తెలంగాణ గడ్డపై నుంచే కేసీఆర్‌కు బీఎల్ సంతోష్ హెచ్చరిక !

తప్పుడు ఆరోపణలు చేసిన వారు పర్యవసానాలు అనుభవించాల్సిందేనని కేసీఆర్‌కు బీజేపీ కీలక నేత బీఎల్ సంతోష్ హెచ్చరికలు జారీ చేశారు. పార్టీ విస్తారక్‌లకు ట్రైనింగ్ ఇచ్చేందుకు హైదరాబాద్ వచ్చిన ఆయన తన ప్రసంగంలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసును పరోక్షంగా ప్రస్తావించారు. తనపై చేసినవన్నీ తప్పుడు ఆరోపణలేనని.. వీటికి ఖచ్చితంగా అనుభవించాల్సిందేనని స్పష్టం చేశారు. తన పేరు తెలంగాణలో ఒక్కరికీ తెలియదని..కానీ ఫామ్ హౌస్ కేసు పేరుతో తప్పుడు ఆరోపణలు చేసి అందరికీ తెలిసేలా చేశారన్నరు. తనపై చేసిన ఆరోపణలకు ప్రభుత్వమే సమధానం చెప్పాలన్నారు.

బీఎల్ సంతోష్ హెచ్చరికను బీఆర్ఎస్ తేలికగా తీసుకోలేదు. కేసీఆర్ కూడా తేలికగా తీసుకోలేరు. ఎందుకంటే.. బీజేపీలో అత్యంత పవర్ ఫుల్ వ్యక్తుల్లో బీఎల్ సంతోష్ ఒకరు. ఆయన పూర్తిగా పార్టీ కోసమే పని చేస్తూంటారు. ఆయనను నేరుగా కేసీఆర్ టార్గెట్ చేశారు. సిట్ ద్వారా నోటీసులు జారీ చేయించి.. అరెస్ట్ చేసే ప్రయత్నం కూడా చేశారు. ఇది కేంద్ర ప్రభుత్వ పెద్దలకూ ఆగ్రహం తెప్పించిందని చెబుతున్నారు. ఈ క్రమంలో ఫామ్ హౌస్ కేసులో ఈడీ రంగంలోకి దిగింది.. వెంటనే హైకోర్టు ద్వారా కేసు సీబీఐకి వెళ్లింది. అంటే ఇప్పుడు కేసీఆర్ చేతిలో ఉన్న ఆయుధం సీబీఐకి వెళ్లింది.

ఇప్పుడు సీబీఐ ఈ కేసును ఎలాంటి మలుపులు తిప్పాలనుకున్నా తిప్పుగలుగుతుందన్న విషయం రాజకీయవర్గాలకు తెలుసు. ఈ క్రమంలో బీఎల్ సంతోష్ చేసిన హెచ్చరికలుు బీఆర్ఎస్‌లో ప్రకంపనలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఒక్క ఫామ్ హౌస్ కేసే కాదు.. ఢిల్లీ లిక్కర్ స్కాంతో పాటు రోహిత్ రెడ్డి ఆస్తుల వ్యవహారాలు కూడా ఇప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థల చేతుల్లో ఉన్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలకు మరింతగా చిక్కులు పెరిగే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close