బాల‌య్య‌.. వ‌ర‌ల‌క్ష్మి.. ‘పిండేశారంతే’

ఈ సంక్రాంతికి బాక్సాఫీసు ముందుకు రాబోతున్న సినిమాల్లో ‘వీర సింహారెడ్డి’ ఒక‌టి. ఇప్ప‌టి వ‌ర‌కూ వ‌చ్చిన పాట‌లూ, టీజ‌ర్లు, పోస్ట‌ర్లు చూసి ఇదో మాస్ సినిమా అని ఫిక్స‌యిపోయారు జ‌నాలు. పైకి అలానే క‌నిపిస్తున్నా.. లోప‌ల మాత్రం సెంటిమెంట్ గ‌ట్టిగా ద‌ట్టించార‌ని టాక్‌. ముఖ్యంగా వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్‌, బాల‌య్య మధ్య వ‌చ్చే సెంటింమెంట్ సీన్లు కంటిత‌డి పెట్టించేలా ఉన్నాయ‌ని ఇన్ సైడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. అఖండ ఎంత మాస్ సినిమా అయినా… అందులోనూ ఎమోష‌న్‌ని గ‌ట్టిగా ద‌ట్టించాడు బోయ‌పాటి. సేమ్ అదే ఫార్మెట్‌లో ఈ క‌థ సాగ‌బోతోంద‌ని తెలుస్తోంది. సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్ థియేట‌ర్ల‌కు వ‌స్తారు. వాళ్ల‌ని మెప్పించేలా… కొన్ని ఎపిసోడ్ల‌ని రూపొందించార‌ని, బాల‌య్య త‌ర‌వాత ఈ సినిమాలో అంతటి వెయిటేజ్ ఉన్న పాత్ర‌ వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ ద‌ని స‌మాచారం. అయితే… వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ పాత్ర‌లో ఓ ట్విస్టు రాబోతోంది. ఆ ట్విస్ట్ ని ప్రేక్ష‌కులు ఎలా రిసీవ్ చేసుకొంటారో అనే కొద్దిపాటి టెన్ష‌న్ చిత్ర బృందంలో ఉంది. మ‌రోవైపు… ఈ సినిమాకి పోటీగా దిగుతున్న ‘వాల్తేరు వీర‌య్య‌’ పూర్తి స్థాయి ఎంట‌ర్టైన‌ర్‌గా రూపుదిద్దుకొంది. ముఖ్యంగా సెకండాఫ్‌లో చిరు, ర‌వితేజ మ‌ధ్య వ‌చ్చే సీన్లు ఓ లెవిల్‌లో ఉన్నాయ‌ట‌. ‘వాల్తేరు వీర‌య్య‌’ థీమ్ సాంగ్‌, పూన‌కాలు పాట‌కు థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్ల‌డం ఖాయ‌మ‌ని ఇన్ సైడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. మొత్తానికైతే రెండు సినిమాల్లోనూ కావ‌ల్సినంత స్ట‌ఫ్ క‌నిపిస్తోంది. ఈసారి సంక్రాంతి పండ‌గ సంబ‌రాలు డ‌బుల్ అయ్యే అవ‌కాశాలే ఎక్కువ‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close