నాగార్జున ‘డ్యూటీ’ చేసుంటే..?

రిలీజ్‌కి ముందు కాస్త పాజిటీవ్ బ‌జ్ తెచ్చుకొన్న `రామారావు ఆన్ డ్యూటీ` మొద‌టి రోజు, మొద‌టి షోకే చ‌తికిల ప‌డిపోయింది. ఈ సినిమాని డిజాస్ట‌ర్ అని రివ్యూలు తేల్చేశాయి. థియేట‌ర్ల బ‌య‌ట ఫ్యాన్స్ అయితే…`ఆ ద‌ర్శ‌కుడు ఎవ‌రో క‌నిపిస్తే కొడ‌తాం` అంటూ ఆవేశంగా రెచ్చిపోతున్నారు. ర‌వితేజ‌కు సూట‌య్యే క‌థ ఇది కాద‌న్న‌ది అంద‌రి మాట‌. నిజానికి ద‌ర్శ‌కుడు శ‌ర‌త్ మాండ‌వ మైండ్‌లో ఉన్న హీరో ర‌వితేజ కాదు… నాగార్జున‌. ఈ క‌థ‌ని ముందు వినిపించింది నాగ్‌కే.

నాగ్ కి ఈ క‌థ న‌చ్చింది. కాక‌పోతే… `నాకంటే కాస్త యంగ్ హీరో అయితే బాగుంటుంది. ఫ్లాష్ బ్యాక్ లో ల‌వ్ స్టోరీ ఎపిసోడ్ కి అది హెల్ప్ అవుతుంది` అని స‌ల‌హా ఇచ్చాడ‌ట‌. దాంతో నాగార్జున‌ని వ‌దిలి.. ర‌వితేజ‌ని ఎంచుకొన్నాడు. నిజానికి ర‌వితేజ నుంచి ఆశించే ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఈ సినిమాలో బొత్తిగా లేదు. ఇలాంటి సీరియ‌స్ డ్రామాలో ర‌వితేజ‌ని చూడ‌లేక‌పోయారు జ‌నాలు. నిజానికి నాగ్ చేసుంటే.. కాస్తో కూస్తో బెట‌ర్ రిజ‌ల్ట్ వ‌చ్చేదేమో,..? ర‌వితేజ కెరీర్‌లో మ‌రో అట్ట‌ర్ ఫ్లాప్ రాసుంటే ఎవ‌రు మాత్రం ఏం చేయ‌గ‌ల‌రు?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

లక్ష్మిపార్వతి అంత ధైర్యం కొడాలి నానికి లేదా !?

ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీకి యుగపురుషుడి పేరు తీసేయడంపై మెల్లగా వైసీపీలో ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా ముసుగు తీసేస్తున్నారు. సమర్థిస్తూ ఒకరి తర్వాత ఒకరు మీడియా ముందుకువచ్చి మాట్లాడుతున్నారు. పెద్ద...

మహేష్ బాబు ఇంటిలో చోరికి యత్నం

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో చోరికి ప్రయత్నించాడు ఓ దొంగ. ఓ అగంతకుడు మహేష్ బాబు ఇంటి గోడ దూకి లోపలికి వచ్చాడు. మంగళవారం రాత్రి సమయంలో లో చోరీ ప్రయత్నం...

స్వాతిముత్యం పై త్రివిక్రమ్ స్టాంప్

హారిక హాసిని క్రియేషన్స్, సితార ఎంటర్‏టైన్మెంట్స్ త్రివిక్రమ్ శ్రీనివాస్ హోమ్ బ్యానర్లు. కేవలం త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాలు చేయడానికే హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ ని కేటాయించారు నిర్మాత చినబాబు. ఇక సితారలో...

4 నెలల్లో ఆదాయం రూ.45వేల కోట్లు..ఖర్చు రూ.86వేల కోట్లు !

మనకు జీతం పదివేలు వస్తే.. క్రెడిట్ కార్డులు ఉన్నాయి కదా అని రూ. ఇరవై వేలు ఖర్చు పెట్టేస్తే ఏమవుతుంది ? ఖర్చు పెట్టినప్పుడు బాగానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే క్రిడెట్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close