ప్రశ్నలన్నీ వైఎస్ విజయలక్ష్మికే..!

వైసీపీ గౌరవాధ్యక్షురాలికి కాలం అంతగా కలసి రావడం లేదు. వైసీపీకి గౌరవాధ్యక్షురాలిగా ఉండి.. మరో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడంపై వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఉంటే.. తాజాగా షర్మిలపై తెలంగాణ పోలీసులు వ్యవహరించిన తీరును ఖండించిన వైనం విషయంలోనూ ఆమెపై విమర్శలు దూసుకొస్తున్నారు. విజయలక్ష్మి .. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి తల్లి అని.. గత ఏడాదిన్నరగా ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని మహిళా రైతులపై పోలీసులు జరుపుతున్న దాష్టీకాలు కనిపించలేదా అని అక్కడి రైతులు ప్రశ్నించడం ప్రారంభించారు. హైదరాబాద్‌లో పాదయాత్ర చేస్తూ వస్తున్న షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. అనుమతిలేదని.. చెప్పి బలవంతంగా పోలీస్ వాహనంలో తీసుకొచ్చి లోటస్ పాండ్‌లో వదిలి పెట్టారు. ఆ సమయంలో జరిగిన తోపులాటలో కింద పడ్డారు. జాకెట్ చినిగిపోయింది.

ఈ ఘటన చూసి తల్లి విజయలక్ష్మి ఆవేదన చెందారు. మీడియా ముందుకు వచ్చి తెలంగాణ పోలీసులపై మండిపడ్డారు. కేసీఆర్‌పైనా సీరియస్‌ అయ్యారు. ఆమె వ్యాఖ్యలు చేసిన సమయంలో.. ఏపీలో అందరికీ… అమరావతి మహిళా రైతులే గుర్తుకు వచ్చారు. అమరావతి కోసం పోరాడుతున్న మహిళా రైతులపై పోలీసులు జరిపి దాష్టీకాలు అన్నీ ఇన్నీ కావు. కొట్టారు.. తిట్టారు.. కేసులు పెట్టారు. అవి జాతీయ మానవహక్కుల సంస్థ వరకూ వెళ్లాయి. కానీ ఎప్పుడూ కూడా.. వారంతా ఆడవాళ్లే అని కానీ వారిలో చాలా మంది వైసీపీకి ఓట్లేసిన వాళ్లే అయినా కానీ.. పట్టించుకోలేదు. కనీసం పోలీసులు అలా చేయడం కరెక్ట్ కాదని ఎవరూ స్టేట్ మెంట్ ఇవ్వలేదు.

షర్మిల కూతురనే స్పందించారా.. ఆంధ్రప్రదేశ్ అమరావతి మహిళా రైతుల పట్ల కనీస బాధ్యత లేదా.. అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మహిళా రైతుల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై ఒక్క సారైనా తమ కుమారుడికి చెప్పారా అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి రాజకీయాలకు సంబంధం లేకపోయినా పిల్లల కోసం.. రెండు పార్టీల కోసం పని చేస్తున్న విజయలక్ష్మికి సమాదానం చెప్పుకోలేని ప్రశ్నలు ఎదురొస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రమేష్ ఆస్పత్రికి రఘురామ..! హైకోర్టు ఆదేశాలనైనా పాటిస్తారా..?

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి అయినా రమేష్ ఆస్పత్రికి రఘురామకృష్ణరాజును తరలించకూడదనుకున్న సీఐడీ అధికారులు.. ప్రభుత్వానికి షాక్ తగిలింది. సీఐడీ కోర్టు ఆదేశించించినట్లుగానే.. రమేష్ ఆస్పత్రికి రఘురామకృష్ణరాజును తరలించాలని స్పష్టం చేసింది. గుంంటూరు ప్రభుత్వాసుపత్రిలో...

జైలుకు ఆర్ఆర్ఆర్.. కోర్టును లైట్ తీసుకున్న సీఐడీ..!

ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు కోర్టులను లెక్క చేయలేదు. ఎంపీ రఘురామకృష్ణరాజుకు వైద్యం అందించాలని ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టేసి.. జిల్లా జైలుకు తరలించేశారు. ఆయనకు వైద్యం అందించే విషయంలోనే కాదు.. వైద్య నివేదిక...

టీవీ9 ప్రాథమిక నివేదిక.. ఆర్ఆర్ఆర్‌కి సొరియాసిస్..!

రఘురామకృష్ణరాజు కాళ్లకు ఉన్న దెబ్బల గురించి టెస్టులు చేసి నివేదిక ఇవ్వాలని సీఐడీ కోర్టు.. హైకోర్టులు ఆదేశించాయి. వైద్యులు నివేదికల కోసం.. కోర్టు ఇచ్చిన సమయం దాటి మరీ టెస్టులు చేస్తున్నారు. నివేదికలు...

రేవంత్‌కు పోలీసులే అలా ప్రచారం చేసి పెడతారు..!

హైదరాబాద్‌లో రూ. ఐదు రూపాయల భోజన కేంద్రాలయిన అన్నపూర్ణ క్యాంటీన్లు కొనసాగుతాయని మీడియాకు సమాచారం ఇచ్చిన తెలంగాణ సర్కార్.. నిజానికి ఆపేసింది. దాంతో పేదలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. చాలా చోట్ల టీఆర్ఎస్...

HOT NEWS

[X] Close
[X] Close