ఎక్స్‌క్లూజీవ్‌: ‘ప్రాజెక్ట్ కె’… ఓ యుగాంతం క‌థ‌!

అప్పుడెప్పుడో… 2012 అనే ఓ హాలీవుడ్ సినిమా వ‌చ్చింది. యుగాంతానికి సంబంధించిన ఫిక్ష‌న‌ల్ స్టోరీ అది. ఈ ప్ర‌పంచం అంత‌మైపోతే.. ఎలా ఉంటుంది? అస‌లు ఏమ‌వుతుంది? అనే పాయింట్ తో న‌డిచిన క‌థ‌. అప్ప‌ట్లో యుగాంతం గురించి కూడా మీడియాలో ర‌క‌ర‌కాల క‌థ‌నాలు వ‌చ్చాయి. వాటి స్ఫూర్తితో రాసుకొన్న క‌థ అది. అయితే ఆ త‌ర‌వాత ఎవ‌రూ యుగాంతం క‌థ ని ముట్టుకోలేదు.

అయితే ప్రాజెక్ట్ కె క‌థ యుగాంతానికి సంబంధించింద‌న్న‌ది ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌. ఈ సినిమా టైమ్ ట్రావెల్ చుట్టూ తిరుగుతుంద‌ని ఇది వ‌ర‌కు ఊహాగానాలు వ‌చ్చాయి. అయితే వాటిలో ఎలాంటి నిజం లేద‌ని టీమ్ క్లారిటీ ఇచ్చింది. సో.. యుగాంతం విష‌యంలో ఎంత వ‌ర‌కూ నిజం ఉందో.. తెలియాలంటే టీమ్‌లో ఎవ‌రో ఒక‌రు నోరు విప్పాలి. ప్రాజెక్ట్ కె లో `కె` అంటే క‌ల్కి. క‌లియుగం కల్కి అవ‌తారంతోనే అంతం అవుతుంది. ప్ర‌భాస్ పాత్ర క‌ల్కిని పోలి ఉంటుంది. అయితే.. పురాణాల ట‌చ్ ఎక్క‌డా ఉండ‌దు. అండ‌ర్ క‌రెంట్‌లో ఆ పాత్ర‌లు తెర‌పై క‌నిపిస్తాయి అంతే. పాత్ర‌లూ, వాటికి పెట్టిన పేర్లు.. సంద‌ర్భాలూ అన్నీ.. పురాణాల‌తో అనుసంధానంగా ఉండ‌బోతున్నాయి. అయితే ఎక్క‌డా నేరుగా వాటి ప్ర‌స్తావ‌న ఉండ‌దు. అలా.. ఈ క‌థ‌ని నాగ అశ్విన్ డిజైన్ చేసుకొన్నాడ‌ని తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా?

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని సర్కార్ ప్రకటించినా... వాలంటీర్లలో అనుమానాలు ఇంకా అలాగే ఉన్నాయి. జులై మొదటి తేదీన సచివాలయం సిబ్బందితో ఫించన్ లు పంపిణీ చేసిన కూటమి ప్రభుత్వం.. వాలంటీర్ల అవసరం...

జ‌గ‌న్ కు ష‌ర్మిల సూటి ప్ర‌శ్న‌లు… జ‌వాబు చెప్పే ద‌మ్ముందా?

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై ఆయ‌న చెల్లి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో వైసీపీ చేసిన ధ‌ర్నా, అక్క‌డ జ‌గ‌న్ చేసిన...

ట్రంప్‌కు అంత ఈజీ కాదు !

అమెరికా అధ్యక్ష రేసులో ముందున్నానని ఆశల్లో తేలిపోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు గడ్డు పరిస్థితి ఎదురొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. డెమెక్రాట్ల అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఖరారు కావడంతో...

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

HOT NEWS

css.php
[X] Close
[X] Close