జగన్‌పై దాడులు, రాజేశ్వర్‌పై దాడి వేరువేరా?

దేశవ్యాపితంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నిర్వహించిన దాడులలో జగన్‌తో సంబంధం వున్న రాజేశ్వరి ఎక్స్‌పోర్టు కూడా వున్నట్టు కథనాలు వచ్చాయి. అవాస్తవ లావాదేవీల పేరిట వందల కోట్టు దేశం దాటిస్తున్న ఆ కంపెనీ బాధ్యులను అరెస్టు చేసినట్టు కూడా వార్తలు తెలిపాయి. జగన్‌తో సంబంధం వున్న రాజేశ్వరి ఎక్స్‌పోర్ట్సు అని ఈడీ ట్వీట్‌ చేసినట్టు పెద్ద ఎత్తునే ప్రచారమైంది. ఈ ట్వీట్‌కు స్వంత కవిత్వం కలిపి తమపై బురద జల్లారంటూ జగన్‌ మూడు తెలుగు ఛానళ్లకు నోటీసు కూడా ఇస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఆ వార్త దేశమంతటా ఇంగ్లీషు పత్రికలలోనూ వెబ్‌సైట్లలోనూ విస్తారంగా ప్రసారమైంది. దానితోపాటు ఈడీ వర్గాల పేరిట వివిధ పత్రికలు ఇచ్చిన కథనాలలో కోట్‌ చేసిన భాగాలలో తేడాలున్నాయి. అలాగే ఈడీ ట్వీట్‌లోనూ భిన్నమైన వ్యాఖ్యానాలకు అవకాశం కలుగుతున్నది. జగన్‌ సంస్థలపైన,రాజేశ్వర్‌ ఎక్స్‌పోర్ట్సుపైనా దాడులు చేసినట్టు విడివిడిగా చూసే అవకాశం కూడా వాటిలో వుంది. జగన్‌ అంత గట్టిగా ఖండించడానికి కారణం ఇదే కావచ్చు. అయితే అలాఅనుకున్నా కూడా జగన్‌ సంస్థలపై దాడిచేసినట్టే భావించవలసి వుంటుంది. వాటి పేర్లేమిటి ఎక్కడున్నాయి వంటి వివరాలు ఈడీనే వెల్లడించాల్సి వస్తుంది.జగన్‌ రాజేశ్వరి సంస్థతో సంబంధం లేదని మాత్రమే ఖండించడం గమనించదగ్గది.కొన్ని పత్రికలు ఆయన ఖండన కూడా ఇవ్వగా నోటీసుకు గురైనవి మాత్రం తమ కథనంతోనే సరిపెట్టాయి. దీనిపై పూర్తి స్పష్టత రావాలంటే కొంత నిరీక్షణ తప్పకపోవచ్చు.

Some of the companies were involved in major money laundering cases related to Chaggan Bhujbal, YS Jagan Mohan Reddy, Yadav Singh, NHRM, AGS Infotech, Rajeshwar Exports etc while some other entities were found to have been used for laundering demonetised currency during post demonetization period,” the ED said in a statement.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close