కొర‌టాల ద‌గ్గ‌ర క‌థే లేదా?

త్రివిక్ర‌మ్ – ఎన్టీఆర్ సినిమా వాయిదా ప‌డ‌డంతో, ఎన్టీఆర్ – కొర‌టాల శివ సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చిన‌ట్టైంది. ఆఘ‌మేఘాల మీద‌… ఈ సినిమాకి సంబంధించిన ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. `ఆర్‌.ఆర్‌.ఆర్‌` త‌ర‌వాత‌.. ఎన్టీఆర్ – కొర‌టాల కాంబో ఫిక్స‌యిపోయింది. అయితే.. విచిత్రం ఏమిటంటే.. కొర‌టాల ద‌గ్గ‌ర ఎన్టీఆర్ కి సరిప‌డ క‌థే లేదిప్పుడు. దాన్ని వండాలి.

`ఆచార్య‌` త‌ర‌వాత‌… బ‌న్నీతో ఓసినిమా చేయాలి కొర‌టాల‌. ఆ సినిమాకి సంబంధించిన లైన్ ఎప్పుడో అనేసుకున్నారు కూడా. దానికి సంబంధించిన స్క్రిప్టు కూడా దాదాపుగా ఓ కొలిక్కి వ‌చ్చింది. అయితే దాన్ని ప‌క్క‌న పెట్టి, ఎన్టీఆర్ కోసం క‌థ అల్లుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. కొర‌టాల ద‌గ్గ‌ర `లైన్స్‌`కి కొద‌వ‌లేదు. బేసిగ్గా.. ఆయ‌న ఓ ర‌చ‌యిత‌. `నా ద‌గ్గ‌ర ప‌ది క‌థ‌లు సిద్ధంగా ఉన్నాయి` అని కొర‌టాల ఇది వ‌ర‌కే చెప్పారు. అందులో స‌గం తీసేశారు కూడా. కానీ మిగిలిన స‌గంలో ఎన్టీఆర్ కి సూట‌య్యే క‌థ లేదు. ఇప్పుడు ఎన్టీఆర్ కోసం.. వండి వార్చాలి. అయితే మ‌హేష్‌, ప్ర‌భాస్ ల కోసం కొన్ని లైన్లు కొర‌టాల సిద్ధం చేసుకున్నారు. వాటిలో ఒక‌దాన్ని ఎన్టీఆర్ కి సూటయ్యేలా మార్చుకోవాలి. కొర‌టాల‌కు అదేమంత క‌ష్ట‌మైన విష‌యం కాదు. కాక‌పోతే.. కేవ‌లం కొర‌టాల‌పై ఉన్న న‌మ్మ‌కం, ట్రాక్ రికార్డు కార‌ణంగా.. కొర‌టాల క‌థేం చెప్ప‌క‌పోయినా, ఈ ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడు ఎన్టీఆర్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

అవన్నీ వైసీపీ దింపుడు కళ్లెం ప్రయత్నాలే !

ఓటమి తప్పదని తెలిశాకా గెలవడానికి సిల్లీ ఆలోచనలు చేస్తూంటారు రాజకీయ నేతలు. వైసీపీ నేతలకు ఇలాంటివి కొన్ని ఎక్కువే వస్తూంటాయి. వాటిని అమలు చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా అంతే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close