ఈరోజూ మీటింగ్ కాన్సిల్‌.. ఏమౌంతోది టాలీవుడ్‌లో?

టాలీవుడ్‌లో ఓ కీల‌క‌మైన జ‌ర‌గాల్సివుంది. సోమ‌వారం ఫిల్మ్ ఛాంబ‌ర్ ఆధ్వ‌ర్యంలో ఈ మీటింగ్ నిర్వ‌హిస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. కానీ సోమ‌వారం జ‌ర‌గలేదు. మంగ‌ళ‌వారం నాటికి వాయిదా ప‌డింది. అయితే ఈరోజూ ఈ మీటింగ్ జ‌ర‌గ‌డం లేదు. ఈ మీటింగ్ కి క‌చ్చితంగా రావాల్సిన స‌భ్యులు కొంద‌రు అందుబాటులో లేక‌పోవ‌డం వ‌ల్ల మీటింగ్ వాయిదా ప‌డుతూ వ‌స్తోంద‌న్న‌ది టాక్‌. కాక‌పోతే అంత‌ర్గ‌తంగా కార‌ణాలేమైనా ఉన్నాయా? అనేది తేల‌డం లేదు.

చిరంజీవి ఈ మీటింగ్ పై చాలా ఆసక్తి చూపిస్తున్నారు. సినిమావాళ్లందరినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చి, ప్ర‌భుత్వానికీ, సినిమా ప‌రిశ్ర‌మ‌కు ఉన్న గ్యాప్ ని త‌గ్గించాల‌న్న‌ది చిరు ప్ర‌య‌త్నం. అందుకే ఆయ‌నే స్వ‌యంగా రంగంలోకి దిగి, చిత్ర‌సీమ‌లోని ప్ర‌ముఖుల‌కు ఫోన్లు చేసి స‌మావేశానికి హాజ‌రు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. చాలామంది ఫోనుల్లో `వ‌స్తాం..` అని మాటిచ్చినా, తెల్లారేస‌రికి `అందుబాటులో లేం` అంటూ స‌మాధానం ఇస్తున్నార‌ని తెలుస్తోంది. దాంతో.. మీటింగ్ వాయిదా ప‌డుతూ వెళ్తోంది. `మీలో మీరు మాట్లాడుకుని ఓ నిర్ణ‌యానికి రండి..` అంటూ సీఎం జ‌గ‌న్ చిరుతో అన్నార‌ని. అందుకోసం చిరు ప్ర‌య‌త్నిస్తుంటే, ఎవ‌రూ క‌ల‌సి రావ‌డం లేద‌ని తెలుస్తోంది. వీళ్లంతా కూర్చుని మాట్లాడుకునేది ఎప్పుడు? ఏకాభిప్రాయంతో జ‌గ‌న్ ని క‌లిసేదెప్పుడు? జ‌గ‌న్ తో ఇవ‌న్నీ చ‌ర్చించి, ప‌రిశ్ర‌మ‌కు అనుకూల‌మైన ఓ నిర్ణ‌యం తీసుకునేది ఎప్పుడు? ఇవ‌న్నీ అందుబట్ట‌ని ప్ర‌శ్న‌లే. చిరంజీవే స్వ‌యంగా రంగంలోకి దిగి, అంద‌రినీ క‌లుపుకునిపోవాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నా, మీటింగ్ సాధ్యం కావ‌డం లేదంటే ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌య‌మే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బోల్డ్ గా భయపెట్టిన లైగర్

విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ ల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లైగర్ షూటింగ్ దాదాపు పూర్తయింది. తాజగా లైగర్ నుండి ఒక స్టన్నింగ్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. ఈ...

ఎన్టీఆర్ కథ గోపిచంద్ కు

దర్శకుడు హరి మాస్ సినిమాల స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్నారు. 'సింగం' ఆయన సక్సెస్ఫుల్ సిరిస్. ఈ సిరిస్ కి తెలుగులో కూడా ఆకట్టుకుంది. హరికి ఎప్పటి నుండో నేరుగా ఒక తెలుగు...

సీఎం జగన్ పేరుతో సైబర్ నేరాలు !

అప్పుడెప్పుడో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ. కోట్లు కొట్టేయడానికి దర్జాగా కోల్‌కతా సూట్ కేస్ కంపెనీల పేరుతో చెక్‌లు జమ చేశారు. ఆ కేసు ఇంత వరకూ తేలలేదు. కానీ ఇప్పుడు...

ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ – పబ్లిసిటీ బడ్జెట్ కోట్లకు కోట్లే !

సోషల్ మీడియా సంస్థలకు.. మీడియా సంస్థలకు పండగ లాంటి సమయం ఇది. వద్దంటే రాజకీయ పార్టీలు కుప్పలు కుప్పలుగా ప్రకటనలు ఇస్తున్నాయి. రూ. కోట్లకు కోట్లు ఆదాయం తెచ్చి పెడుతున్నాయి. ఇప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close