‘రాధే శ్యామ్‌’లో కొత్త ట్విస్టు

ప్ర‌భాస్ కథానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం `రాధే శ్యామ్‌`. పూజా హెగ్డే క‌థానాయిక‌. రాధాకృష్ణ ద‌ర్శ‌కుడు. యూవీ క్రియేష‌న్స్ నిర్మిస్తోంది. ఈనెల 23న ప్ర‌భాస్ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా `రాధేశ్యామ్‌` నుంచి అడ్వాన్స్ బ‌ర్త్ డే గిఫ్ట్ వ‌చ్చేసింది. ఈసినిమాలోని ప్ర‌భాస్ క్యారెక్ట‌ర్‌ని ప‌రిచ‌యం చేస్తూ.. చిత్ర‌బృందం ఓ పోస్ట‌ర్ వ‌దిలింది. ఈ సినిమాలో ప్ర‌భాస్ పేరు విక్ర‌మాదిత్య‌.

నిజానికి హీరోయిన్ పేరు రాధ‌, హీరో పేరు… శ్యామ్ అనుకున్నారంతా. అలా టైటిల్ జ‌స్టిఫికేష‌న్ చేశారేమో అనుకున్నారు. కానీ.. విక్ర‌మాదిత్య గా ప్ర‌భాస్ ని ప‌రిచ‌యం చేసి ట్విస్ట్ ఇచ్చింది చిత్ర‌బృందం. కాక‌పోతే…. ఈ సినిమాలో రాధ‌, శ్యామ్ కూడా ఉంటార‌ట‌. ఆ సంగ‌తేంటో త‌ర‌వాత చూడాలి. విక్ర‌మాదిత్య‌గా ప్ర‌భాస్ అవ‌తారం స్టైలీష్‌గా ఉంది. ఇట‌లీ నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. ఆ వాతావ‌ర‌ణం, రెట్రో క‌ల‌రింగు, కార్లు.. అన్నీ లుక్ లో క‌నిపిస్తున్నాయి. ప్ర‌భాస్ పుట్టిన రోజున మోష‌న్ పోస్ట‌ర్ రాబోతోంది. ఇది కేవ‌లం అడ్వాన్స్ గిఫ్టే. అస‌లు గిఫ్టు ముందుంద‌న్న‌మాట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్‌లో ఉండను : మల్లారెడ్డి

బీఆర్ఎస్‌లో ఉండేది లేదని మల్లారెడ్డి ప్రకటించారు. తాను పూర్తి స్థాయి రాజకీయ నాయకుడ్ని కాదని.. పార్ట్ టైమ్ రాజకీయ నేతను.. పూర్తి స్థాయి వ్యాపారవేత్తనని చెప్పుకొచ్చారు. తన వ్యాపారాలకు రక్షణ కోసమైనా...

లేటుగా వ‌చ్చినా ప్ర‌తాపం చూపిస్తున్న‌ ‘హ‌నుమాన్’

ఈ యేడాది సంక్రాంతికి విడుద‌లైన `హ‌నుమాన్` బాక్సాఫీసు ద‌గ్గ‌ర కొత్త రికార్డులు సృష్టించింది. చిన్న సినిమాగా వ‌చ్చి ఏకంగా రూ.300 కోట్ల మైలు రాయిని అందుకొంది. ఇప్పుడు ఓటీటీలో ప్ర‌త్య‌క్ష‌మైంది. ఇక్క‌డా.. 'హ‌నుమాన్‌'...

స‌మంత భ‌య‌పెట్టేస్తోంది

క‌థానాయిక‌ల పారితోషికంపై ఎప్పుడూ ఎడ‌తెగ‌ని చ‌ర్చ జ‌రుగుతూనే ఉంటుంది. స్టార్ హోదా వ‌చ్చిన క‌థానాయిక‌లు ఎప్ప‌టి క‌ప్పుడు త‌మ రేట్ల‌ని పెంచుకొంటూ పోతుంటారు. డిమాండ్ - అండ్ స‌ప్లై సూత్రం ప్ర‌కారం నిర్మాత‌లూ...

ఎన్డీఏ కూటమికి మందకృష్ణ సపోర్ట్ !

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపింది. ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేశారు. చంద్రబాబు హయాంలో మాదిగలకు మేలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close