రాజ్ త‌రుణ్‌.. గుండెజారింది

గుండెజారి గ‌ల్లంత‌య్యిందే సినిమాతో ఆక‌ట్టుకొన్న ద‌ర్శ‌కుడు కొండా విజయ్ కుమార్‌. ఆ త‌ర‌వాత నాగ చైత‌న్య‌తో తెర‌కెక్కించిన ఒక లైలా కోసం సినిమా ఫ్లాప్ అయ్యింది. దాంతో విజ‌య్‌కు గ్యాప్ వ‌చ్చేసింది. చాలామంది హీరోల‌కు క‌థ‌లు వినిపించినా వ‌ర్క‌వుట్ కాలేదు. నితిన్ కూడా ఛాన్స్ ఇచ్చినట్టే ఇచ్చి డ్రాప్ అయిపోయాడు. దాంతో విజ‌య్ వ‌న్ సినిమా వండ‌ర్‌గానే మిగిలిపోతాడేమో అనిపించింది. అయితే.. ఇప్పుడు ఓ యువ‌హీరోతో కొండా విజ‌య్ జ‌ట్టు క‌ట్ట‌బోతున్న‌ట్టు టాక్‌. త‌నే..రాజ్ త‌రుణ్‌. ఈమ‌ధ్యే కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త‌తో ఓ డీసెంట్ హిట్ అందుకొన్నాడు రాజ్ త‌రుణ్‌. ప్ర‌స్తుతం అంధ‌గాడు సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా సెట్స్‌పై ఉండ‌గానే.. కొండాతో సినిమాని ప‌ట్టాలెక్కించేయాల‌ని డిసైడ్ అయ్యాడ‌ట‌. పీవీపీ సినిమా సంస్థ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించే అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది. ఇదీ.. ఓ వినూత్న‌మైన ప్రేమ‌క‌థ అని, ఇద్ద‌రు క‌థానాయిక‌ల‌కు చోటుంద‌ని స‌మాచారం. పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లో తెలుస్తాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్‌కు గుడి కాదు చర్చి కట్టాలన్న ఆర్ఆర్ఆర్..!

తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ముఖ్యమంత్రి జగన్ కు గుడి కట్టడానికి ఏర్పాట్లు చేయడం.. భూమి పూజ చేయడం వివాదాస్పదమవుతోంది. ఖచ్చితంగా అయోధ్య రామాలయానికి శంకుస్థాపన జరుగుతున్నప్పుడే.. తలారి...

మంచు వారి ‘ఓటీటీ’

ప్ర‌తీ సినీ కుటుంబానికీ ఓ నిర్మాణ సంస్థ ఉండ‌డం ఎంత స‌హ‌జంగా మారిందో, ఇప్పుడు ఓ ఓటీటీ సంస్థ ఉండ‌డం కూడా అంతే రివాజుగా మార‌బోతోంది. ఓటీటీ సంస్థ‌ల ప్రాధాన్యం క్ర‌మంగా పెరుగుతోంది....

వార‌సుడిపై దృష్టి పెట్టిన బాల‌య్య‌

లాక్ డౌన్ లో స్టార్లంతా ఇంటికే ప‌రిమితం అయ్యారు. వివిధ ర‌కాల వ్యాపాల‌తో బిజీగా మారారు. బాల‌కృష్ణ కూడా అంతే. అయితే ఈ విరామాన్ని ఆయ‌న త‌న వార‌సుడి కోసం కేటాయించారు. మోక్ష‌జ్ఞ...

క‌థ‌ల కోసం యూవీ అన్వేష‌ణ‌

యూవీ క్రియేష‌న్స్ పేరు చెప్ప‌గానే సాహో, రాధేశ్యామ్ లాంటి భారీ చిత్రాలు గుర్తొస్తాయి. అయితే ప్ర‌స్తుతం యూవీ చిన్న సినిమాల‌వైపు దృష్టి పెట్టింది. ఒకేసారి నాలుగైదు చిన్న సినిమాల్ని ప‌ట్టాలెక్కించే ప‌నిలో ఉంది....

HOT NEWS

[X] Close
[X] Close