ప్రభాస్ చేతిలో మూడు పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయిప్పుడు. ‘ఫౌజీ’. ‘స్పిరిట్’ షూటింగ్ దశలో ఉన్నాయి. ‘కల్కి 2’ సెట్స్‌పైకి వెళ్లాల్సివుంది. ‘ఫౌజీ’ షూటింగ్ ఎప్పుడో మొదలైంది. దాదాపు సగం సినిమా పూర్తయ్యింది. మొన్నామధ్యే ‘స్పిరిట్’ సెట్స్ పైకి వెళ్లింది. లెక్క ప్రకారం ‘ఫౌజీ’నే ముందు విడుదల కావాలి. కానీ ఇప్పుడు అలా జరగడం లేదు. ‘ఫౌజీ’ కంటే ముందు ‘స్పిరిట్’ విడుదల కానుంది. 2027 మార్చి 5న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామంటూ నిర్మాతలు ప్రకటించేశారు. అయితే ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ మాత్రం ఇంత వరకూ వెల్లడించలేదు. ఆగస్టు లేదా సెప్టెంబరు నాటికి ‘ఫౌజీ’ చిత్రీకరణ పూర్తవుతుంది. అయితే ఆ తరవాత పోస్ట్ ప్రొడక్షన్ కి చాలా టైమ్ పట్టేట్టు వుంది. జనవరిలోగా విడుదల అయ్యే ఛాన్స్ లేదు. కాబట్టి ‘ఫౌజీ’ కంటే ముందే.. ‘స్పిరిట్’ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ‘స్పిరిట్’ విడుదలైన నాలుగైదు నెలల గ్యాప్ లో ‘ఫౌజీ’ రావొచ్చు.
నిజానికి ‘స్పిరిట్’ చిత్రాన్ని ఈయేడాది డిసెంబరు నాటికి సిద్ధం చేద్దామనుకొన్నారు. ఎందుకంటే సందీప్ ప్లానింగ్ పర్ఫెక్ట్ గా ఉంది. ఈ చిత్రాన్ని 95 కాల్షీట్లలోనే ముగించాలన్నది సందీప్ ప్లాన్. ప్రీ ప్రొడక్షన్ కూడా అంత పర్ఫెక్ట్ గా చేసుకొన్నాడు. అయితే డిసెంబరు కంటే.. వేసవికి రావడం బెటర్ అని, మార్చికి షిఫ్ట్ చేశాడు. మార్కెట్ లెక్కల ప్రకారం కూడా ‘ఫౌజీ’ కంటే ముందు ‘స్పిరిట్’ రావడమే బెటర్. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగా సినిమా క్రేజ్ వేరు. ప్రభాస్ ఫ్యాన్స్ కి కావల్సినంత మసాలా ఈ సినిమాలో దొరుకుతుంది. ఈసినిమా బాక్సాఫీసు దగ్గర బాగా ఆడితే.. ఆ తరవాత వచ్చే `’ఫౌజీ’ కి ప్లస్ అవుతుంది. పైగా ‘రాజాసాబ్’ ప్రభాస్ ఫ్యాన్స్ నిరుత్సాహంతో ఉన్నారు. వాళ్లకు కిక్ రావాలంటే ముందుగా ‘స్పిరిట్’ రిలీజ్ చేయడమే బెటర్.
