ఎక్స్ క్లూజీవ్‌: చిరు దొంగ – ర‌వితేజ‌ పోలీస్‌!

చిరంజీవి – ర‌వితేజ‌ల‌ది అన్న‌ద‌మ్ముల అనుబంధం. చిరుని స్ఫూర్తిగా తీసుకొనే ర‌వితేజ సినిమాల్లోకి వ‌చ్చాడు. చిన్న చిన్న పాత్ర‌ల‌తో స్టార్ హీరోగా మారాడు. చిరు సినిమాల్లో ర‌వితేజ కూడా క‌నిపించాడు. అయితే స్టార్ గా మారాక‌… వీరిద్ద‌రూ చేస్తున్న తొలి సినిమా `వాల్తేరు వీర‌య్య‌`. ఈ సినిమాలో చిరు, ర‌వితేజ స‌వ‌తి సోద‌రులుగా క‌నిపించ‌నున్నార‌ని తెలుగు 360 ముందే చెప్పింది. ఇప్పుడు మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈసినిమాలో చిరు ఓ దొంగ గా… ర‌వితేజ ఓ పోలీస్ ఆఫీస‌ర్ గా క‌నిపించ‌నున్నారు. చిరుని ప‌ట్టుకోవ‌డానికి ర‌వితేజ వేసే ఎత్తుగ‌డ‌ల నేప‌థ్యంలోనే సినిమా సాగుతుంద‌ని స‌మాచారం. వీరిద్ద‌రి మ‌ధ్య గేమ్ టిట్ ఫ‌ర్ టాట్‌లా ఉంటుంద‌ని…. అదే ఈసినిమాకి ప్రాణ‌మ‌ని తెలుస్తోంది.

బాబి ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. చిరుని అభిమానులు ఎలా చూడాల‌ని కోరుకుంటున్నారో, అలానే.. ఈ సినిమాలో చూపించ‌బోతున్నాడ‌ట‌. ఇప్ప‌టికే కొన్ని యాక్ష‌న్ సీన్లు, ఎంట‌ర్‌టైన్‌మెంట్ సీన్లూ.. తీసేశాడు బాబి. ర‌ఫ్ క‌ట్ చూసిన చిరుకి… ఆ సీన్లు బాగా న‌చ్చేశాయ‌ని, ఇప్పుడు బాబికి మ‌రింత ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడ‌ని తెలుస్తోంది. దేవిశ్రీ ప్ర‌సాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఆయ‌న కూడా చిరు అన‌గానే చెల‌రేగిపోతాడు. ఇప్ప‌టికే నాలుగు మాస్ ట్యూన్లు రెడీ చేశాడ‌ని, ఆ పాట‌లు అభిమానుల‌కు విప‌రీతంగా న‌చ్చేస్తాయ‌ని తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close