ఈవారం బాక్సాఫీస్‌: 4 థియేట‌ర్లో.. 3 ఓటీటీలో!

ఈవారం సినీ ప్రేమికుకుల కావ‌ల్సినంత వినోదం దొర‌క‌బోతోంది. 4 సినిమాలు థియేట‌ర్ల‌లో విడుదల అవుతున్నాయి. వీకెండ్ స‌ర‌దాగా ఇంట్లో కూర్చుని కాల‌క్షేపం చేయాల‌నుకుంటే మూడు సినిమాలు.. ఓటీటీలోనే వ‌చ్చేస్తున్నాయి. అంటే మొత్తంగా 7 సినిమాల‌న్న‌మాట‌. రోజుకో సినిమా చెప్పున కేటాయిస్తే.. వారానికి స‌రిప‌డా సినిమాలున్నాయి.

ఈవారం రాబోతున్న పెద్ద సినిమా.. ఖిలాడీ. క్రాక్ త‌ర‌వాత ర‌వితేజ నుంచి వ‌స్తున్న సినిమా ఇది. పోస్ట‌ర్లు, టీజ‌ర్‌, ట్రైల‌ర్‌.. ఇవ‌న్నీ ఫుల్ మాసీగా ఉన్నాయి. ర‌వితేజ కెరీర్‌లో అత్యంత భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కించిన చిత్ర‌మిదే అని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. హిందీలోనూ అత్య‌ధిక థియేట‌ర్ల‌లో ఈ సినిమాని విడుద‌ల చేస్తున్నారు. ఈనెల 11న రాబోతోంది. ఈ వారం ఎన్ని సినిమాలున్నా… స‌గ‌టు సినీ ప్రేమికుడి ఫ‌స్ట్ ఛాయిస్ మాత్రం ఖిలాడీనే.

డిజే టిల్లు, సెహ‌రి, ఎఫ్‌.ఐ.ఆర్‌.. ఈ మూడింటిపైనా దృష్టి పెట్టొచ్చు. 12న వ‌స్తున్న‌ డిజే టిల్లులో యూత్ కి కావ‌ల్సిన స‌రంజామా అంతా ఉంది. వేడి వేడి ముద్దులు, బోల్డ్ డైలాగుల‌తో.. ప్రేక్ష‌కుల్ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించే ప్ర‌య‌త్నం చేస్తోంది చిత్ర‌బృందం. విష్ణు విశాల్ న‌టించిన `ఎఫ్‌.ఐ.ఆర్‌` ట్రైల‌ర్ ఆక‌ట్టుకుంది. విష్ణు విశాల్ కి త‌మిళ్‌లో మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. త‌న క‌థ‌ల‌న్నీ కొత్త‌గా ఉంటాయి. అందుకే ఈ సినిమాపై దృష్టి పెట్టొచ్చు. `సెహ‌రి` కూడా యూత్ ఫుల్ క‌థే. ట్రైల‌ర్ క‌ల‌ర్‌ఫుల్ గా ఉంది.

ఇక ఓటీటీలోనూ సంద‌డి మామూలుగా లేదు. ప్రియ‌మ‌ణి ప్ర‌ధాన పాత్ర పోషించిన `భామా క‌లాపం` ఆహాలో వ‌స్తోంది. విక్ర‌మ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన `మ‌హాన్‌` అమేజాన్‌లో ఈనెల 10న విడుద‌ల కాబోతోంది. సుమంత్ – నైనా గంగూలీ జంట‌గా న‌టించిన `మ‌ళ్లీ మొద‌లైంది` జీ 5లో వ‌స్తోంది. ఇవ‌న్నీ కొత్త సినిమాలే. నేరుగా ఓటీటీలోనే విడుద‌ల అవుతున్నాయి. సో.. ఈ వారం వినోదాల‌కు ఢోకా లేన‌ట్టే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా?

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని సర్కార్ ప్రకటించినా... వాలంటీర్లలో అనుమానాలు ఇంకా అలాగే ఉన్నాయి. జులై మొదటి తేదీన సచివాలయం సిబ్బందితో ఫించన్ లు పంపిణీ చేసిన కూటమి ప్రభుత్వం.. వాలంటీర్ల అవసరం...

జ‌గ‌న్ కు ష‌ర్మిల సూటి ప్ర‌శ్న‌లు… జ‌వాబు చెప్పే ద‌మ్ముందా?

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై ఆయ‌న చెల్లి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో వైసీపీ చేసిన ధ‌ర్నా, అక్క‌డ జ‌గ‌న్ చేసిన...

ట్రంప్‌కు అంత ఈజీ కాదు !

అమెరికా అధ్యక్ష రేసులో ముందున్నానని ఆశల్లో తేలిపోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు గడ్డు పరిస్థితి ఎదురొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. డెమెక్రాట్ల అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఖరారు కావడంతో...

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

HOT NEWS

css.php
[X] Close
[X] Close