ట్రైల‌ర్ టాక్‌: ఫ్యామిలీమెన్ టూ మెంట‌ల్ మెన్‌

విజ‌య్ దేవ‌ర‌కొండ అంటే ఎగ్రెసివ్‌నెస్ గుర్తొస్తుంది. అర్జున్ రెడ్డి నుంచి అది అల‌వాటైపోయింది. అయితే… త‌న‌లో కూల్ & కామ్ పెర్‌ఫార్మ‌ర్ ఉన్నాడు. దాన్ని బ‌య‌ట‌కు లాగే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు ప‌ర‌శురామ్. ‘ఫ్యామిలీస్టార్‌’ సినిమాతో. దిల్ రాజు బ్యాన‌ర్ నుంచి వ‌స్తున్న సినిమా ఇది. ‘ఫ్యామిలీ స్టార్’ టైటిల్ ని బ‌ట్టే, ఈ సినిమాలోని క‌థ‌, క‌థ‌నాలు, హీరో క్యారెక్ట‌రైజేష‌న్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవొచ్చు. కుటుంబాన్ని అమితంగా ప్రేమించే ప‌ద్ధ‌తైన కుర్రాడు ప్రేమ‌లో ప‌డితే ఎలా ఉంటుందో చూపిస్తున్నారిందులో. ఇది వ‌ర‌కు విడుద‌లైన టీజ‌ర్‌లో ‘ఫ్యామిలీమెన్’ క‌నిపిస్తే, ఈసారి ‘మెంట‌ల్‌మెన్‌’ కూడా ద‌ర్శ‌న మిచ్చాడు. ‘ఫ్యామిలీ స్టార్‌’ సినిమాలో హీరోకుండే మ‌రో యాంగిల్ ఇది. 2 నిమిషాల 24 సెక‌న్ల పాటు సాగే ఈ ట్రైల‌ర్‌… ఆద్యంతం అన్ని వ‌ర్గాల వాళ్ల‌నీ ఆక‌ట్టుకొనేలా సాగింది.

”స్వామి నువ్వు నాకు కొత్త‌గా లైఫులో బ్రేకులేం ఇవ్వాల్సిన ప‌నిలేదు ఉన్న‌దాన్ని మాత్రం చెడ‌గొట్ట‌కు” – అంటూ విజ‌య్ దేవ‌ర‌కొండ దేవుడికి దండం పెట్టుకోవ‌డంతో ట్రైల‌ర్ మొద‌లైంది. లుంగీ, బ‌నీన్ గెట‌ప్పులో.. విజ‌య్ కామ‌న్ మెన్‌కు కేరాఫ్ అడ్ర‌స్స్ లా నిలిచాడు. ”లిఫ్టుంది క‌దా అని ఎక్కేసి, సిగ‌రెట్లు ఉన్నాయి క‌దా అని కాల్చేసి, మందుంది క‌దా అని తాగేస్తే..” అనే డైలాగ్ దగ్గ‌ర ప‌ర‌శురామ్ మార్క్ క‌నిపించింది. హీరోయిన్ క్యారెక్ట‌ర్‌ని కూడా చాలా క్యూట్ గా డిజైన్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ప‌ర‌శురామ్ ల‌వ్ స్టోరీలు బాగుంటాయి. ఈ సినిమాలో ల‌వ్ ట్రాక్ కోసం డిఫ‌రెంట్ పంధాని ఎంచుకొన్నారు. తెర‌పై విజ‌య్‌, మృణాల్ మ‌ధ్య కెమిస్ట్రీ బాగా పండింది. ట్రైల‌ర్‌లోని రెండో భాగంలో విజ‌య్‌లోని ఎగ్రెసీవ్ నెస్ క‌నిపించింది. ‘మెంట‌ల్ నా కొడ‌కా’ అని హీరోయిన్ చేతే తిట్టించారంటే, అది ఏ స్థాయిలోకి వెళ్లిందో అర్థం చేసుకోవొచ్చు. జ‌గ‌ప‌తి బాబు పాత్ర స‌ర్‌ప్రైజింగ్ ట‌ర్న్ ఇవ్వ‌బోతోంది ఈ సినిమాలో. బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌, కెమెరా వ‌ర్క్ అన్నీ డీసెంట్ గా క‌నిపిస్తున్నాయి. ఫ్యామిలీ అంతా క‌లిసి చూసేలా ఈ సినిమాని తీర్చిదిద్దారు. ఈ వేస‌వి స‌కుటుంబ స‌ప‌రివార స‌మేతంగా థియేట‌ర్ల‌కు వెళ్ల‌డానికి ‘ఫ్యామిలీ స్టార్‌’ మంచి ఆప్ష‌న్‌గానే క‌నిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

2 COMMENTS

Comments are closed.