ఎగ్జిట్ పోల్స్ షాక్..! విపక్షాల భేటీ ఫలితాలే తర్వాతే..!

బీజేపీని గద్దె దింపడానికి ఎలాంటి అవకాశం వచ్చినా.. వదిలి పెట్టకూడదన్న ప్రయత్నాల్లో ఉన్న.. బీజేపీయేతర పార్టీలకు ఎగ్జిట్ పోల్స్ ఒక షాకే. కానీ ఆ పార్టీలేమీ నమ్మడం లేదు. అయితే.. తొందరపాటు ఎందుకన్న పద్దతిలో.. ఫలితాల తర్వాతే సమావేశం అవుదామన్న ఆలోచనలో పడ్డాయి.

ఫలితాలను ఇస్తున్న చంద్రబాబు చర్చలు..!

బీజేపీయేతర పార్టీలను ఏకం చేసే.. ప్రయత్నాలను చంద్రబాబు మరింత ముమ్మరం చేశారు. కాంగ్రెస్‌ వైపు నుంచి చూపాల్సిన చొరవపై.. 23న ఫలితాలకు ముందే క్లారిటీకి రావాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌కు అనుకూలంగా ప్రాంతీయ పార్టీలను ఏకం చేయడంలో.. చంద్రబాబు మార్క్ రాజకీయం సత్ఫలితాలు ఇస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ కాంగ్రెస్ తో పాటు కూటమి కట్టడానికి వెనుకడుగు వేస్తున్న పార్టీలు.. ఇప్పుడు మెత్తబడినట్లు ప్రచారం జరుగుతోంది.

కూటమి భేటీకి వచ్చేందుకు మాయావతి సంసిద్ధత..!

శనివారం లక్నో వెళ్లి మాయావతి, అఖిలేష్‌లతో భేటీ అయిన చంద్రబాబు భేటీకి వచ్చే విషయంపై చర్చలు జరిపారు. ఆ చర్చల వివరాలను ఆదివారం ఉదయం రాహుల్ గాంధీ, శరద్ పవార్‌లకు చంద్రబాబు వివరించారు. విపక్షాల కూటమి భేటీకి.. కాస్త తగ్గి అయినా ఉండటానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, మమతా బెనర్జీలు విపక్షాల కూటమి భేటీకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రధానమంత్రి పదవి విషయంలో అన్ని పార్టీలు.. ఏకాభిప్రాయానికి రావడానికి చంద్రబాబు ఓ ఫార్ములా ప్రతిపాదించారని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి 140కిపైగా సీట్లు వస్తే ఆ పార్టీకి.. లేకపోతే.. ప్రాంతీయ పార్టీల నుంచి ఓ అభ్యర్థికి మద్దతివ్వాలన్న ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తోంది.

త్యాగాలు చేయడానికి కాంగ్రెస్ రెడీ..!

విపక్ష పార్టీల ఆలోచనలు, అభిప్రాయాలను వివరించేందుకు చంద్రబాబు సోనియాగాంధీతో సమావేశమయ్యారు. సోనియాతో చంద్రబాబు భేటీ ఇదే తొలి సారి. విపక్ష పార్టీలతో చర్చల వివరాలను.. చంద్రబాబు… సోనియా గాంధీకి వివరించారు. బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పడుతుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. 21 లేదా 22న ఎన్డీయేతర పక్షాల సమావేశం ఉంటుందని ప్రాధమికంగా నిర్ణయించారు. అయితే ఎగ్జిట్ పోల్స్ నిరాశజనకంగా ఉండటంతో… ఇప్పుడు మనసు మార్చుకునే అవకాశం ఉంది. ఫలితాలు అనుకూలంగా వస్తే 23న సమావేశం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కచ్చితంగా.. హంగ్ పార్లమెంట్ వస్తుంది.. బీజేపీయేతర పార్టీలే కీలక పాత్ర పోషిస్తాయని.. నమ్ముతున్న చంద్రబాబు…. పార్టీలతో మరితం విస్తృతంగా సంప్రదింపులు జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

స‌మంత భ‌య‌పెట్టేస్తోంది

క‌థానాయిక‌ల పారితోషికంపై ఎప్పుడూ ఎడ‌తెగ‌ని చ‌ర్చ జ‌రుగుతూనే ఉంటుంది. స్టార్ హోదా వ‌చ్చిన క‌థానాయిక‌లు ఎప్ప‌టి క‌ప్పుడు త‌మ రేట్ల‌ని పెంచుకొంటూ పోతుంటారు. డిమాండ్ - అండ్ స‌ప్లై సూత్రం ప్ర‌కారం నిర్మాత‌లూ...

ఎన్డీఏ కూటమికి మందకృష్ణ సపోర్ట్ !

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపింది. ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేశారు. చంద్రబాబు హయాంలో మాదిగలకు మేలు...

ప్ర‌శాంత్ వ‌ర్మ‌.. ‘లేడీస్ స్పెష‌ల్’

ముందు నుంచీ... విభిన్న‌మైన దారినే వెళ్తున్నాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. త‌ను ఎంచుకొనే ప్ర‌తీ క‌థా... తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఓవ‌ కొత్త జోన‌ర్ ని ప‌రిచ‌యం చేసింది. 'హ‌నుమాన్' తో పాన్ ఇండియా క్రేజ్...

రేపే చ‌ర‌ణ్ సినిమాకు కొబ్బ‌రికాయ్‌!

ఎట్ట‌కేల‌కు రామ్ చ‌ర‌ణ్ - బుచ్చిబాబు సినిమా పట్టాలెక్క‌బోతోంది. రేపు అంటే.. బుధ‌వారం హైద‌రాబాద్ లో ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభించ‌నున్నారు. ఈ ముహూర్తం వేడుక‌కు చిత్ర‌బృందంతో పాటు కొంత‌మంది ప్ర‌త్యేక అతిథులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close