరీక్షలు పరీక్షలే..! మోడీ మాట కాదు.. జగన్ బాట..!

ప్రధానమంత్రి నరేంద్రమోడీ చొరవతో సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షల్ని రద్దు చేసింది. ఇంటర్ పరీక్షల్ని అంటే పన్నెండో తరగతి పరీక్షల్ని వాయిదా వేసింది. మోడీనే అలాంటి నిర్ణయం తీసుకున్న తర్వాత మనం మాత్రం ఎందుకు విద్యార్థులను రిస్క్‌లో పెట్టడం అని..తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా అదే తరహా నిర్ణయం తీసుకన్నారు. టెన్త్ పరీక్షలు రద్దు చేశారు. ఇంటర్ పరీక్షల్ని వాయిదా వేశారు. దేశంలోని దాదాపుగా అన్ని రాష్ట్రాలు అదే పనిలో ఉన్నాయి. కానీ.. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం… పరీక్షలు నిర్వహించి తీరుతామని ప్రకటనలు చేస్తున్నారు.

వాస్తవానికి… కరోనా రోజు రోజుకు ఉద్ధృతం అవుతున్నప్పటికీ.. ఏపీలో ఇప్పటికీ స్కూళ్లు నిర్వహిస్తున్నారు. వైరస్ బయటపడిన స్కూళ్లలో ఒకటి, రెండు రోజులు సెలవులు ఇచ్చి మళ్లీ కొనసాగిస్తున్నారు. దీంతో కరోనా బారిన పడుతున్న విద్యార్థుల సంఖ్య.. టీచర్ల సంఖ్య పెరుగుతోంది. గుంటూరులో ఓ ప్రభుత్వ స్కూళ్లో ఇద్దరు టీచర్ల కరోనాతో చనిపోయారు. పరిస్థితి వరస్ట్‌గా మారుతోందని… తెలిసి కూడా ప్రభుత్వం మంకుపట్టు వీడటం లేదు. కనీసం తరగతుల నిలిపివేత నిర్ణయం తీసుకోకపోగా.. పరీక్షలు నిర్వహించి తీరుతామని విద్యామంత్రి ఆదిమూలపు సురేష్ రోజూ ప్రకటిస్తున్నారు.

సీఎం జగన్ సారధ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని పరీక్షలు నిర్వహిస్తామని చెబుతున్నారు. కరోనా జాగ్రత్తలు సీఎం కాదు.. పీఎం ఆధ్వర్యంలో తీసుకున్నా… ముప్పు పొంచే ఉంటుందన్న ఉద్దేశంతోనే సీబీఎస్‌ఈ సహా అన్ని విద్యా బోర్డులు పరీక్షల విషయంపై నిర్ణయం తీసుకుంటే.. ఏపీలో మాత్రం విద్యార్థులను రిస్క్‌లో పెడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close