ప‌వ‌న్ లుక్‌… షాక్ లో ఫ్యాన్స్‌

హైద‌రాబాద్ వ‌ర‌ద బాధితుల‌కు స‌హాయంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ కోటి రూపాయ‌ల విరాళం అందించిన సంగ‌తి తెలిసిందే. ఇందుకు సంబంధించి ప‌వ‌న్ ఓ సెల్పీ వీడియోని కూడా విడుదల చేశాడు. ఆప‌ద కాల స‌మ‌యంలో ప‌వ‌న్ ఇలా ఆదుకోవ‌డం కొత్తేంకాదు. ప‌వ‌న్ దాన గుణం చూసి మ‌రిసిపోయిన అభిమానులు… ఈ వీడియోలో ప‌వ‌న్ అవ‌తారాన్ని చూసి మ‌రికాస్త షాక్ లోకి వెళ్లిపోయారు.

కార‌ణం.. ఎప్ప‌టిలానే గుబురు గ‌డ్డంతో, ఒత్తైన జుత్తుతో ప‌వ‌న్ క‌నిపించ‌డ‌మే. ఈనెల 25 నుంచి `వ‌కీల్ సాబ్‌` షూటింగ్ మొద‌లువుతుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ షెడ్యూల్ లో ప‌వ‌న్ కూడా క‌నిపిస్తాడ‌ని చెప్పుకుంటున్నారు. అంటే.. ఇంకా నాలుగు రోజుల స‌మ‌యం కూడా లేదు. అయినా ప‌వ‌న్ గెట‌ప్ లో ఏమాత్రం మార్పు లేదు. ప‌వ‌న్ ని చూస్తుంటే షూటింగుల‌పై ఇంకా మూడ్ రాన‌ట్టే క‌నిపిస్తోంది. లాక్ డౌన్ తర‌వాత ప‌వ‌న్ సెట్లోకి అడుగుపెట్ట‌లేదు. లాక్ డౌన్‌కి ముందు ప‌వ‌న్ వేరు. ఇప్పుడు ప‌వ‌న్ వేరు. కాస్త ఒళ్లు చేశాడు. గెడ్డం గెట‌ప్ లో `బాబా`లా క‌నిపిస్తున్నాడు త‌ప్ప‌, హీరోగా కాదు. మ‌రి ప‌వ‌న్ సినిమా లుక్ లోకి ఎప్పుడు మార‌తాడు? అనే సందేహం అంద‌రిలోనూ వ్య‌క్తం అవుతోంది. అనుకున్న‌ట్టే ఈ వారంలో షూటింగ్ మొద‌ల‌వుతుందా? మొద‌లైనా ప‌వ‌న్ వ‌స్తాడా? వ‌చ్చినా ఈ సినిమాకి స‌రిప‌డా ఫిజిక్‌, లుక్‌లోకి మార‌గ‌ల‌డా? ఇలా ఎన్నో సందేహాలు. వీటిని ప‌టాపంచ‌లు చేయాల్సిన బాధ్య‌త `వ‌కీల్ సాబ్` టీమ్ దే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అదానీకి మధురవాడలో 130 ఎకరాలు..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖలో అదానీ ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ పార్కు ఏర్పాటుకు భారీ ప్రోత్సాహకాలు ప్రకటించింది. పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సిఫార్సుల మేరకు డేటా సెంటర్ పార్కు, ఐటీ బిజినెస్ పార్కు, నైపుణ్యాభివృద్ధి...

కేసీఆర్ అంతకన్నా ఎక్కువే అన్నారుగా..! అప్పుడు కోపం రాలేదా..!?

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు .. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులకు క్షమాపణలు చెప్పారు. వైఎస్ కుటుంబాన్ని తాను కించపర్చలేదని.. తన మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చారు. ఇంతకీ...

తిరుపతి సీటు కోసం ఢిల్లీకి పవన్, నాదెండ్ల ..!

బీజేపీకి మద్దతుగా గ్రేటర్ ఎన్నికల బరి నుంచి వైదొలిగిన పవన్ కల్యాణ్ హుటాహుటిన ఢిల్లీ వెళ్తున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో పాటు పలువురు సీనియర్ నేతలతో చర్చలు జరిపేందుకు నాదెండ్ల మనోహర్‌తో...

గుడ్ న్యూస్‌: థియేట‌ర్ల‌కు గ్రీన్ సిగ్న‌ల్

థియేట‌ర్లు తెర‌చుకోవ‌డానికి అనుమ‌తులు ఇస్తూ.. తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ఈరోజు ఓ జీవోని విడుద‌ల చేసింది. అయితే కొన్ని ష‌ర‌తులు విధించింది. సిట్టింగ్ సామ‌ర్థ్యాన్ని 50 శాతానికి ప‌రిమితం చేసింది. ప్ర‌తి ప్రేక్ష‌కుడూ.....

HOT NEWS

[X] Close
[X] Close