మ‌హేష్ – ప‌ర‌శురామ్.. పాయింట్ ఇదే ?

బ్యాంకుల‌కు టోక‌రా కొట్టి, కోట్ల‌కు కోట్లు రుణాలు ఎగ్గొట్టిన ఘ‌రానా మోస‌గాళ్లు చాలామందే ఉన్నారు. అలాంటి పెద్ద పెద్ద త‌ల‌కాయ‌ల్లో విజ‌య్ మాల్యా ఒక‌డు. బ్యాంకు రుణాలు… అన‌గానే గుర్తొచ్చే పేర్ల‌లో విజ‌య్ మాల్యా మొద‌టి వ‌రుస‌లో ఉంటుంది. విజ‌య్ మాల్యాలా బ్యాంకుల్ని ద‌ర్జాగా లూఠీ చేసిన వైట్ కాల‌ర్ నేర‌గాళ్ల నేప‌థ్యంలో ఓ సినిమా వ‌స్తే ఎలా ఉంటుంది? మ‌హేష్ బాబు సినిమా ఇదే పాయింట్‌తో న‌డ‌వ‌బోతోంద‌ని స‌మాచారం.

మ‌హేష్ బాబు – ప‌ర‌శురామ్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రాబోతోంది. ఈ సినిమా క‌థ‌… ఇలా బ్యాంకుల‌కు టోక‌రా వేసిన మోస‌గాళ్ల నేప‌థ్యంలో సాగుతుంద‌ని స‌మాచారం. దాంట్లో ఓ అంమైన ల‌వ్ స్టోరీ మేళ‌వించి, క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ జోడించి, మ‌హేష్ బాబు ఇమేజ్‌కి త‌గ్గ‌ట్టుగా తీర్చిదిద్ద‌బోతున్నాడు ప‌రశురామ్‌. త్వ‌ర‌లోనే ఈ సినిమా లాంఛ‌నంగా ప్రారంభం కాబోతోంది. షూటింగ్ మాత్రం ఆగ‌స్టులో ఉంటుంది. 2020 చివ‌ర్లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మళ్లీ బడ్జెట్ తగ్గించేస్తున్న కేసీఆర్..!

తెలంగాణ రాష్ట్ర పద్దును సీఎం కేసీఆర్ మళ్లీ తగ్గిస్తున్నారు. ఈ సారి కరోనా కారణం. గత ఆర్థిక సంవత్సరంలోనూ బడ్జెట్‌ను కేసీఆర్ భారీగా తగ్గించారు. ఆర్థిక మాంద్యం కారణంగా ఆదాయం తగ్గిపోయిందని...

ఏపీ మార్క్ : ఆ గుంతల రోడ్లకే టోల్ ఫీజులు.. ఫైన్లు కూడా..!

ఆంధ్రప్రదేశ్‌లో రోడ్లు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. గత ఏడాదిన్నర నుంచి నిర్వహణ లేకపోవడంతో... రోడ్లన్నీ గుంతల మయం అయిపోయాయి. సోషల్ మీడియాలో ఆ రోడ్ల సౌందర్యం హల్ చల్ చేస్తున్నాయి. అదే...

రెండే ఆప్షన్స్ : పోలవరంపై పోరాటమా..? రాజీ పడటమా..?

విభజనతో సర్వం కోల్పోయిన ఆంధ్రప్రదేశ్‌కు విభజన చట్టంలో ఇచ్చిన ఒకే ఒక్క రియలిస్టిక్ హామీ పోలవరం. జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి.. ప్రతీ పైసా భరిస్తామని చట్టంలో పెట్టారు. కానీ ప్రత్యేకహోదాను ఎలా చేశారో.....

పాపం ఏపీ ఉద్యోగులు..! పండగకు డీఏల్లేవ్.. జీతం బకాయిల్లేవ్..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందన్నట్లుగా మారింది. ఆరున్నరేళ్ల కిందట.. రాష్ట్రం విడిపోయిన కొత్తలో.. కష్టాలున్నా.. చంద్రబాబు 44 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ ఇచ్చారు. ఆ తర్వాత...

HOT NEWS

[X] Close
[X] Close