తెలంగాణలో “గుర్తు”ను కోల్పోయిన జనసేన..!

జనసేన పార్టీకి.. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు ఏదీ కలసి రావడం లేదు. బీజేపీతో స్నేహం కోసం గ్రేటర్ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండటంతో తెలంగాణలో జనసేన పార్టీ తన గుర్తు అయిన గాజు గ్లాస్‌ను కోల్పోయింది. సాగర్ ఎన్నికల్లోనూ పోటీ చేయకుండా ఎవరికీ మద్దతు ప్రకటన చేయకండా జనసేన గడిపేసింది. అయితే తాజాగా వెలువడిన మినీ మున్సిపల్ ఎన్నిక సమరంలో అన్ని చోట్లా పోటీ చేయాలని నిర్ణయించుకుంది. ఐదు మున్సిపాల్టీలతో పాటు ఖమ్మం, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలు 30వ తేదీన జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన నిర్ణయించుకుంది. అందుకే ఉమ్మడి గుర్తును కేటాయించాలని రాష్ట్ర ఎన్నికల అధికారికి ఓ విజ్ఞాపనా పత్రం పెట్టుకున్నారు.

ఇంతకు ముందు జరిగిన ఎన్నికల్లో కనీసం పది శాతం సీట్లలో అయినా పోటీ చేసి ఉంటే నిబంధనల ప్రకారం కామన్ గుర్తు కేటాయిస్తారు. అయితే జనసేన పార్టీ ఇటీవలి గ్రేటర్ ఎన్నికల్లో పదిశాతం సీట్లలో పోటీ చేయలేదు. అసలు పోటీ చేయలేదు. దీనిపై… జనసేన.. ఎస్ఈసీకి వివరణ ఇచ్చింది. భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నందున పోటీ చేయలేకపోయామని… ఈసారి అన్ని చోట్లా పోటీ చేస్తామని కామన్ గుర్తు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అయితే జనసేన వివరణపై తెలంగాణ ఎస్ఈసీ సంతృప్తి చెందలేదు. కామన్‌గా గాజు గ్లాస్ గుర్తు కేటాయించేందుకు అంగీకరించలేదు. దీంతో ఆ గుర్తు స్వతంత్రులకు కేటాయించనున్నారు.

జనసేన పార్టీ అభ్యర్థులు కూడా స్వతంత్రుల కిందనే వస్తారు కాబట్టి… వారు .. నామినేషన్లు వేసిన దగ్గరల్లా.. తమకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించాలని విజ్ఞప్తి చేసుకోవాల్సి ఉంటుంది. నిబంధనలను బట్టి అధికారులు గాజు గ్లాస్ గుర్తును కేటాయిస్తారు. ఇప్పటికైతే తెలంగాణలో గుర్తును కోల్పోయినట్లయింది. ఏపీలో కూడా జనసేన పార్టీకి గుర్తు విషయంలో పక్కాగా ఉండకపోవడంతో… తిరుపతి ఉపఎన్నికల్లో పోటీ చేయకపోయినా… వేరే పార్టీ అభ్యర్థికి ఆ గుర్తును ఈసీ కేటాయించింది. దీంతో జనసేన వర్గాలకు షాక్ తగిలినట్లయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రమేష్ ఆస్పత్రికి రఘురామ..! హైకోర్టు ఆదేశాలనైనా పాటిస్తారా..?

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి అయినా రమేష్ ఆస్పత్రికి రఘురామకృష్ణరాజును తరలించకూడదనుకున్న సీఐడీ అధికారులు.. ప్రభుత్వానికి షాక్ తగిలింది. సీఐడీ కోర్టు ఆదేశించించినట్లుగానే.. రమేష్ ఆస్పత్రికి రఘురామకృష్ణరాజును తరలించాలని స్పష్టం చేసింది. గుంంటూరు ప్రభుత్వాసుపత్రిలో...

జైలుకు ఆర్ఆర్ఆర్.. కోర్టును లైట్ తీసుకున్న సీఐడీ..!

ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు కోర్టులను లెక్క చేయలేదు. ఎంపీ రఘురామకృష్ణరాజుకు వైద్యం అందించాలని ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టేసి.. జిల్లా జైలుకు తరలించేశారు. ఆయనకు వైద్యం అందించే విషయంలోనే కాదు.. వైద్య నివేదిక...

టీవీ9 ప్రాథమిక నివేదిక.. ఆర్ఆర్ఆర్‌కి సొరియాసిస్..!

రఘురామకృష్ణరాజు కాళ్లకు ఉన్న దెబ్బల గురించి టెస్టులు చేసి నివేదిక ఇవ్వాలని సీఐడీ కోర్టు.. హైకోర్టులు ఆదేశించాయి. వైద్యులు నివేదికల కోసం.. కోర్టు ఇచ్చిన సమయం దాటి మరీ టెస్టులు చేస్తున్నారు. నివేదికలు...

రేవంత్‌కు పోలీసులే అలా ప్రచారం చేసి పెడతారు..!

హైదరాబాద్‌లో రూ. ఐదు రూపాయల భోజన కేంద్రాలయిన అన్నపూర్ణ క్యాంటీన్లు కొనసాగుతాయని మీడియాకు సమాచారం ఇచ్చిన తెలంగాణ సర్కార్.. నిజానికి ఆపేసింది. దాంతో పేదలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. చాలా చోట్ల టీఆర్ఎస్...

HOT NEWS

[X] Close
[X] Close