మోడీ ఎడాపెడా అడిగేస్తున్న జగన్..!

టీకా ఉత్సవ్ అంటూ.. ఉత్సవాలు చేస్తున్నారు కానీ.. టీకాలు మాత్రం కావాల్సినన్ని పంపడం లేదని కేంద్రం వైఫల్యాన్ని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పక్కా ప్రణాళిక ప్రకారం ప్రజల ముందు పెడుతున్నారు. గత వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు టీకాల కోసం ఆయన నేరుగా ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఆ లేఖను మీడియాకు విడుదల చేసి టాం.. టాం చేశారు. ఈ లేఖలు కూడా.. కేంద్రం నుంచి టీకాల లోడు వస్తుందని తెలిసిన తర్వాతనే రాశారు. టీకా ఉత్సవ్ ప్రారంభసమయానికి ఏపీలో టీకా నిల్వలు అతి తక్కువ ఉన్నాయి. అప్పుడు.. సీఎం జగన్ టీకాలు కావాలని ప్రధాని మోడీకి లేఖ రాశారు. నిజానికి ఆ తర్వాతి రోజే.. ఆరున్నర లక్షల టీకాల డోసులు ఏపీకి పంపిస్తున్నట్లుగా కేంద్రం నుంచి ప్రభుత్వానికి సమాచారం ఉంది. అయినప్పటికీ.. జగన్ లేఖ రాశారు.

అలా వచ్చిన టీకాల్ని ఆంధ్రప్రదేశ్ అధికారులు ఒక్క రోజులో అందరికీ వేసేశారు. తాము రికార్డు స్థాయిలో ఒక్క రోజే ఆరున్నర లక్షల మంది టీకాలు ఇచ్చామని ప్రకటించుకున్నారు. కానీ తర్వాత మూడు రోజుల పాటు ఒక్క టీకా కూడా వేయలేకపోయారు. కారణం ఏ జిల్లాలోనూ టీకా స్టాక్ లేకపోవడమే. మళ్లీ ప్రభుత్వం శనివారం ఐదు లక్షల టీకాల డోసుల్ని పంపించబోతోందని అధికారికంగా కేంద్రం నుంచి సమాచారం వచ్చింది. ఇలా సమాచారం అందిన వెంటనే జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ప్రధాని మోడీకి లేఖ వెళ్లింది. కరోనా కట్టడికి గట్టి చర్యలు తీసుకుంటున్నామని.. టీకా ఉత్సవ్‌ను బాగా నిర్వహిస్తున్నామని.. కానీ టీకాల కొరత ఉందని.. వెంటనే పంపాలని ఆ లేఖ సారాంశం.

శనివారం ఐదు లక్షల డోస్‌లు వస్తాయని తెలిసి కూడా జగన్ రాజకీయం కోసం.. ప్రజల దృష్టిలో మరో రకమైన ప్రచారం జరగడం కోసమే రాశారని బీజేపీ నేతలు అనుమానించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిజానికి దేశవ్యాప్తంగా కరోనా టీకా కొరత ఉంది. అందుబాటులో ఉన్న రెండే టీకాలు కావడంతో.. వాటి ఉత్పత్తి పరిమితంగా ఉండటంతో… ఉత్పత్తి అయిన టీకా మొత్తాన్ని అవసరాన్ని బట్టి రాష్ట్రాల వారీగా సర్దుబాటు చేస్తున్నారు. అయినా జగన్ హడావుడిగా లేఖలు రాస్తూ.. టీకా లేకపోవడం తమ తప్పు కాదని..మోడీ తప్పన్నట్లుగా లేఖల ద్వారా ప్రచారం చేస్తున్నారని.. కొంత మంది బీజేపీ నేతలు అసంతృప్తికి గురవుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రమేష్ ఆస్పత్రికి రఘురామ..! హైకోర్టు ఆదేశాలనైనా పాటిస్తారా..?

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి అయినా రమేష్ ఆస్పత్రికి రఘురామకృష్ణరాజును తరలించకూడదనుకున్న సీఐడీ అధికారులు.. ప్రభుత్వానికి షాక్ తగిలింది. సీఐడీ కోర్టు ఆదేశించించినట్లుగానే.. రమేష్ ఆస్పత్రికి రఘురామకృష్ణరాజును తరలించాలని స్పష్టం చేసింది. గుంంటూరు ప్రభుత్వాసుపత్రిలో...

జైలుకు ఆర్ఆర్ఆర్.. కోర్టును లైట్ తీసుకున్న సీఐడీ..!

ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు కోర్టులను లెక్క చేయలేదు. ఎంపీ రఘురామకృష్ణరాజుకు వైద్యం అందించాలని ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టేసి.. జిల్లా జైలుకు తరలించేశారు. ఆయనకు వైద్యం అందించే విషయంలోనే కాదు.. వైద్య నివేదిక...

టీవీ9 ప్రాథమిక నివేదిక.. ఆర్ఆర్ఆర్‌కి సొరియాసిస్..!

రఘురామకృష్ణరాజు కాళ్లకు ఉన్న దెబ్బల గురించి టెస్టులు చేసి నివేదిక ఇవ్వాలని సీఐడీ కోర్టు.. హైకోర్టులు ఆదేశించాయి. వైద్యులు నివేదికల కోసం.. కోర్టు ఇచ్చిన సమయం దాటి మరీ టెస్టులు చేస్తున్నారు. నివేదికలు...

రేవంత్‌కు పోలీసులే అలా ప్రచారం చేసి పెడతారు..!

హైదరాబాద్‌లో రూ. ఐదు రూపాయల భోజన కేంద్రాలయిన అన్నపూర్ణ క్యాంటీన్లు కొనసాగుతాయని మీడియాకు సమాచారం ఇచ్చిన తెలంగాణ సర్కార్.. నిజానికి ఆపేసింది. దాంతో పేదలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. చాలా చోట్ల టీఆర్ఎస్...

HOT NEWS

[X] Close
[X] Close