దిల్‌రాజుకి ‘అమేజాన్’ దెబ్బ‌

ఈ సంక్రాంతి విజేత‌గా నిలిచిన సినిమా `ఎఫ్ 2`. భీక‌ర‌మైన పోటీ మ‌ధ్య నిలిచి, గెలిచి… సూప‌ర్ హిట్ అనిపించుకుంది. ఈ సినిమా విడుద‌లై 25 రోజులైనా.. ఇంకా వ‌సూళ్లు ఏమాత్రం త‌గ్గ‌లేదు. ఫిబ్ర‌వ‌రిలో కొత్త సినిమాల తాకిడి త‌క్కువ‌గానే ఉంది. సినిమాలొస్తున్నా, వాటిపై ప్ర‌త్యేక‌మైన క్రేజ్ లేదు. ఈ నేప‌థ్యంలో `ఎఫ్ 2` మ‌రిన్ని రోజులు త‌న హవా చూపించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. అయితే.. ఇప్పుడు ఈ వ‌సూళ్ల‌కు అమేజాన్ గండి కొట్ట‌బోతోంది. ఈ సినిమాని విడుద‌ల‌కు ముందే అమేజాన్ ప్రైమ్‌కి అమ్మేశారు దిల్‌రాజు. ముంద‌స్తు ఒప్పందం ప్ర‌కారం.. సినిమా విడుద‌లైన 30 రోజుల త‌ర‌వాత ఎప్పుడైనా అమేజాన్‌లో ప్ర‌ద‌ర్శించుకోవొచ్చు. ఎఫ్ 2 సూప‌ర్ హిట్ సినిమా. ఈ సినిమా అమేజాన్‌లో పెడితే…. వ్యూస్ అద్భుతంగా ఉండ‌డం ఖాయం. అందుకే అమేజాన్ ఏమాత్రం ఆల‌స్యం చేయ‌డం లేదు. ఈనెల 11నే ఈ చిత్రాన్ని అమేజాన్‌లో ఉంచ‌బోతోంది. లాప్ టాప్‌లోనూ, సెల్ ఫోన్ల‌లోనూ హెచ్ డీ ప్రింటు ద‌ర్శ‌న‌మివ్వ‌బోతోంది. ఇక థియేట‌ర్ల‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం లేదు. `ఎఫ్ 2` జోరు బాక్సాఫీసు ద‌గ్గ‌ర త‌గ్గ‌క ముందే… ఇప్పుడు అమేజాన్లోకి వ‌చ్చేస్తోందీ సినిమా. ఓ ర‌కంగా.. దిల్‌రాజుకి ఇది బ్యాడ్ న్యూసే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పాల్ గారి పార్టీ టిక్కెట్ కోసం రూ. 50 లక్షలు ఇచ్చాడట !

సమాజంలో కొన్ని వింతలు జరగుతూ ఉంటాయి. నమ్మాలా వద్దో తేల్చుకోలేము. కేఏ పాల్ ఎల్బీ నగర్ టిక్కెట్ ఇస్తానంటే రూ. 50 లక్షలు పాల్ కు ఇచ్చేశాడట. చివరికి పాల్ టిక్కెట్ ఇవ్వలేదని...

“ఈ ఆఫీస్” భద్రం – స్పందించిన ఈసీ

ఏపీ ప్రభుత్వం జీవోలను అన్నీ దాచిన ఈ ఆఫీస్ ను అప్ గ్రేడేషన్ పేరతో సమూలంగా మాల్చాలనుకున్న ఏపీ ప్రభుత్వానికి ఈసీ చెక్ పెట్టింది. ఈ ఆఫీస్ అప్ గ్రేడేషన్ పేరుతో...

విజయ్ సేతుపతి నుంచి ఓ వెరైటీ సినిమా

హీరోగానే కాకుండా ప్రతి నాయకుడిగానూ కనిపించి ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్న విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి. హీరోయిజం లెక్కలు వేసుకోకుండా పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ ఆయన ప్రయాణం సాగుతోంది. ఇదే ఆయన్ని...

చంద్రముఖి కన్నా ఘోరం… ఆర్ఎస్పీ పై సోషల్ మీడియా ఫైర్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తీహార్ జైల్లోనున్న ఎమ్మెల్సీ కవితను కలిసిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close