ఒక్క పోస్ట‌ర్ … కాక రేపుతోంది

సినిమా వాళ్ళకి సినిమా వాళ్ళే శత్రువులు అనే మాట నిజమే అనిపిస్తుంటుంది. బయటనుండి వచ్చిన వివాదాలు కంటే ఇండస్ట్రీ జనాలే భలే వివాదాలు రేపుతుంటారు. మొన్న ఎంఎం కీరవాణి రేపిన వివాదం ఇంకా వేడిగానే వుంది. సినిమా సంగీతం, సాహిత్యం అంపశయ్యపై వుంది అంటూ ఏదేదో మాట్లదేశారు కీరవాణి. అసలు ఆయన ఎందుకంత ఎక్సయిట అయ్యారో తెలీదు. అయితే ఆయన మాటలను ఇండస్ట్రీ జనాలే ఈజీగా తీసుకోలేదు. కొంతమంది రచయితలు ఆయన్ని డైరెక్ట్ గానే ఏకీ పారేశారు. ”అయ్యా కీరవాణి గారు… అంపశయ్యపై వున్న సాహిత్యన్ని మీరే కాపాడాలి” అంటూ పంచ్ లు ఇచ్చేశారు. ఇక బయట జనాలు కూడా.. కీరవాణి స్వరపరిచిన కొన్ని డబల్ మీనింగ్ పాటలు.. కాలేజీపాపల బస్సు, ఏ సీటు చూసిన ఫ్రేస్సు, నీవు ఎత్తిచూపే.. నీవు ఎత్తిచూపే, గుండు సూది గుచ్చుకుంది.. పెట్టమంది పెట్టమంది పిల్లా.. నీక్కావలసింది నా దగ్గర వుంది.. ఇలా కొన్ని డబల్ మీనింగ్ పాటలను వుటకాయిస్తూ ”కీరవాణి గారు ఇవిగో.. మీ అమూల్య గ్రంధాలు అంటూ సెటైర్లు వేశారు.

అదలావుంటే.. ఇప్పుడు మంచు లక్ష్మి కూడా ఇలాంటి వివాదంలోకే వచ్చేసింది. వంశీ – రాజేంద్ర ప్రసాద్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ‘లేడీస్ టైల‌ర్’ సూపర్ హిట్. రొమాంటిక్ -కామెడి జానర్ ని తెలుగు తెరకు పరిచయం చేసిన చిత్రమిది. ఇప్పుడీ ఈ సినిమాకి సీక్వెల్ చేస్తున్నారు వంశీ. ‘ఫ్యాష‌న్ డిజైన‌ర్’ టైటిల్. తాజగా ఈ చిత్రం ప్రీ లుక్ ఒకటి విడుదల చేశారు. టైలర్ ఒక అమ్మాయి కొలతను తీస్తున్నట్లు వుంది ఈ లుక్. ఇప్పుడీ పోస్టర్ పై అభ్యంతరం చెప్పేసింది మంచు లక్ష్మి. ”అమ్మాయిలను ఇలా చూపించడం ఎప్పుడు ఆగుతుంది” అని ఓ కామెంట్ పాస్ చేసింది. దీనిపై హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా మద్దతు తెలిపింది. దీంతో చిత్ర నిర్మాత మధుర శ్రీధర్ వివరణ ఇచ్చాడు. సినిమాలో ఓ కీలక సన్నీవేశంలో ఫ్రేం అది. దాన్ని ప్రీ లుక్ గా వదిలాం. ఇంకా పూర్తి లుక్ రాలేదు. దయచేసి అర్ధం చేసుకోగలరు” అంటూ ఓ వివరణ ఇచ్చాడు.

అయితే ఇదంతా గమనించిన కొందరు నెటిజన్స్ మంచు లక్ష్మి ని కార్నర్ చేశారు. అసలు ఇందులో అభ్యంతరం ఏముందని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ముందుకు ‘లేడీస్ టైల‌ర్’ సినిమా చూసి ఆ సీక్వెల్ పోస్టర్ పై కామెంట్ చేయాలి అంటూ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. కొంతమంది అక్కడితో ఆగడం లేదు. మంచు లక్ష్మి నిర్మాణంలో వచ్చిన ఝుమ్మంది నాధం, గుండెల్లో గోదారి సినిమాల్లో రొమాంటి సన్నీవేషాలను స్క్రీన్ షాట్ తీసే.. ఆ పోస్టర్ పై అభ్యతంరం చెప్పినప్పుడు దీని సంగతి ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు. మీరెమంత గొప్పగా చూపించారు అంటూ నిలదిస్తున్నారు

అయితే ఇక్కడ ఎవరి వాదన వారిది. ఎవరి అభిప్రాయం వారిది. అయితే ఇలాంటి వివాదాలు ఇప్పుడు ఇండస్ట్రీ నుండే పుట్టడం ఒక్కింత ఆశ్చర్యకరంగా వుంది. అందులోనూ వంశీ లాంటి దర్శకుడి సినిమా కూడా ఇలా వివాదాల్లోకి వచ్చేయడం గమనార్హమే మరి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంచు వారి ‘ఓటీటీ’

ప్ర‌తీ సినీ కుటుంబానికీ ఓ నిర్మాణ సంస్థ ఉండ‌డం ఎంత స‌హ‌జంగా మారిందో, ఇప్పుడు ఓ ఓటీటీ సంస్థ ఉండ‌డం కూడా అంతే రివాజుగా మార‌బోతోంది. ఓటీటీ సంస్థ‌ల ప్రాధాన్యం క్ర‌మంగా పెరుగుతోంది....

వార‌సుడిపై దృష్టి పెట్టిన బాల‌య్య‌

లాక్ డౌన్ లో స్టార్లంతా ఇంటికే ప‌రిమితం అయ్యారు. వివిధ ర‌కాల వ్యాపాల‌తో బిజీగా మారారు. బాల‌కృష్ణ కూడా అంతే. అయితే ఈ విరామాన్ని ఆయ‌న త‌న వార‌సుడి కోసం కేటాయించారు. మోక్ష‌జ్ఞ...

క‌థ‌ల కోసం యూవీ అన్వేష‌ణ‌

యూవీ క్రియేష‌న్స్ పేరు చెప్ప‌గానే సాహో, రాధేశ్యామ్ లాంటి భారీ చిత్రాలు గుర్తొస్తాయి. అయితే ప్ర‌స్తుతం యూవీ చిన్న సినిమాల‌వైపు దృష్టి పెట్టింది. ఒకేసారి నాలుగైదు చిన్న సినిమాల్ని ప‌ట్టాలెక్కించే ప‌నిలో ఉంది....

చుండూరు దళితుల ఊచకోతకు 29 ఏళ్లు..! న్యాయం ఎప్పటికి..?

అది ఓ పచ్చని పల్లె. కానీ ఓ రోజు అక్కడి పంట కాలవల గోతాల్లో శవాలు బయటపడ్డాయి. ముక్కలు ముక్కలుగా నరికి గోతాల్లో కుక్కి అక్కడ పడేశారు. అందరూ దళితులు. మొత్తంగా ఎనిమిదిని...

HOT NEWS

[X] Close
[X] Close